- ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి
- ప్రభుత్వానికి లోకేష్ విజ్ఞప్తి ?
అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మెండివైఖరితో పేదల ఆరోగ్యంతో చెలగా టం ఆడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటంపై లోకేష్ అందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి సమస్యను సామరస్యంగా పరి ష్కరించి పేదలకు వైద్యసేవలు అఅందు బాటులోకి తీసుకురావాలని ఒక ప్రకటన లో లోకేష్ విజ్ఞప్తి చేశారు. అస్తవ్యస్త పాలన తో రాష్ట్ర ఖజానా ఖాళీచేసిన జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పటల్స్‌కు దాదాపు రూ.1200కోట్లు బకాయి పెట్ట డంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలచిపోయాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో సైతం ఆసుపత్రుల యాజ మాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయ డంతో పేదలకు వైద్యం గాలిలో దీపంలా మారింది. బకాయిలు విడుదల చేసి సమ స్యను పరిష్కరించడంలో చొరవచూపని ప్రభుత్వం…ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ జాబి తా నుండి తొలగిస్తూ బెదిరింపులకు దిగ డం దారుణం. అత్యవసరమైన వైద్యసేవల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయ కులను బలిపశువులుగా మార్చొద్దు. లక్షలా ది పేదల ప్రాణాలతో ముడిపడిన ఆరోగ్య సేవల విషయంలో మొండివైఖరి విడనాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించేం దుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్‌కు సొంత జిల్లాలోనే షాక్..
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవ డంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటంతో ఆస్పత్రుల యాజమా న్యాలు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయా లని నిర్ణయించాయి. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా ప్రభుత్వానికి ఆస్పత్రుల యాజమాన్యాలు షాక్ ఇచ్చా యి. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు కడప నగరంలో పలు ఆస్పత్రులు బోర్డులు కూడా పెట్టేశాయి. కడపలో మొత్తం 18 ఆస్పత్రులకు గాను 17 ఆస్పత్రులు.. ఆరో గ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు బోర్డులు పెట్టాయి. సీఎం సొంత ఇలాకాలో ఇదేం అవమానం అని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బోర్డులు పెట్టిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడా నికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే రాజమండ్రిలో 14, విశాఖలో నాలుగు ఆస్పత్రులను నెట్‌వర్క్ ఆసుపత్రు ల జాబితానుంచి తొలగిస్తూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు ఆసుపత్రులు గురువారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేశాయి. ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రూ.1200 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం హడావిడి గా రూ.190 కోట్ల బకాయిలు విడుదల చేసింది. అయితే మొత్తం బకాయిలు విడు దల అయ్యే వరకు చర్చలకు వెళ్లవద్దని ఆసుపత్రుల యాజమాన్య కమిటీకి ఆస్ప త్రులు స్పష్టం చేశాయి. గత నెలలో జరి గిన చర్చల్లో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.