- ఉద్యానపంటలతో అద్భుతాలు సృష్టిద్దాం
- అనంతను ప్రపంచంతో అనుసంధానిస్తా
- 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్
- రైతును రాజు చేసే పూచీ నాదీ..
- సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి ప్రాధాన్యత
- బాబు వస్తే.. జాబు గ్యారెంటీ
- యువతకు 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు
- మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెడతా
- బీసీల బాగుకు సిద్ధమైన ‘డిక్లరేషన్’
- జగన్ కట్టుకథలు నమ్మితే మునిగిపోతాం
- రాప్తాడు ప్రజాగళంలో తెదేపా అధినేత చంద్రబాబు
రాప్తాడు (చైతన్య రథం): రాళ్లసీమగా మారిన రాయలసీమపై గోదావరి గలగలలు వినిపిస్తానని తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అచెంచల విశ్వాసంతో ప్రకటించారు.గోదావరి జలాలు రాయలసీమకు తీసుకువచ్చి, ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత టీడీపీ, ఎన్డీయే తీసుకుంటుందని హామీ ఇచ్చా రు. ‘నీళ్లొస్తే పరిశ్రమలొస్తాయి. ఉద్యానపంటలొస్తాయి. పంట ఫలాలతో రైతు ఆదాయం పెరుగుతుంది. దాం తో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆ సొమ్మును సంక్షేమానికి ఖర్చు చేయొచ్చు. సంపద సృష్టించడం తెలిసినపార్టీ టీడీపీ విజన్ ఇదీ’ అని చంద్రబాబు అశేష జనవాహిని కేరింతల మధ్య ప్రకటించారు. రాష్ట్రానికి సంపద వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టును దాదాపు పూర్తిచేస్తే, మిగిలిన పనులు కూడా పూర్తిచేయలేని అస మర్థ జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును గోదారి పాల్జేసిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగళం ఎన్నికల యాత్రలో భాగంగా గురువారం తొలి సభను రాప్తాడులో నిర్వహించారు. ప్రజాగళానికి పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ `సీమ సమస్యలు సంపూర్ణంగా పరిష్కారం కావాలంటే సైకిల్ కు, దాని మిత్రపక్షాలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతపురం నుంచి మహబూబ్‌నగర్ వరకూ తీవ్ర కరవు నెలకొని ప్రజలు వలసలు పోతున్న దైన్యాన్ని చూడలేకే ` దివంగత ఎన్టీఆర్ హంద్రీనీవాను ప్రారంభించారని గుర్తు చేశారు.
సీమ జిల్లాల కరవును ఎదుర్కోడానికి తెలుగుదేశం పార్టీ ఆదినుంచీ నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా జలాలు అనంతపురానికి తెచ్చే ఆలోచనతో 2014లోనే జీడిపల్లి, చెర్లోపల్లి, మారాల ప్రాజెక్టు పూర్తిచేశామని గుర్తుచేశారు. నీటి సౌకర్యంలేని రాష్ట్రానికి ఎలా వచ్చేదంటూ కియా యాజమాన్యం ప్రశ్నించినపుడు`ఆర్నెల్ల కాలంలో యుద్ధప్రాతిపదికన గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తిచేసి.. కియా కార్ల పరిశ్రమ ఇక్క డ వేళ్లూనుకునేలా చర్యలు తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. పేరూరు సహా ప్రతిజిల్లాలో ప్రతీచెరువుకూ నీళ్లివ్వాలను కోవడం తప్పా? అని చంద్రబాబు నిలదీశారు. ఉద్యాన(పండ్ల తోటలు,కూరగాయలు) పంటలను అభివృద్ధిచేసి అనంత ను ప్రపంచంతో అనుసంధానించే ఉద్దేశంతో 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. అందుకోసం ఎన్నో చెక్‌డ్యాం లు, పంటకుంటలు తవ్వించామని, అవన్నీ వైసీపీ ప్రభు త్వంలో ఉన్నాయా అని ప్రశ్నించారు.
2019లో పోటు గాడు వస్తాడని నమ్మి మోసపోయారన్నారు. 52 స్థానాల్లో 49స్థానాలు వైసీపీకి ఇస్తే.. ఆ ప్రభుత్వం ఏం ఒరగబెట్టిం దని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ హయాంలో నీటి ప్రాజెక్టుల కోసం 68వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతూ.. ఒక్క సీమ ప్రాజెక్టులకే 12వేల కోట్లు వెచ్చించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐదేళ్లు పదవిలో వున్న జగన్ 2వేల కోట్లు కూడా వెచ్చించలేదని వివరి స్తూ..సాక్షిపత్రిక ప్రకటనకు ఇచ్చినమొత్తంపాటి సొమ్ములు కూడా సీమ రైతుల కోసం ఖర్చుచేయని దుర్మార్గుడు జగన్‌రెడ్డి అని దుయ్యబట్టారు. సీమవాసులు పునరాలో చన చేసి, 52స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని చంద్ర బాబు విజ్ఞప్తిచేశారు. జగన్‌రెడ్డి ఒక సైకో అయితే,సీమ సెగ్మెంట్లలో పిల్లసైకోలు తయారయ్యారని..ఫ్యాన్‌కు ఓటేసిన వాళ్లు నేడు అదే ఫ్యాన్‌కి ఉరేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.
జగన్ ఏం ఉద్దరించాడు..?
ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ఢంకాబజాయించిన జగన్`అధికారంలోవున్న ఐదేళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి బిల్లులు డబుల్ చేశాడ న్నారు. ఐదేళ్లలో ఒక్కో కుటుంబంపై గరిష్టంగా 30వేల రూపాయల భారం పడిరదన్నారు. తెదేపా హయాంలో ఒక్కసారీ విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు.సమర్థ పాల నకీ, అసమర్థుడికీ అదే తేడా అంటూ జగన్‌ను ఎద్దేవా చేశారు.జగన్ హయాంలో మోటార్లకు మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడు తగిలిస్తే.. కూటమి ప్రభుత్వ పాలనలో రైతుకు మంచి రోజులు వస్తున్నాయని ధైర్యం చెప్పారు. అవసరమైతే పొలాల్లోనే విద్యుదుత్పత్తి సాగిం చి, మీరు వాడుకోగా మిగిలింది ప్రభుత్వానికి అమ్ముకు నే అద్భుతప్రణాళికలు అమలు చేయనున్నట్టు చెప్పారు.
మద్యపాన నిషేధం తరువాతే ఓటడుగుతానని డాం బికాలు పలికిన జగన్`ఐదేళ్ల పాలనలో నాసిరకం మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటమాడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. తాగుడుని తగ్గించడానికే ధరలు పెంచానని కొత్త నిర్వచనాలు చెప్పిన జగన్, నాసిరకం మందుపోసి ఒక్కో వ్యక్తినుంచి ఏడాదిలో రూ.18 నుంచి 36వేలు అదనంగా గుంజుకున్నాడని లెక్కలు వివరించారు. జనం రక్తాన్ని జలగలా పీల్చేసిన జగన్.. మహిళల తాళిబొట్లు తెంచిన దుర్మార్గుడని దుయ్యబట్టారు.మద్యం అలవాటున్న కుటుంబాలు పున రాలోచన చేయలన్నారు. ప్రకృతివరమైన ఇసుక నుంచీ ‘తైలం’ పిండుకున్న వైకాపా దొంగలు..ఐదేళ్ల దోపిడీతో భవన నిర్మాణ రంగాన్ని కుదేలుపర్చారన్నారు. బతుకు దెబ్బతిన్న కూలీలు, చిన్నచిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య లు చేసుకున్న ఉదంతాలున్నాయని,ఇలా రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు దెబ్బతిన్నాయన్నారు. జగన్ అస మర్థ నిర్ణయాల కారణంగా పెట్రోల్, డీజిల్ ఆదాయం పొరుగు రాష్ట్రాలకు పోతోందన్నారు.నిత్యావసరాల ధర లు దారుణంగా పెరిగాయని, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అనంత పురంలో ఒక పరిశ్రమ పెట్టారా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? అంటూ వైసీపీ సర్కారు వైఫల్యాలపై చంద్ర బాబు విరుచుకుపడ్డారు.అందుకే చెప్తున్నా`జాబు రావా లంటే బాబురావాలి అని ధైర్యంగా ప్రకటించుకున్నారు.
తెదేపా హయాంలో కియామోటార్లు వచ్చింది. వైసీపీ హయాంలో జాకీ పరిశ్రమ పారిపోయింది.అదీ`తెదేపా కు,వైసీపీకివున్న వ్యత్యాసమంటూ వ్యాఖ్యానించారు. దేశం లోని నిరుద్యోగుల్లో ఎక్కువశాతం ఏపీలోనే ఉన్నారని, బిడ్డకు మంచి ఉద్యోగంరావాలని ఏ తల్లిదండ్రులైనా ఆశ పడతారని, అయితే నేడు యువతకు ఉద్యోగాలు కరవైన దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. నాలెడ్జ్‌లో ప్రపంచా నికి తెలుగువారిని పంపిన ఘనత తెలుగు దేశానిదైతే, నిరుద్యోగులను పెంచినఘనత జగన్‌రెడ్డిదంటూ ఎత్తిపొడి చారు. యువత ఉన్నతమైన కలలు కంటుంటారు. వాటిని నెరవేర్చుకునే అవకాశం మనం కల్పించకపోతే, నిరుత్సా హానికి గురై వ్యసనాలబారిన పడతారని చంద్రబాబు హెచ్చరించారు. అలాంటిపరిస్థితి జగన్‌పాలనాహయాం లో చూశామని అంటూ.. జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అని దుయ్యబట్టారు.
ఇవీ ప్రభుత్వ వరాలు..
ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి కుటుంబంలోని ఆడబిడ్డకూ ప్రతి నెలా రూ.1500 అందిస్తామన్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలుంటే అంద రికీ పథకంకింద సాయం అందుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.అలాగే`ప్రతి కుటుంబంలో ప్రతి విద్యా ర్థికీ తల్లికి వందనం పథకం కింద ఏటా రూ.15వేలు ఇస్తామన్నారు. ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ ఇది వర్తిస్తుందని చెబుతూ.. అమ్మఒడి పథకం కింద జగన్‌రెడ్డి ఇదే తరహా హామీనిచ్చి దారుణంగా దగా చేశాడని గుర్తు చేశారు. జనాభా మన సంపద, మీరు పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. కుటుంబాల ను కళ్లలో పెట్టుకుని చూసుకునే శక్తి మాతమ్ముళ్లకుంది అంటూ చంద్రబాబు సభికులను ఉత్సాహపర్చారు. దీపం పథకం కింద ఏటా 3 సిలెండర్లు మహిళలకు ఇస్తామని, ఎర్రబస్సుల్లో ఉచితప్రయాణ సౌకర్యం కల్పి స్తామని చెప్పారు.రాష్ట్రంలోని మహిళా శక్తిని ప్రపంచం లోనే అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దే ప్రణాళిక అమ లు చేస్తామని, పరిశ్రమలు తీసుకువచ్చి ఏటా 4లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని, తొలి సంతకం మెగా డీఎస్సీ మీదే పెడతా నని, అనంతపురానికి వెళ్లే పనిలేకుండా రాప్తాడులోనే పనిచేసేలా ఉద్యోగ పథకాలు రూపొంది స్తామని హామీఇచ్చారు. మంచి నీటి రక్షణపథకం కింద కుళాయి ద్వారా నీళ్లిస్తామన్నారు. బీసీలంటే అత్యంత ప్రీతి పాత్రం. 50ఏళ్లకే పెన్షన్, బీసీలకు రక్షణచట్టం, బీసీల కోసం స్పెషల్ సబ్ ప్లాన్, ఆంక్షలు లేకుండా మొదటి తారీఘున రూ.4వేలు పింఛన్ ఇచ్చే ‘డిక్లరేషన్’ సిద్ధం చేసి ఉంచామన్నారు.పింఛన్ పథకాన్ని ఎన్టీఆర్ ప్రారం భిస్తే.. రూ.200 నుంచి రూ.2000 పింఛన్ పెంచింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. రైతులందరికి డ్రిప్ ఇరిగేషన్, సబ్సిడీ పథకాలు తిరిగి అమల్లోకి తెస్తానని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతును రాజు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు.
ఎవ్వరినీ వదలను..
రాయలసీమకు అన్యాయం చేసిన వాళ్లను ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. మా తమ్ముళ్లు పడిన కష్టాలకు వడ్డీతోసహా చెల్లించే బాధ్యత టీడీపీదంటూ, అన్ని ఎంక్వైరీ చేయించి దోషులను శిక్షించే బాధ్యత తీసుకుంటానన్నారు. తోపుదుర్తి బ్రదర్స్ కమీషన్ల దందాను ప్రస్తావిస్తూ..రూ.15 కోట్లకు కక్కుర్తి పడి జాకీ పరిశ్రమను తెలంగాణ పంపేశారన్నారు. అది వచ్చివుంటే వందల మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నా రు. ఆటోనగర్ భూములు కబ్జా చేసే కుట్రకుతెరతీశారని, మహిళాడెయిరీలో అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు నేడుఅవినీతి, భూదందాలు, ఇసుక, మట్టి మాఫియాతో కుతకుతలాడి పోతుంది. రాష్ట్రంలో కాంట్రాక్టర్ అవతారం ఎత్తి పనులు చేయకుండా డబ్బులు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత టీడీపీ తీసు కుంటుందని,అనంతపురంలో సాగునీటి ప్రాజెక్టులనుపూర్తి చేస్తామన్నారు.
సోమరవాండ్లపల్లి ప్రాజెక్టుకు భూములిచ్చి న వారికి నష్టపరిహారం అందే చర్యలు తీసుకుంటామని, టమోటా,వేరుశనగ, చీనిలాంటి వాణిజ్యపంటలకు సబ్సిడీ కల్పిస్తామన్నారు.చెన్నేకొత్తపల్లి మండలం వెంకటపల్లి సమీ పంలో దేవరకొండ ప్రాజెక్టు విషయంలో రైతులకు న్యా యం చేస్తామని,సత్యసాయి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు జీతాలు చెల్లిస్తామని హామీఇచ్చారు. ‘రాబో యేది ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్రంలో 410 ఎంపీ సీట్లు, రాష్ట్రంలో 160కిపైగా ఎమ్మెల్యే సీట్లు,25ఎంపీ సీట్లు గెలు స్తాం. జట్టు కట్టింది కూడా రాష్ట్రభవిష్యత్‌ను కాపాడాలనే’ అన్నారు. ‘ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి. మీబిడ్డల జీవితాలు బాగుపడాలి. జగన్‌రెడ్డి కట్టుకథóలకు మోసపోకుండా.. కూటమిని గెలిపించండి’ అంటూ చంద్ర బాబు విజ్ఞప్తి చేశారు.