- ఇందులో భాగంగానే వైసీపీకి రూ.160 కోట్ల బాండ్లు
- ఏపీని దేశంలో నెం.1గా నిలపాలన్నదే మా ఎజెండా
- మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్
మంగళగిరి, చైతన్యరథం: అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జె-గ్యాంగ్ ఇప్పటికే రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి మయం చేశారని, గ్యాంబ్లింగ్‌ను కూడా చట్ట బద్ధం చేయాలని ప్రయత్నించారని యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి వజ్ర రెసిడెన్సీ వాసులతో యువనేత ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 2020లోనే రాష్ట్రానికి గ్యాంబ్లింగ్ తేవాలని ప్రయత్నించారు, ఇందు లో భాగంగానే ఒక లాటరీ అండ్ గేమింగ్ కంపెనీ నుంచి వైసీపీకి రూ.160కోట్ల ఎలక్టొరల్ బాండ్లు అందాయి. ఇలాంటి వారికి అధికారమిస్తే రాష్ట్రం ఏమ వుతుందో ప్రజలంతా ఆలోచించాలి.ప్రజలంతా చైతన్య వంతులై మై ఓట్ నాట్ ఫర్ సేల్ అని గట్టిగా చెప్పాలి.
ఏపీనీ నెంబర్ వన్‌గా చేస్తాం
ఏపీని నెం.1గా తయారుచేయాలన్నది టీడీపీ ఎజెం డా. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఉన్నారు, వారిని రాష్ట్రానికి రప్పిం చాలంటే నమ్మకం కలిగించాలి. మరోమారు రాష్ట్రంలో వైసిపి రాదనేలా ఆ పార్టీని ఓడిస్తేనే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలుగుతుంది. జగన్ అధికారంలోకి వచ్చాక జె-ట్యాక్స్ విధానాలతో పిపిఎలు రద్దుచేశారు, కియాకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు, ముఖ్య మంత్రి స్వయంగా దావోస్ వెళితే ఒక్క పరిశ్రమ రాలేదు. జగన్ విధ్వంసక విధానాలవల్ల వెనుక బడిన ఒరిస్సాకు వెళ్లడానికి కూడా పారిశ్రామికవేత్తలు సిద్ధ మయ్యారు కానీ, ఏపీకి మాత్రం రావాలంటే భయ పడుతున్నారు. పరిశ్రమదారుల్లో దెబ్బతిన్న నమ్మకాన్ని పునరుద్దరించి మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుంది.
20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం
గతంలో గన్నవరం వద్ద తాము తెచ్చిన హెచ్ సిఎల్ ఐటి కంపెనీ ద్వారా దాదాపు 7వేలమందికి ఉద్యోగాలు లభించాయి. ఐటి పరిశ్రమ అభివృద్ధికి విశాఖపట్నంలో అనువైన వాతావరణం ఉంది. ఆ ప్రాంతాన్ని ఐటి హబ్ గా మార్చేందుకు కృషిచేస్తాం. ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. ఇందులో భాగంగానే గతంలో అనంతపురానికి ఆటోమొబైల్స్, చిత్తూరుకు ఎలక్ట్రానిక్స్, కర్నూలుకు సోలార్, గోదావరి జిల్లాలకు ఆక్వా పరిశ్రమలు, విశాఖకు ఐటి తెచ్చాం. చంద్రబాబు ని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది.
జగన్ జైలుకెళితే ఆయన చేసిన వేలకోట్ల కుంభకోణాలు బయటపడ్డాయి. రెండునెలల్లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి, 20లక్షల ఉద్యోగాల కల్పించే అంశాన్ని ఛాలెంజ్‌గా స్వీకరిస్తాం.
పన్నుల భారంపై పున:సమీక్ష
2014లో ఆంధ్రులు కోరుకోని విభజన వల్ల కట్టు బట్టలతో బయటకు రావాల్సివచ్చింది, అలాంటి గడ్డు పరిస్థితుల్లోనే చంద్రబాబునాయుడు అహోరాత్రులు శ్రమించి, రాష్ట్రానికి 40వేల పరిశ్రమలు రప్పించి 6లక్షల ఉద్యోగాలు కల్పించారు. జగన్ అయిదేళ్ల పాల నలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కివెళ్లింది, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా టిడిపి-జనసేన-బిజెపి పొత్తు పెట్టకున్నాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలను గౌరవిస్తూ సామాజిక బాధ్యత పెంచేలా విద్యావిధానం లో సమూల మార్పులు తెస్తాం. మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి సంక్షేమానికి కృషిచేస్తాం.జగన్మోహన్రెడ్డి అడ్డగోలుగా మోపిన పన్ను ల భారంపై పునఃసమీక్ష చేసి రాష్ట్రప్రజలకు ఉపశమ నం కలిగిస్తాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాబోయే ఎన్ని కల్లో ప్రజలంతా కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి భారీ మెజారిటీలతో గెలిపించాలని యువనేత లోకేష్ విజ్ఞప్తిచేశారు