- అమరావతిని చంద్రబాబు అద్భుతనగరంగా తీర్చిదిద్దుతారు
- రైతుల దీక్షాశిబిరంలో ఎంపీ రఘురామ
అమరావతి (చైతన్నరథం): త్వరలోనే ఆంధ్రప్రదేశ కు మంచి రోజులు వస్తాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తుళ్లూరులో రైతలు దీక్షా శిబిరానికి వెళ్లిన ఆయనకు.. రాజధాని రైతులు, మహిళలు స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. తనను ఆంధ్రాలో అడుగుపెట్టకుండా వైకాపా ప్రభుత్వం అరా చకం సృష్టించిందని రఘురామ చెప్పారు. జగన్ ప్రభుత్వ దాష్టీకానికి అనేక ఇబ్బందులు పడ్డానని.. అయినప్పటికీ పోరాటం ఆపలేదని ఆయన వివరిం చారు. రాజధాని రైతులను కలిసేందుకు అనేక సార్లు రావాలనుకున్నా.. రాలేక ఢిల్లీలోనే సంఫీుభావం తెలియజేశానన్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన కు 130 సీట్లు వస్తాయని తొలుత అంచనా వేశా. ఇప్పుడు భాజపా కూడా కలవడంతో 135 అంతకన్నా ఎక్కువ సీట్లు సాధిస్తారు. ఐదేళ్లు ఆలస్యమైనా అమ రావతిని అనుకున్న దానికంటే అద్భుత నగరంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీర్చిదిద్దగలుగు తారు.
ఈ నెల 17న చిలకలూరిపేటలో కూటమి ఉమ్మడి మహా సభకు కచ్చితంగా హాజరవుతా. వైకాపా ‘సిద్ధం’ సభకు మీడియాను రావొద్దని చెప్పడంతో గ్రాఫిక్స్ అని తేలిపోయింది. మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. ఇక అందరం స్వేచ్ఛగా మన భావాలను వ్యక్తం చేయొచ్చు. చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం సాగిన రైతు ఉద్యమం అమరావతి ఉద్యమమే. మరికొద్ది రోజుల్లో రైతుల పోరాటం పూర్తిస్థాయిలో ఫలిస్తుంది’’ అని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.
జగన్‌ను ఓడిరచడానికి వ్యూహాలు అవసరం లేదు
సీఎం జగన్ వ్యూహాలు ప్రజలందరికీ అర్థమయ్యా యని… ఆయన వ్యూహంలో ఆయనే చిక్కుకుంటాడని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.ప్రజలంతా బయట కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరా రు.రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్ చెప్పా రని.. ఆ మాటలను తామంతా నమ్మామని, ఎన్నికల ప్రచారంలో కూడా అమరావతే రాజధాని అని చెప్పా మని తెలిపారు. అమరావతి విషయంలో జగన్ సిగ్గు లేకుండా మాట తప్పారని.. అదే విషయాన్ని జగన్‌కు, ఆయన మనుషులకు కూడా తాను చెప్పానని అన్నారు. దీంతో, ఆయనకు కోపమొచ్చిందని చెప్పారు.
గుంటూరు సీఐడీ కార్యాలయంలో తనను టార్చర్ చేసిన తర్వాత తనకు అయిన గాయాలను మీడియాలో చూపించారని, అదే తనను కాపాడిరదని… లేకపోతే పైకి పోయేవాడినని రఘురాజు అన్నారు. 40 నిమిషాల పాటు తనను చితగ్గొట్టారని చెప్పారు. జగన్‌ను ఓడిరచ డానికి ప్రత్యేకంగా ఎలాంటి వ్యూహాలు అవసరం లేదని అన్నారు. నేరుగా జనాల్లోకి వెళ్లి, ఆయన చేసిన మోసాల గురించి వాళ్లకు వివరిస్తేచాలని చెప్పారు.
సీఎం జగన్ అవినీతిపై నాలుగు నెలల క్రితం కేసు వేశానని రఘురాజు తెలిపారు. పిటిషన్‌కు సంబంధించి 40మంది రెస్పాండెంట్స్ ఉన్నారని… ఒక్కోసారి ఒక్కొక్క రు టైమ్ అడుగుతున్నారని, ఈ క్రమంలో విచారణ వాయిదా పడుతూవస్తోందని చెప్పారు. ఈ రోజు కూడా విచారణ వాయిదా పడిరదని తెలిపారు. వచ్చే మంగళ వారానికి తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసిందని చెప్పారు. కేసులో 1,350పేజీలను ఫైల్ చేశా మని… ఆ స్థాయిలో అవినీతి ఉందని అన్నారు. తన పోరాటం తాను చేస్తానని అన్నారు.