• గూడూరు నియోజకవర్గం కోట ఆర్టీసి బస్టాండు వద్ద కల్లుగీత కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• టీడీపీ పాలనలో మాకు అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి.
• మీరు అధికారంలోకి వచ్చాక 30శాతం బ్రాందీ షాపులను మాకు కేటాయించాలి.
• కల్లుగీత చెట్లు పెంచుకునేందుకు జీఓ ఎంఎస్-560తో ప్రతి సొసైటీకి 5ఎకరాలు మించకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
• కానీ ఆ జిఓ అమలు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.
• రాష్ట్రంలో ఉన్న వెయ్యి సొసైటీలకు ఒక్కో సొసైటీకి లక్ష చొప్పున రూ.10కోట్లు కేటాయించాలి.
• కల్లు గీత చెట్టు అంతరించిపోతున్నందున సముద్రతీర ప్రాంతాల్లో తాటి,ఈత,కొబ్బరిచెట్టను పెంచి గీత కార్మికులను ఆదుకోవాలి.
• చెట్ల యజమానులకు ఎక్కువ రేట్లు చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నాం.
• వన సంరక్షణ సమితులతో మాకు భాగస్వామ్యం కల్పించి గీత చెట్లను పెంచేందుకు అవకాశం కల్పించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• బిసిల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి బిసిల నడ్డి విరుస్తున్నారు.
• గత నాలుగేళ్లలో బిసిలకు చెందాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేశారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ అమలుచేస్తాం.
• నీరా కేఫ్ లు పెట్టి కల్లు గీత కార్మికులకు ఉపాధికి చర్యలు తీసుకుంటాం.
• ఉపాధి హామీతో అనుసంధానం చేసి సముద్రతీర ప్రాంతాల్లో తాటిచెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటాం.
• వనసంరక్షణ సమితుల్లో గీత కార్మికులకు అవకాశం కల్పించి, తాటిచెట్ల పెంపకానికి అవకాశం కల్పిస్తాం.