.దమ్ముంటే ఆ వీడియో కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపండి
.చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే అర్హత మాధవ్ కు లేదు!
.వివేకా హత్యతో సంబంధం లేదని జగన్‌తో ప్రమాణం చేయించండి
.కురుబ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ సవితమ్మ
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు, సీఎం జగన్ రెడ్డికి దమ్ముంటే ఎంపీ గోరంట్ల మాధవరెడ్డి న్యూడ్ వీడియోని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని కురుబ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.సవితమ్మ సవాల్ విసిరారు. అనంతపురం నుంచి శుక్రవారం జూమ్ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సవిత మాట్లాడుతూ.. మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.. చేసిన తప్పుడు పనికి తలదించుకోకుండా బడుగు, బలహీనవర్గాలను ఎంపి మాధవ్ అడ్డుపెట్టుకుంటున్నా డని కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ సవిత దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో కుల, శవ రాజకీయాలు చేస్తుంది ఎవరో అందరికీ తెలసు.. అనంతపురంలో కురుబలని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, వారిపై ఎన్ని అక్రమ కేసులు పెడుతున్నారో, ఎంత దౌర్జన్యం చేస్తున్నారో మాధవ్ తెలుసుకొని మాట్లాడాల్సిందని అన్నారు. అనంతపురం జిల్లా పరిషత్ హాల్‌లోకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే బడుగు, బలహీన వర్గాల వ్యక్తుల ఫోటోలు వచ్చాయని మాధవ్ తెలుసుకోవాలని హితవు పలికారు. మాధవ్ తమ తప్పును కప్పిప్పుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, మీడియా వాళ్ల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముందు మాధవ్ తన తప్పు తాను తెలుసుకొని యావత్ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని హితవు పలికారు.
మీ చర్యతో జనం నవ్విపోతున్నారు
వీడియో బయటకు వచ్చి రెండు వారాలు గడిచినా నిజాన్ని నిగ్గుతేల్చడం చేతకాని ఈ ప్రభుత్వం గురించి, బడుగు, బలహీన కులాల గురించి మాధవ్ మాట్లాడితే ప్రజలు నవ్విపోతున్నారని సవిత ఎద్దేవా చేశారు. తెలుగు దేశం పార్టీ పుట్టిన తరువాతే బడుగు, బలహీన వర్గాలు ముందుకు వచ్చాయని మాధవ్ తెలుసుకోవాల న్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాతే 1983లో కురుబ కులాన్ని, బడుగు, బలహీన కులాల్ని గుర్తించి అధికార భాగస్వామ్యం కల్పించిందని తెలిపారు. టీడీపీ పెట్టిన బిక్షవల్లే మాధవ్ ఖాకీ దుస్తులు ధరించారు,ఎంపీ స్థానాన్ని పొందగలిగారని తెలుసుకోవాలన్నారు. నిజం నిగ్గుతేలిన తరువాతే మాధవ్ ప్రజల్లోకి రావాలని చెప్పారు. ర్యాలీతో రావడానికి నువ్వు ఏమైనా స్వాతంత్య్ర సమర యోధుడి వా, సమైఖ్య ఉద్యమ కారుడివా, రాష్ట్రానికి ప్రత్యేక హోదాని, హిందూపురానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చా వా అని ప్రశ్నించారు. తగుదునమ్మా అని ప్రజల్లో తిరగ డానికి సిగ్గుండాలన్నారు. రాజీనామా చేసి నీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిం దని చెప్పారు. ముఖ్యమంత్రి ఏది చెబితే అది మాధవ్ మాట్లాడుతు న్నాడని, అలా మాట్లాడకపోతే అతని ఎంపీ పదవి ఉం డదని అందరికీ తెలుసని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, ప్రభుత్వం ఏ విధంగా మోసగిస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు.