చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎదురుదెబ్బలు తగిలినా పైకి లేవాలి

పాలిటెక్‌ ఫెస్ట్‌లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Jan 8, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎదురుదెబ్బలు తగిలినా పైకి లేవాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అధునాతన ఆవిష్కరణలను ప్రోత్సాహం
  • ఇన్నొవేషన్‌, ఇంక్యుబేషన్లకు ప్రాధాన్యత
  • అందుకే రతన్‌ టాటా ఇన్నొవేషన్‌ హబ్‌ ఏర్పాటు
  • పాలిటెక్‌ ఫెస్ట్‌లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌

అమరావతి (చైతన్యరథం): జీవన ప్రయాణంలో అనేక ఇబ్బందులు వస్తాయి.. ఎదురుదెబ్బలు తగలొచ్చు.. కిందపడ్డాక ఎంత త్వరగా పైకి లేస్తామనేది ముఖ్యం.. అనుకున్నది సాధించేవరకు పట్టువదలొద్దని విద్యార్థులకు రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పిలుపు ఇచ్చారు. విజయవాడ లబ్బీపేట ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన పాలిటెక్‌ ఫెస్ట్‌కు మంత్రి లోకేష్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు అధునాతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… నేను విద్యాశాఖ మంత్రి అయినపుడు.. మన ఐటిఐ, పాలిటెక్నిక్‌లు ఒకస్థాయికి వచ్చాయి, ఇక్కడితో ఆగకూడదు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తయారుకావాలి, మార్కెట్‌ లింకేజి అవసరమని హెచ్‌ఆర్‌డీ కార్యదర్శితో చెప్పానన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఇంత అద్భుతమైన పిల్లలు, ఐడియాలు ఉన్నాయని ఈ రోజే తెలుసుకున్నాను.

2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిందే ఈ పాలిటెక్‌ ఫెస్ట్‌. పిల్లలకు వారి ఐడియాలను పంచుకునే అవకాశాలు కల్పించాలి, వారు చేపడుతున్న ప్రాజెక్టులు అందరికీ చూపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఇక్కడితో ఆగకూడదు. నేను ఈరోజు చూసిన ఐడియాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈశ్వర్‌, లక్ష్మీశరణ్య తయారుచేసిన అటమిక్‌ సర్వీసెస్‌ ఫైర్‌ డిటెక్షన్‌ చూశాను. తొలుత చేయలేకపోయి బాధపడ్డారు. తర్వాతి ప్రయత్నంలో డిమానిస్ట్రేషన్‌ చేశారు. వారిని నేను అభినందిస్తున్నా. దాదాపు 1256 ప్రాజెక్టులు చూపించారు, 249 టాప్‌ ప్రాజెక్టులు స్టేట్‌ లెవల్‌కు తెచ్చారు. అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నేను కూడా స్కూలింగ్‌ సమయంలో కారు తయారు చేశా. మీ ప్రాజెక్టులు చూశాక నేను తయారు చేసింది చాలా చిన్నదని తేలిపోయింది. ఒక పక్క కేంద్రం సహకారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాలను ఆవిష్కరించారని మంత్రి లోకేష్‌ ప్రశంసించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-03-2026

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

ఇదొక ఈవెంట్‌ కాదు…. మూమెంట్‌
ఈ సందర్భంగా కొన్ని విజయగాథలను మీ దృష్టికి తెస్తున్నా. యాపిల్‌ ఫౌండర్‌ స్టీవ్‌ జాబ్స్‌ ఆలోచనలను అమలుచేసేందుకు బోర్డు ఒప్పుకోకపోతే కంపెనీని వదిలి వెళ్లారు. ఆ తర్వాత బోర్డు ఆహ్వానం మేరకు మళ్లీ వచ్చి ప్రపంచంలో మోస్ట్‌ వాల్యుబుల్‌ కంపెనీగా తయారు చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవంతో ఆయన అధైర్య పడలేదు. 2007లో ఐఫోన్‌ ప్రవేశపెట్టినపుడు 600 డాలర్ల ఫోన్‌ ఎవరు కొంటారని అనుకున్నా. ఆ తర్వాత అది సమాజంలో ఎంత ప్రభావం చూపిందో మీకు తెలుసు. మరొక ప్రముఖ వ్యక్తిని కూడా ప్రసావిస్తున్నా. అతని పేరు శ్రీధర్‌ వెంబు. జోహో కంపెనీని భారత ప్రీమియర్‌ ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీగా తయారుచేశారు. గ్రామాల్లో కూడా అద్భుతమైన పిల్లలు ఉన్నారు. ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ తిరుపతి సమీపంలోని నా గ్రామంలో ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇప్పుడు అది మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రొడక్ట్‌ కంపెనీ.

