జాతీయ టీడీపీ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో పై వైస్సార్సీపీ రౌడీ మూకలు రాళ్ళ దాడి చేయటాన్ని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా ఖండిరచారు. మలికిపురం మండలం గొల్లపాలెం లో జరిగిన సమావేశంలో శనివారం గొల్లపల్లి మాట్లాడుతూ. ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రి అదిమూలం సురేష్ గుడ్డలు విప్పుకుని రోడ్డుకు అడ్డంగా కూర్చోవడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమలు మర్చిపోయి చంద్రబాబు, లోకేశ్ యాత్రలను అడ్డుకోవడమే సరిపోయిందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల నమ్మి మోసపోయారని ఆయన ఆరోపించారు.రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోనే సత్తా లేక ఇలాంటి ఘటనలకు అధికార పార్టీ పాల్పడుతుండటం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు.