చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విదేశాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు

అసెంబ్లీలో చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత

by చైతన్యరధం
Nov 20, 2024 at 7:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
హస్తకళలు, చేనేతకు పూర్వ వైభవం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చేనేతకు చంద్రబాబు పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే
  • 50 ఏళ్లకే చేనేత కార్మికులకు రూ.4 వేల పెన్షన్‌
  • 6 నెలల్లో 3 ఆప్కో షోరూమ్‌ల ఏర్పాటు
  • త్వరలో మరో రెండు వీవర్‌ శాలలు, 10 క్లస్టర్లు
  • 2014-19 నాటి పథకాలన్నీ అమలు చేస్తాం
  • అసెంబ్లీలో చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత

అమరావతి (చైతన్యరథం) : చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచుతూ, నేతన్నలకు 365 రోజులు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళిశాఖల మంత్రి ఎస్‌ సవిత స్పష్టంచేశారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ కల్పించడంలో భాగంగా ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహిస్తామన్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై పలువురు సభ్యుల అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత సమాధానమిచ్చారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలతో పాటు చేనేత రంగం కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిందన్నారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించకపోవడంతో పాటు నేతన్నల సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. దీంతో ఎందరో చేనేత కార్మికులు బలవర్మరణాలకు పాల్పడ్డారన్నారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్టుబడుల వ్యయం, అమ్మకాల్లేక చేనేత వస్ట్రాలు గుట్టలుగుట్టలుగా పేరుకపోవడంతో పాటు చేసిన అప్పలు తీర్చలేక నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. నేతన్నల కష్టాలను యువగళం పాదయాత్రలో లోకేష్‌, బస్సు యాత్ర చేపట్టిన సీఎం చంద్రబాబు స్వయంగా చూశారన్నారు. ఆనాడే నేతన్నలను ఆదుకుంటామని, గౌరవప్రదమైన జీవనం కొనసాగించేలా ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారని మంత్రి సవిత గుర్తు చేశారు.
చంద్రబాబు పాలన ఎప్పుడూ నేతన్నలకు స్వర్ణయుగమే…
2014లో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేనేత పరిశమ్రకు ఎంతో ప్రాధాన్యమిచ్చారని మంత్రి సవిత వెల్లడిరచారు. చేనేత రంగ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వడ్డీపై రాయితీ ఇచ్చారన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలకు ఆప్కో ద్వారా 20 నుంచి 30 శాతం ప్రత్యేక రిబేట్‌ ఇచ్చారన్నారు. త్రిఫ్ట్‌ పథకంతో నూలు, రంగుల, రసాయినాల కొనుగోలుపై 40 శాతం సబ్సిడీ అందజేశారన్నారు. చేనేత సహకార రంగాలకు మార్కెటింగ్‌ ప్రోత్సాహం కూడా అందించారన్నారు. పవర్‌ లూమ్‌ యూనిట్లకు 50 శాతం టారిఫ్‌ రాయితీ అందించారని మంత్రి వివరించారు.
నేతన్నలకు జగన్‌ అన్యాయం
2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌…నేతన్నలకు తీవ్ర అన్నాయయం చేశాడని మంత్రి సవిత ధ్వజమెత్తారు. నా నేతన్నలు… నా బడుగు బలహీన వర్గాలు.. అని మాయమాటలు చెప్పి వారిచేత ఓట్లేయించుకుని తరువాత రోడ్డునపడేసి…తాను మాత్రం ప్యాలెస్‌లు, బంగ్లాలు కట్టుకున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం చేనేతల కోసం అమలు చేసిన పథకాలన్నీ జగన్‌ నిలపేశాడన్నారు. నేతన్న నేస్తం పథకం కింద కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే బటన్‌ నొక్కి సాయం చేశాడన్నారు. అర్హులైన నేతన్నలకు మాత్రం జగన్‌ తీవ్ర అన్యాయం చేశాడని మంత్రి సవిత మండిపడ్డారు.
ఎన్నికల హామీల అమలు
యువగళం పాదయాత్రలో యువ నేత నారా లోకేష్‌ స్వయంగా నేతన్న కష్టాలు చూసి చలించిపోయారు. తీవ్ర కష్టాల్లో ఉన్న నేతన్నలకు ఆదుకోవాలన్న సదుద్దేశంతో మంగళగిరిలో వీవర్‌ శాలను ఏర్పాటు చేశారని మంత్రి సవిత తెలిపారు. ఆ వీవర్‌ శాల ద్వారా నేతన్నలకు 365 రోజులూ పని కల్పిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాటి నుంచి నేతన్నలకు ఆదుకునేలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను నెరవేర్చేలా పలు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే రూ.4 వేల చొప్పున వృద్ధాప్యపు పెన్షన్లు అందజేస్తున్నాన్నారు. త్రిఫ్ట్‌ ఫండ్‌, వీవర్స్‌ ముద్ర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పవర్‌ లూమ్‌ యూనిట్లకు 50 శాతం రాయితీ అందిస్తున్నామన్నారు. నేతన్నల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారని మంత్రి సవిత స్పష్టం చేశారు.
