- అసెంబ్లీలో విప్‌లుగా 15 మంది
- టీడీపీ `11, జనసేన`3, బీజేపీ`1
- మండలిలో ముగ్గురు విప్‌లు
- టీడీపీ`2, జనసేన`1
అమరావతి (చైతన్యరథం): ఏపీ శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్‌లను ప్రభుత్వం నియమించింది. ఏపీ శాసనసభ చీఫ్ విప్‌గా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలిలో చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. శాసనసభలో 15 మంది విప్‌లను నియమించగా ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలకు, ఒక బీజేపీ ఎమ్మెల్యేకు అవకాశం లభించింది. శాసనమండలిలో ముగ్గురు విప్‌లను నియమించగా జనసేన నుంచి ఒకరికి అవకాశం కల్పించారు.
శాసనసభలో విప్‌లు వీరే..
చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి- జమ్మలమడుగు (భాజపా)
అరవ శ్రీధర్, కోడూరు -ఎస్సీ(జనసేన)
బెందాళం అశోక్ – ఇచ్ఛాపురం (టీడీపీ)
బొలిశెట్టి శ్రీనివాస్- తాడేపల్లిగూడెం (జనసేన)
బొమ్మిడి నారాయణ నాయకర్- నరసాపురం (జనసేన)
బొండా ఉమామహేశ్వరరావు- విజయవాడ సెంట్రల్ (టీడీపీ)
దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) ముమ్మిడివరం (టీడీపీ)
దివ్య యనమల- తుని (టీడీపీ)
వి.ఎం.థామస్- గంగాధర నెల్లూరు (ఎస్సీ) (టీడీపీ)
జగదీశ్వరి తోయక – కురుపాం (ఎస్టీ) (టీడీపీ)
కాలవ శ్రీనివాసులు- రాయదుర్గం (టీడీపీ)
మాధవి రెడ్డప్పగారి – కడప (టీడీపీ)
పీజీవీఆర్ నాయుడు(గణబాబు) విశాఖ వెస్ట్(టీడీపీ)
తంగిరాల సౌమ్య- నందిగామ (ఎస్సీ) (టీడీపీ)
యార్లగడ్డ వెంకట్రావు- గన్నవరం (టీడీపీ)
శాసనమండలిలో విప్‌లు
వేపాడ చిరంజీవి రావు (టీడీపీ)
కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ)
పిడుగు హరిప్రసాద్ (జనసేన)