• గూడూరు నియోజకవర్గం కోట పట్టణ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• కోట పట్టణంలో దళితవాడ మీదుగా వెళ్లే పంట కాల్వ ఆక్రమణకు గురైంది.
• పంట కాల్వలోకి మురుగునీరు కలవడం వల్ల దోమల బెడద, అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా నిధులు కేటాయించాలి.
• 450 ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరందించే పంట కాలువ పూడిక తొలగించి, సిమెంట్ లైనింగ్ తో ఆయకట్టు నీరు పారేలా చేయాలి.
• మా గ్రామ గిరిజన కాలనీలో ఎన్టీఆర్ హయాంలో పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఇళ్లు దెబ్బతిని శిథిలావస్థలో ఉన్నాయి.
• గ్రామంలోని శ్యామసుందరపురం కాలనీ ఏర్పడి 30 ఏళ్లు అయింది. ఇప్పుటికీ పలు వీధుల్లో డ్రైనేజీ, రహదారులు, నీటి వసతి వంటి మౌళిక సదుపాయాలు లేవు.
• మీ ప్రభుత్వం కోట పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యంచేశారు.
• ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన 33,502 కోట్లు దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి.
• దళితులు నివసించే ప్రాంతంలో పంట కాల్వలోకి డ్రైనేజీ నీటిని కలపడం దారుణం.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మురుగునీటి పారుదలకు ప్రత్యేకంగా డ్రైనేజీలను నిర్మించి దోమల సమస్యను నివారిస్తాం.
• పంట కాలువ పూడిక తొలగించి, సిమెంట్ లైనింగ్ తో ఆయకట్టు నీరు పారేలా చేస్తాం.
• కోట పట్టణంలో ఎస్సీ, ఎస్టీలు, ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం.
• పట్టణంలో రోడ్లు, డ్రైనేజి, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.