అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. బోట్లు దగ్ధం కావటంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీవన భృతి చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరిపించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.