• కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం గుండాలమ్మపాలెం గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో 1,700మంది జనాభా ఉన్నారు.
• గ్రామంలో 1.5కిలోమీటర్ల దూరం సిమెంటు రోడ్డు, దీనికి కిలోమీటరు దూరం డ్రైనేజీ నిర్మించారు.
• మా పంచాయతీకి 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.12లక్షలు రాగా, మొత్తం ప్రభుత్వం లాక్కుంది.
• మా గ్రామంలోని 4 శ్మశానాలకు ప్రహరీలు లేవు.
• గ్రామంలో మంచినీరు, ఇంటి పట్టాల సమస్యలు ఉన్నాయి.
• పొలానికి వెళ్లే దారులు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైన్లు అసంపూర్తిగా ఉన్నాయి.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలోని పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలన పంచాయతీలకు శాపంగా మారింది.
• పంచాయతీలకు 14, 15 ఆర్థిక సంఘం నుండి విడుదలైన రూ.8,600కోట్లను వైసిపి ప్రభుత్వం దారిమళ్లించింది.
• గ్రామాల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేకుండా పంచాయతీలను నిర్వీర్యం చేశారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధులు ఇచ్చి బలోపేతం చేస్తాం.
• గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి మళ్లీ గత వైభవం తెస్తాం.