ఎంతోమంది స్ఫూర్తివంతమైన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మన కోసం, సమాజం కోసం అధునాతన ఆవిష్కరణలు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజు భారతదేశంలో అతిపెద్ద విండ్‌ మిల్‌ కంపెనీ అయిన సుజ్లాన్‌ అనే సంస్థతోతో సెంటర్‌ ఆప్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు కోసమే కాకుండా కరిక్యులమ్‌తో పాటు ఇన్నొవేషన్‌ ప్రాజెక్టు ఇంక్యుబేషన్‌ చేసే ఆలోచనతో ఒప్పందం కుదుర్చుకున్నాం. భారతదేశంలో ఉన్న మేకిన్‌ ఇండియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఇన్నొవేటివ్‌ ఐడియాలను ఇంక్యుబేట్‌ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫెస్ట్‌ ఒక ఈవెంట్‌ కాదు… ఇదొక మూమెంట్‌. ప్రధాని మోదీ మేక్‌ ఇండియా అని పదేపదే చెబుతున్నారు. సెల్‌ఫోన్‌లు, టీవీలు అన్ని కూడా చైనా, తైవాన్‌లో తయారుచేస్తారు. దానికి మనం ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి. మనమే వాటిని తయారుచేసే స్థాయికి ఎదగాలని మంత్రి లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

ఇంక్యుబేషన్‌, ఇన్నొవేషన్‌కు ప్రోత్సాహం
ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది మా విధానం. ఇందుకు అవసరమైన ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. వెనుకబడిన జిల్లా అనంతపురానికి కియా కంపెనీ తెచ్చాం. అక్కడ ఉన్న పాలిటెక్నిక్‌, ఐటిఐల్లో ఆటోమోటివ్‌ మొబిలిటీ ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయమై ఆలోచిస్తున్నాం. కర్నూలును డ్రోన్స్‌ హబ్‌ గా తీర్చిదిద్దుతామని ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. డ్రోన్స్‌ ఇన్నొవేషన్‌కి కావాల్సిన మెంటారింగ్‌ను అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. కడప, చిత్తూరుల్లో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. టీవీలు, సెల్‌ ఫోన్‌లు, కెమెరా మాడ్యూల్‌లు తయారుచేసే సంస్థలు అక్కడ వచ్చాయి. ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్‌ పరిశ్రమల ఏర్పాటుకు రిలయన్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ఒక్కొక జిల్లాకు ఒక్కొక ప్రాధాన్యతతో ఎకో సిస్టమ్‌ ఏర్పాటుచేస్తున్నాం. అందుకు అవసరమైన ఇంక్యుబేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్రియేట్‌ చేస్తున్నామని మంత్రి లోకేష్‌ తెలిపారు.

అందుకే రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌
రతన్‌ టాటా గురించి నేను ఏం చెప్పినా తక్కువే. ఒకరోజు క్రితమే ఉండి నియోజకవర్గంలో రతన్‌ టాటా విగ్రహం ఆవిష్కరించా. రతన్‌ టాటా పేరుతో ఒక ఇన్నొవేషన్‌ హబ్‌ ఏర్పాటుచేసి, అందుకు అనుబంధంగా నోడ్‌లు ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. మీలాంటి సృజనాత్మక ఐడియాలు ఉన్నవారిని ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. సృజనాత్మకమైన ఐడియాలతో ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించాలని జీఏడీకి ఆదేశాలు ఇచ్చాం. అందుకు అవసరమైన ఎకనమిక్‌ యాక్టివిటీ ఎలా క్రియేట్‌ చేయాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తాం. ఈరోజు ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారికి క్యాష్‌ అవార్డులను ప్రభుత్వం అందిస్తుంది. విద్యార్థుల వద్ద ఉన్న ఐడియాలకు కార్యరూపమిచ్చే వరకు వదిలిపెట్టొద్దని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.

