- దర్యాప్తునకు సహకరించండి
- జోగి రమేష్, దేవినేని అవినాష్‌కు సుప్రీం ఆదేశం
ఢల్లీి: వైసీపీ నేతలు జోగి రమేష్, దేవినేని అవినాష్ తమ పాస్‌పోర్ట్‌లను 24 గంటల్లోపు దర్యాప్తు అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వారిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వీరికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను తిరస్కరించటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. నిందితులు దర్యాప్తునకు సహకరించకపోతే రక్షణ ఉండదని స్పష్టం చేసింది. వారిద్దరూ 24 గంటల్లో తమ పాస్‌పోర్టులను దర్యాప్తు ఆధికారులకు అందజేయాలని ఆదేశించింది. 3 వారాలపాటు వారిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నిందితులు పూర్తిస్థాయిలో విచారణకు సహకరించాలని.. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సాంకేతిక కారణాలతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నామని జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం తెలుపుతూ విచారణను వాయిదా వేసింది.