• ఆత్మకూరు నియోజకవర్గం గౌరవరం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
• టీడీపీ అధికారంలో ఉండగా మా గ్రామశివార్లలో ఉన్న స్థలాన్ని 63 మంది బీసీలకు ఇచ్చారు.
• అక్కడ కరెంటు, నీరు, మౌలిక సదుపాయాలు లేక మేము ఇళ్లు కట్టుకోలేదు.
• ఇళ్లు కట్టుకోలేదనే కారణంతో ప్రస్తుత ప్రభుత్వం మా స్థలాలు లాక్కుంది.
• మీరు అధికారంలోకి వచ్చాక మా స్థలాలు మాకు ఇప్పించండి.
• మా గ్రామం మీదుగా వెళుతున్న కాలువ ఎగువ భాగాన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి, ఎగువ పొలాలకు నీరు అందించండి.
• ఎన్టీఆర్ విగ్రహం నుండి ఎస్సీ కాలనీ వరకు, బస్టాండు నుండి ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మించాలి.
• గ్రామంలో మురుగు నీరు సమస్య తలెత్తకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• అడ్డగోలు దోపిడీపై తప్ప పేదవాడి గూటిపై వైసిపి ప్రభుత్వానికి ఏ మాత్రం శ్రద్ధ లేదు.
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చా పేదలకు సెంటుపట్టా పేరుతో రూ.7వేల కోట్లు దోచుకున్నారు.
• పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం చేతగాక, ఇల్లు కట్టుకోలేదన్న సాకుతో స్థలాలను లాగేసుకోవడం దారుణం.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవరం బిసిలకు తిరిగి పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తాం.
• ఎస్సీ కాలనీతోపాటు గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజిలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.
• రైతులకు కాల్వ ద్వారా సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.