అపజయం విజయానికి తొలిమెట్టు
అపజయం విజయానికి తొలిమెట్టు లాంటిది. అందుకు నేనే ఉదాహరణ. 2019లో నేను పోటీచేయాలని ఆసక్తి చూపిస్తే ఎక్కడ నుంచి పోటీచేస్తావని చంద్రబాబు అడిగారు. ఎప్పుడూ గెలవని నియోజకవర్గం మంగళగిరి అడిగాను. అక్కడ 1985 తర్వాత టీడీపీ గెలవలేదు. 2019లో తొలి ప్రయత్నంలో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయా. తొలుత బాధపడినా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. అయిదేళ్లు కష్టపడి పనిచేశా. ఇటీవల ఎన్నికల్లో ఏపీ చరిత్రలో టాప్‌ -3 మెజారిటీ 91వేల మెజారిటీతో గెలిచా. ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రి.. మీరు ఏ శాఖ ఆశిస్తున్నారని అడిగితే విద్యాశాఖ కావాలని అడిగా. కష్టమైన, సమస్యాత్మక శాఖ అన్నారు. అందుకే ఆ శాఖ కావాలని అడిగా. ఆ శాఖలో సంస్కరణలు అమలుచేయడం చాలా కష్టమని చెప్పారు. అందుకే నేను ఛాలెంజ్‌ గా తీసుకొని పనిచేస్తున్నా. సవాళ్లను స్వీకరించినపుడే మీలోని ప్రతిభ బయటకు వస్తుంది. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేదు. మీరు చేసే ప్రయాణంలో పది దెబ్బలైనా తగలొచ్చు. పట్టువదలకుండా పోరాడి అనుకున్నది సాధించాలి.

అద్భుతమైన ఐడియాలను ఆవిష్కరించిన పాలిటెక్నిక్‌ విద్యార్థులను అభినందిస్తున్నా. అధునాతన ఆవిష్కరణలకు మద్దతు ఇస్తాం.  రాష్ట్రంలో 8వేల కోట్ల విలువైన స్టార్టప్‌ కంపెనీ రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో రావాలని నేను కోరుకుంటున్నా. 1995 ` 2004 నడుమ చంద్రబాబు సీఎంగా పనిచేసినపుడు డేర్‌ టు డ్రీమ్‌.. స్ట్రైవ్‌ టు ఎచీవ్‌ అని చెప్పారు. ఆయన మాటలను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని విద్యార్థులకు మంత్రి లోకేష్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, కలెక్టర్‌ లక్ష్మీషా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

పుస్తకాల బరువు తగ్గించి..నాణ్యత పెంచండి!

Next Post

రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-03-2026

కార్యకర్త
@ March 11, 2026
16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

చైతన్యరధం
@ March 11, 2026
ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

చైతన్యరధం
@ March 11, 2026
యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు
ఆంధ్రప్రదేశ్

యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు

చైతన్యరధం
@ March 11, 2026
‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ
ఆంధ్రప్రదేశ్

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
తెలుగు వైభవానికి అమరావతి ప్రతీక
ఆంధ్రప్రదేశ్

తెలుగు వైభవానికి అమరావతి ప్రతీక

చైతన్యరధం
@ March 11, 2026
రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం
ఆంధ్రప్రదేశ్

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం
ఆంధ్రప్రదేశ్

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
Load More

ముఖ్య వార్తలు

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

చైతన్యరధం
@ March 11, 2026
ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

చైతన్యరధం
@ March 11, 2026
యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు

యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు

చైతన్యరధం
@ March 11, 2026
‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist