• పొదిలి మండలం గోగినేనివారిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది.
• నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉండడంతో కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం.
• రామతీర్థం రిజర్వాయర్ నుండి మా గ్రామానికి నీటిని మళ్లించి తాగునీరు అందించాలి.
• గ్రామంలో సీసీరోడ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
• టీడీపీ పాలనలో చేపట్టిన కొన్ని రోడ్ల పనులు వైసీపీ పాలనలో నిలిపేశారు.
• డ్రైనేజీలు, దోమల సమస్యలపై వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
• నిరుపేదలకు పక్కాఇళ్లు, ఇంటి పట్టాలు మంజూరు చేయడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• గ్రామీణ ప్రజలకు గుక్కెడు నీళ్లు అందించలేని చేతగాని ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్రప్రజల దౌర్భాగ్యం.
• జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నిధులిచ్చినా ఉపయోగించుకోలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి.
• గ్రామపంచాయితీలకు చెందిన 9వేల కోట్ల నిధులను దొంగిలించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది.
• టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ తో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.
• ఇంటింటికీ కుళాయి అందజేసి 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.
• గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి గతవైభవం తెస్తాం.