అమరావతి: వైద్యరంగంపై సీఎం జగన్ బొంకుడు ప్రకటనలు మాని.. ముందు ఎయిమ్స్ నీటి సమస్య ను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హితవుపలికారు. ఈ మేరకు తాజాగా పత్రికల్లో వచ్చిన వార్తలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌కు కనీసం నీటి సరఫరా చెయ్య లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. అసలు వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా? నాడు తెలుగుదేశం హయాంలో ఎయిమ్స్ కు భూములు ఇచ్చి, వసతులు కల్పించి వైద్య సేవలకు ఈ ప్రతి ష్టాత్మక సంస్థను సిద్దం చేశాం. అటువంటి సంస్థ పెరిగిన తమ అవసరాల కోసం అదనంగా నీటి వన రులను సమాకూర్చాలని లేఖలు రాసినా పరిష్కరించక పోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.
రాష్ట్రంలో మెడికల్ కాలేజ్‌లు అన్నీ తామే తెచ్చా మని అసెంబ్లీలో సైతం అసత్యాలు చెప్పుకున్న ముఖ్య మంత్రి తానుంటున్న మునిసిపాలిటీ నుంచి ఆసుపత్రి కి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిం చినా స్పందించనిఈ ముఖ్యమంత్రి.. వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే అని బొంకుతున్నాడు. మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్‌కు అవ సరమైన అన్నిఅదనపు మౌలిక సదుపాయాలు కల్పిం చాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి విజ్జప్తిచేశారు.