అకాల వర్షాలతో అద్దంకి నియోజకవర్గంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేస్తూ చిత్తశుద్ధి లేకుండా రైతులకు నష్టపరిహారం అందించడంలో పూర్తిగా విఫలమైందని రవికుమార్ ధ్వజమెత్తారు.
ఆరుగాలం రైతులు శ్రమించి పండిరచిన పంట కోత దశ సమయంలో అకాల వర్షం దెబ్బతీసిందని, దీంతో మొక్కజొన్న, మిర్చి, పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే మార్క్ఫెడ్ ద్వారా తడిసిపోయిన మొక్కజొన్న, పసుపు సేకరించి రైతులను ఆదుకోవాలని రవికుమార్ డిమాండ్ చేశారు.
రైతులను ఆదుకోకపోతే తెలుగుదేశం పార్టీ రైతులు పక్షాన నిలిచి పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.