- వైద్య విద్యకు వైసీపీ చేసింది శూన్యం
- ఐదేళ్ల అధికారంలో అంతా ఆర్భాటమే
- కళాశాలల నిర్మాణాలు గాలికొదిలేశారు
- ఎన్నికల ముందూ హడావుడి డ్రామాలు
- వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే నీలివార్తలు
- కూటమి సర్కారుపై వైసీపీ విష ప్రచారం
- ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న జగన్‌రెడ్డి
అమరావతి (చైతన్య రథం): ప్రజలు ఛీకొట్టినా జగన్‌రెడ్డి విషప్రచారాలకు తెరపడటం లేదు. దిగజారుడు రాజకీయాలు మానడం లేదు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై అబద్ధాల సాక్షిలో నిత్యం దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందడం.. రాజకీయ దిగజారుడు తనానికి పరాకాష్ట. గడిచిన ఐదేళ్లలో జగన్‌రెడ్డి నిర్లక్ష్యమే.. వైద్య విద్యకు శాపమైంది. కొత్త మెడికల్ కళాశాలలకు ప్రాణసంకటమైంది. రాష్ట్రానికి కొత్తగా 17 మెడికల్ కాలేజీలు తెస్తున్నట్టు జబ్బలు చరుచుకున్న వైసీపీ `అధికారంలోవున్న ఐదేళ్లూ అరచేతిలో వైకుంఠం చూపించడం వినా.. చేసిందేమీ లేదు. అసమర్థ జగన్ సర్కారుకు నిర్దుష్ట ప్రణాళిక లేకపోవడంతో `కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం కోమాలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.
ఐదేళ్లూ వైద్య విద్యకు ద్రోహం చేసిన జగన్ సర్కారు `ఇప్పుడు ఎన్డీయే సర్కారు వైద్య విద్యకిస్తోన్న ప్రాధాన్యతలపై విషంగక్కడం సిగ్గులేనితనం. ప్రజాక్షేత్రంలో జగన్ సర్కారుకు దారుణ పరాభవం ఎదురైనా.. బుద్ధిమాలినతనంతో ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలే చేస్తున్నాడు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన తరుణంలోనూ.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై నిత్యం తప్పుడు కథనాలు ప్రచారంలోకి తెస్తూ అక్కసు వెళ్లగక్కుతున్నాడు.
రాష్ట్రంలో వైద్య విద్యకు ద్రోహం చేసిన జగను నిర్వాకాన్ని సరిదిద్దడానికి కృషిచేస్తున్న ఎన్డీయే సర్కారుపైనా `దుష్ప్రచారాలకు దిగడం ఓటమి తరువాతా వైద్య విద్యకు ద్రోహం చేయడమే. నిర్దుష్ట ప్రణాళికతో జగన్ సర్కారు ముందుకెళ్లివుంటే `ఈ ఏడాది 500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చివుండేవి. గత సర్కారు తప్పిదాన్ని సరిదిద్ది మెకికల్ విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సర్కారు సిద్ధం చేస్తోన్న ప్రణాళికకూ గత పాలకుడు మోకాలడ్డడం క్షమించరాని నేరం. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలను ప్రభుత్వ- ప్రయివేట్ భాస్వామ్యంలో నిర్వహించేందుకు గుజరాత్ విధానాన్ని అధ్యయనం చేయాలని రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన మంత్రిమండలి నిర్ణయించడం తెలిసిందే.
గత పాలకుడు చేసిన తప్పిదాన్ని సరిదిద్ది నిర్దుష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలన్న మంత్రిమండలి నిర్ణయంపై.. ప్రజాదరణలేని గత పాలకుడు అవాకులు చెవాకులు ప్రచారం చేయడం దుర్మార్గం. మంత్రిమండలి నిర్ణయమే నేరమన్నట్టు జగన్మోహన్‌రెడ్డి విషపుత్రిక సాక్షిలో హడావుడి చేయడం.. ఆ పార్టీ అనుసరిస్తోన్న రాష్ట్ర వ్యతిరేక విధానాలకు నిలువుటద్దం. దేశంలోనే ఏపీని ది బెస్ట్‌గా నిలపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా `వైద్య విద్యకు సంబంధించి పలు రాష్ట్రాలు ఏయే విధానాలు అవలంభిస్తున్నారో అధ్యయనం చేసి, ఉపయుక్తమైన విధానం అమలుకు కార్యాచరణ సిద్ధం చేయడం తప్పెలా అవుతుందో జగన్‌రెడ్డే చెప్పాలి. ఇటీవల ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి మంత్రి నారాయణ బృందం నవీ ముంబై వెళ్లి అభివృద్ధికి అనుసరించిన విధానాలనుపరిశీలించి వచ్చారు. జగన్‌రెడ్డి దృష్టిలో ఇదీ తప్పే కావొచ్చు? అమరావతి విధ్వంసానికి పాల్పడిన జగన్‌రెడ్డే.. మళ్లీ కొత్త ప్రణాళికలపైనా ఏదోకరోజు విషం జిమ్మడానికి సిద్ధపడొచ్చు.
జగన్ విషకౌగిలిలో మెడికల్ కళాశాలల విలవిల
గాల్లో మేడలుకట్టి.. సీట్ల భర్తీకి అనుమతులు కోరిన చిత్రమైన పరిస్థితి వైసీపీ ఏలుబడిలో సాధ్యమైంది. నిర్మాణాలు 40శాతం కూడా కాకుండానే.. బోధనా సిబ్బంది అందుబాటులో లేకుండానే.. విద్యార్థులకు వసతుల కల్పనపై దృష్టి పెట్టకుండానే `పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల మెడికల్ కళాశాలల్లో సీట్ల భర్తీకి అనుమతులు కోరిన వైసీపీ సర్కారును నేషనల్ మెడికల్ కమిషన్ ఛీ కొట్టింది. సీట్ల భర్తీకి అనుమతులు ఇవ్వలేమంటూ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నిజానికి 2023-24లో అనుమతి పొందిన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో ప్రమాణాలు కరవైనా.. అడ్మిషన్లకు అయిష్టంగానే అంగీకరించింది జాతీయ వైద్యమండలి. అదే ధైర్యంతో కనీస నిర్మాణాలు కూడా పూర్తికాని ఐదు మెడికల్ కళాశాలల్లో 2024`25 విద్యా సంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వాలంటూ జాతీయ వైద్యమండలిని కోరడంతో.. చీవాట్లు తప్పలేదు.
కేవలం ఎన్నికల కోసం డ్రామాలతో మెడికల్ స్టూడెంట్లను మభ్యపెట్టాలని చూసిన జగన్ బండారం అప్పుడే బయటపడిరది. కనీసం 40శాతం పూర్తికాని కాలేజీ నిర్మాణాలు చూపించి.. సీట్ల భర్తీకి అనుమతికోరి.. భారీగా మెడకల్ సీట్లు అందుబాటులోకి తెస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. 2024`25 ప్రవేశాల నిర్వహణకు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చేందుకు ఎన్‌ఎంసి నిరాకరించడంతో వైసీపీ సర్కారు ఖంగుతింది. నిజానికి `నిర్దుష్ట ప్రణాళికతో వెళ్లివుంటే.. గత ఏడాది ఆగస్టులో ప్రతి కళాశాలలోనూ ఎంబీబీఎస్ 100 సీట్లు చొప్పున భర్తీకి అనుమతులు వచ్చివుండేవి. కాకపోతే.. ఎన్‌ఎంసి బృందాలు ఐదు కళాశాలల్లో తనిఖీలు చేసి బండారం బయటపెట్టింది. ఏమాత్రం భవన నిర్మాణాలు పూర్తికాకపోవడం, అన్నిచోట్లా బోధనా సిబ్బంది కొరత, లెక్చర్, లేబరేటరీ, టీచింగ్, హాస్టల్ బ్లాక్స్‌లాంటివేవీ పూర్తికాకపోవడాన్ని జాతీయ వైద్యమండలి గమనించింది.
ఇదేమని ప్రశ్నించిన మండలికి.. అనుమతులు వచ్చేనాటికి అన్నీ పూర్తి చేస్తామంటూ పిచ్చి సమాధానం ఇచ్చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. కాని, భవన నిర్మాణాలకు పెండిరగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. కాంట్రాక్టర్లకు రూ.200 కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో వారు మధ్యలోనే నిర్మాణాలు వదిలి వెళ్లిపోయారు. పైగా బోధన, బోధనేతర సిబ్బందిపైనా సరైన ప్రణాళిక లేకపోవడం కూడా పెను శాపమైంది. తదుపరి వర్చ్యువల్ తనిఖీల్లోనూ రాష్ట్ర అధికారుల నుంచి ఎన్‌ఎంసికి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో.. సీట్ల భర్తీకి అనుమతులు ఇవ్వలేమంటూ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పాలక మూకలు, విషపుత్రిక సాక్షి నీలి కథనాలకు తెగబడుతున్నాయి.
వైద్య విద్యకు చుక్కాని.. ఎన్టీఆర్, చంద్రబాబు
అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో 1986లో విజయవాడకు హెల్త్ యూనివర్సిటీ తెచ్చారు. అలాగే అమెరికా నుంచి ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావును స్వదేశానికి రప్పించి హైదరాబాద్ నిమ్స్‌కు డైరెక్ట్‌ను చేసి ఆస్పత్రిని తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఆశయ సాధనను మరింత ముందుకు తీసుకెళ్తూ.. జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 22 మెడికల్ కాలేజీలతోపాటు కేంద్రంతో మాట్లాడి మంగళిగిరిలో ఎయిమ్స్, తిరుపతిలో బర్డ్ ఆస్పత్రి, టాటా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ తెచ్చిన ఘనత చంద్రన్నదే. 2015లో కేంద్రం నుంచి చంద్రబాబు ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి మంగళగిరిలో 197 ఎకరాల భూమి కేటాయించారు.
చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చిన ఎయిమ్స్‌కు కృష్ణా, గుంటూరు జిల్లాలనుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచీ రోగులువచ్చి వైద్యసేవ అందుకుంటున్నారు. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్న అదే ఎయిమ్స్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు జగన్‌రెడ్డి. చంద్రబాబు ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నంలో ఎయిమ్స్‌కు నీటివసతి కల్పించకుండా నిర్లక్ష్యం చేశాడు. ఆస్పత్రి రహదారి నిర్మాణం పూర్తికాకుండా ఆటంకాలు సృష్టించాడు. రాష్ట్ర వైద్య రంగానికే శాపంగా పరణమించిన జగన్‌ను ప్రజలు తరిమికొట్టినా.. పన్డీయే పాలనలో మెరుగుపడుతున్న పరిస్థితికి మోకాలడ్డడం క్షమించరాని నేరం, సహించరాని పాపం. ప్రజల చేతిలో చావుదెబ్బకు మరోసారి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు జగన్!