ఆప్కో షోరూమ్‌ ల్లో పెరిగిన అమ్మకాలు
నేతన్నలకు మేలు కలిగేలా 200 యూనిట్లు, మర మగ్గాల కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. నేతన్నలకు ఆరోగ్య బీమా పథకం అమలు చేయబోతున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చేనేత బజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలోని చేనేత వస్త్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా వచ్చి ప్రారంభించారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు చేనేత పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని, దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతున్న నమ్మకం చేనేత కార్మికుల్లో ఏర్పడిరదన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో ఐదు నెలల్లో ఆప్కో ద్వారా అమ్మకాలు 9.8 శాతం, రెడీ మేడ్‌ వస్త్రాల అమ్మకాలు (లివరీ సేల్స్‌) 70 శాతం పెరిగాయని తెలిపారు. త్వరలో సెల్లర్స్‌ అండ్‌ బయర్స్‌ సమావేశం ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ సమావేశం ద్వారా చేనేత వస్త్రాల నిల్వలను విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ` కామర్స్‌ ద్వారా చేనేత వస్త్రాల విక్రయాలు చేపట్టామని, గడిచిన 6 నెలల్లో రూ.32.50 లక్షల అమ్మకాలు చేశామని మంత్రి వెల్లడిరచారు. 6 నెలల కాలంలో 3 ఆప్కో షోరూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఆప్కోలో కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేందుకు, మార్కెటింగ్‌ స్కిల్స్‌ పెంచుకునేందుకు షోరూమ్‌ మేనేజర్లకు శిక్షణ ఇచ్చామని మంత్రి సవిత వెల్లడిరచారు.
రాష్ట్రంలో 2 వీవర్‌ శాలల ఏర్పాటు
ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లు నేతన్నలకు నూతన డిజైన్లపై శిక్షణ ఇచ్చి చేనేత ఉత్పత్తుల విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఎఫ్టీ) ఏర్పాటు చేయబోతున్నామన్నారు. చేనేత వస్త్రాలపై 5 శాతం మేర జీఎస్టీ రియింబర్స్‌మెంట్‌ ఇవ్వబోతున్నామని తెలిపారు. కొత్తగా 10 క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామని, ఆదిత్య బిర్లా గ్రూప్‌ సహకారంతో 4,5 జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్‌ ఏర్పాటు చేసిన వీవర్‌ శాల మాదిరిగా…రెండు వీవర్‌ శాలలు ఏర్పాటు చేయడానికి విజయనగరం, కర్నూలు ఎంపీలు ముందుకొచ్చారని, ఇందుకోసం వారు చెరో కోటి రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. దీంతో చేనేతలకు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. చేనేత వస్త్రాలు ధరించాలని, మన సంప్రదాయాలను కాపాడుకుందామని, నేతన్నలకు అండగా ఉందామని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు చేపట్టిందన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలతో పాటు వినియోగం పెరిగేలా ఎయిర్‌ పోర్టుల్లోనూ ఆప్కో షోరూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలో విదేశాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించబోతున్నామని, ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారయినా చేనేత వస్త్రాలు ధరించాలని అసెంబ్లీ వేదికగా మంత్రి సవిత కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

Previous Post

అయ్యప్ప భక్తుల పాలిట ఆపద్బాంధవుడు మంత్రి లోకేష్‌

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 19-11-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

కార్యకర్త
@ February 21, 2026
బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆంధ్రప్రదేశ్

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

చైతన్యరధం
@ February 21, 2026
ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…

చైతన్యరధం
@ February 21, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్

చైతన్యరధం
@ February 21, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist