- మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్
- వరద ప్రాంతాల్లో మసీదులకు మైకు సెట్లు, కార్పెట్ల పంపిణీ
విజయవాడ(చైతన్యరథం): రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇదే లక్ష్యంతో కార్యాచరణ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ తెలిపారు. గురువారం విజయవాడలో వరద విపత్తుతో ముంపునకు గురైన ప్రాంతాలలో నష్టపోయిన 60 మసీదులకు గురువారం మైక్ సెట్లు, ముసల్లాలు (కార్పెట్) పంపి ణీ చేశారు. అంజుమన్ అహలే ఇస్లాం ప్రొద్దుటూరు కడప జిల్లా, కర్నూల్ ముస్లిం సోదరులు, జాహిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సహకారం తో కార్యక్రమం జరిగింది. మంత్రి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు.
కొత్త మసీదుల నిర్మాణం, మసీదుల, మరమ్మతులకు ప్రత్యేకంగా నిధులు, ముస్లిం మైనారిటీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు, దుల్హన్ పథకం, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షే మాన్ని గాలికి వదిలేసి టీడీపీ పెట్టిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 1000 రోజుల ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. వరద ముంపు బాధితులను ఆదు కునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే పరిహారం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మసీదులు పూర్తిగా వరద నీటితో మునిగిపోయి నీటి మోటార్లు, మైక్ సెట్లు, స్పీకర్లు, జానిమాజ్లు దెబ్బతిని మసీదుకు లక్ష నుంచి రెండు లక్షల నష్టం వాటిల్లినట్టు చెప్పారు.
అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధుల సమస్యను గుర్తించి అన్ని తన వంతు కర్తవ్యంగా రాయలసీమ ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్నందున కొంత మంది ముఖ్య నాయకులతో వాటికి మరమ్మతులు చేయించేందుకు కార్యాచరణ రూపొం దించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. బోర్డు సీఈవో నివేదిక మేరకు దాదాపు 60 మసీదు లలో వరద ప్రభావానికి దెబ్బతిన్నట్టుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. వాటికి తక్షణసాయంగా కడప జిల్లా ప్రొద్దుటూరు, కర్నూలుకు చెందిన ముస్లిం సోదరులు మొదటి విడతగా మైక్ సెట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దాదాపు 9 లక్షల ఖర్చుతో కూడిన 60 మైక్ సెట్‌లను, యాంప్లిఫైర్స్, 13 లక్షల ఖర్చుతో జానిమాజ్ (ప్రేయర్ మ్యాట్స్)లను మంత్రి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎం.ఎస్.బేగ్, అబ్దుల్ రజాక్, మౌలానా హుస్సేన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్ ఖురేషి, తొహిద్ అంజుమ్, నాదిర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.