- పెద్దదిక్కును కోల్పోయిన 8 కుటుంబాలకు పరిహారం
- రెండేళ్లుగా తిరిగినా పట్టించుకోని గత ప్రభుత్వం
- కూటమి వచ్చిన రెండు నెలల్లోనే పరిష్కారం
- సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్న మత్స్యకారులు
మచిలీపట్నం(చైతన్యరథం): మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటే జీవనాధారం. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయి సాయమందక రెండేళ్లుగా కుటుం బపోషణ భారమై దుర్భర జీవితం గడుపుతున్న మత్స్యకార కుటుంబాలను కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆదుకుంది. కృష్ణా జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో జిల్లాలోని 8 మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. మొత్తం రూ.40 లక్షలు ఈ నెలలోనే వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి ఏంచేయాలో తెలియ ని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఆదుకున్న ప్రభుత్వా నికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఆదుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు
నా భర్త బలగం లక్ష్మీనారాయణ(40) 2022 జూలై 23న చేపల వేటకు వెళ్లి వలల్లో చిక్కు కుని మరణించాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కొత్త ప్రభుత్వం ఆగస్టు 7న ఖాతాలో రూ.5 లక్షలు జమచేసింది. ఈ డబ్బుతో అమ్మాయి పెళ్లి చేద్దామనుకుంటున్నా. ఆర్థికసాయం మంజూరు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
బలగం ఈశ్వరమ్మ, గిలకలదిండి, మచిలీపట్నం
రూ.5 లక్షలు ఖాతాలో జమయ్యాయి
నా భర్త పేరు నాగేంద్రం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. చేపల వేటకు వెళ్లిన భర్త 2023 సెప్టెంబరు 29న అనుకోకుండా ప్రమాదంతో మరణించాడు. ఆర్థిక సమస్యల వల్ల సాయం కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నా. ఈ నెలలో రూ.5 లక్షలు ఖాతాలో జమయ్యాయి. ఈ డబ్బే మాకు జీవనాధారం. సహాయం చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
నాయుడు లక్ష్మీనాగేశ్వరమ్మ, నాలి గ్రామం, నాగాయలంక
కూటమి ప్రభుత్వం ఆదుకుంది
నా భర్త పేరు వెంకటేశ్వరరావు చేపల వేటకు వెళ్లి చనిపోయాడు. దీంతో జీవనా ధారం కోల్పోయాం. మాకు నలుగురు ఆడపిల్లలు. ఇద్దరు పిల్లల పెళ్లి చేశాం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మేము ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటే ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చింది. ఆదుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.
నాయుడు లక్ష్మి, మచిలీపట్నం
త్వరగా సాయమందించిన ప్రభుత్వానికి వందనాలు
నా కొడుకు శ్యామ్ సుందరరాజు చేపల వేటకు వెళ్లి మమ్మల్ని పోషించేవాడు. ఈ క్రమంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకో గా నష్టపరిహారంగా రూ.5 లక్షలు మా అకౌంట్లో వేసి ఆదుకున్నారు. ఈ డబ్బుతో మన వరాళ్లకు పెళ్లిళ్లు చేస్తాం. ఇంత త్వరగా ఆదుకున్నందుకు ప్రభుత్వానికి నా వందనాలు.
కుచ్చర్లపాటి నాగమల్లేశ్వరి, సొర్లగొంది, నాగాయలంక
ఈ డబ్బే మాకు జీవనాధారం
నా కొడుకు వెంకటేశ్వరరావు వారంరోజులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లి చేపలు పట్టి తెచ్చేవాడు. అదే మాకు జీవనాధారం. ఇలా చేపల వేటకు వెళ్లి వస్తుండగా ఒకరోజు ప్రమాదవశాత్తు పడవలో నుంచి కాలుజారి పడిపోయి మరణించాడు. దీంతో కుటుంబపోషణకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసు కోగా ప్రభుత్వం వారు రూ.5 లక్షలు ఇచ్చింది. ఆనందంగా ఉంది.
కోలాటి నాగముని, సొర్లగొంది, నాగాయలంక