• గత ప్రభుత్వం మా గ్రామంలో కనిగిరి-కందుకూరు ఆర్ అండ్ బి రోడ్డు నుండి రూ.193.98లక్షల అంచనాతో బి.టి రోడ్డు మంజూరుచేసింది.
• గత నాలుగేళ్లుగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షాకాలం చిన్నపాటి జల్లుకే రోడ్డు బురదగా మారి ఇబ్బందిగా ఉంది.
• గ్రామంలో తాగునీటికి ఇబ్బందిగా ఉంది.
• మీరు అధికారంలోకి వచ్చాక రోడ్డు నిర్మానానికి చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.
• గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు రూ. 1.30లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు.
• జగన్ మొఖం చూసి కాంట్రాక్టర్లు ఎక్కడా తట్టమట్టి పోయడానికి కూడా మందుకు రావడంలేదు.
• గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.25వేల కి.మీ.ల సిసి రోడ్లు నిర్మించాం.
• మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రోడ్లన్నింటినీ పునర్నిర్మిస్తాం.
• వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.