- జగన్ సెట్టింగుల సీఎం
- కుప్పంకు నీళ్లిస్తున్నామంటూ డ్రామాలు
- ట్యాంకర్లో నీళ్లు తెచ్చి కాలువలో పోసి… బటన్ నొక్కారు
- అద్దెకు తెచ్చిన గేట్లు సాయంత్రానికే ఎత్తేశారు
- తెల్లారేసరికి ఇంకిపోయిన నీళ్లు
- జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్నీ డమ్మీలే
- వైసీపీ డ్రామా కంపెనీ త్వరలో మూత
- హెలికాప్టర్లో వస్తే చెట్లన్నీ నరికేశాడు… రోడ్ల మీద వస్తే ఇళ్లు పీకేస్తాడేమో.?
- రెస్కోను కొనసాగిస్తాం
- హంద్రీనీవా కాలువ పరిశీలించిన టీడీపీ అధినేత
కుప్పం (చైతన్యరథం): అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు తెస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పంలో రెస్కోను కొనసాగిస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని రాజుపేటవద్ద హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్‌ను మంగళవారం సాయంత్రం చంద్రబాబు పరి శీలించారు. కుప్పంకు నీళ్లంటూ ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి హడావుడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ట్యాంకర్లో నీళ్లు తెచ్చి పోసి సినిమా సెట్టింగ్ లాగా గేటు పెట్టి జగన్ బటన్ నొక్కి వెళ్లిపోయారన్నారు. బటన్ నొక్కినా నీళ్లు రాలేదు. తెచ్చిపోసిన నీళ్లు తెల్లారేసరికి ఇంకిపో యాయి. అద్దెకు తెచ్చిన గేట్లను సాయంత్రానికే అధి కారులు వచ్చి ఎత్తుకెళ్లారు. ఇలాంటి సెట్టింగుల సీఎం వస్తాడని డైరెక్టర్లు, నిర్మాతలు కూడా అనుకోలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
నన్ను ఓడిస్తావా..
ఇంతోటి దానికి కుప్పం భూమిపై నడిస్తే అరిగిపో తాడని రెండు హెలిప్యాడ్లు ఏర్పాటుచేసి తిరిగాడు. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులున్నీ పెట్టి జనాన్ని తర లించారు. ఇలాంటి ఘనకార్యాలు చేసిన నువ్వు…నన్ను ఓడిస్తావా? ప్రజలు ఛీకొడతారన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా నీళ్ల తెచ్చానంటూ డ్రామాలాడారు. ఉత్తుత్తి బటన్ నొక్కి నీళ్లు వదిలారు… కనీసం మట్టి పెళ్లలు కూడా తడవలేదు. కుప్పం ప్రజలు నీతి, నిజాయితీతో ఉంటారు. వీళ్లను మోసం చేయాలని చూడటం దారు ణం. ఐదేళ్లుగా నడిపిన వైసీపీ డ్రామా కంపెనీని శాశ్వ తంగా మూసేయబోతున్నారని చంద్రబాబు అన్నారు.
ప్రజాకోర్టులో శిక్షించాలి
రోడ్డు మార్గం ద్వారా పర్యటనకు మళ్లీ కుప్పం వస్తానని చెప్తున్నాడు…ఏంమొహం పెట్టుకుని వస్తావు? హెలికాప్టర్లో వస్తే చెట్లు నరికించేశాడు… రోడ్ల మీద వస్తే ఇళ్లు పీకేస్తాడేమో.? నిర్లక్ష్యం ఉండ వచ్చు కానీ… కక్ష కట్టి నిర్లక్ష్యం వహించడం సమంజసం కాదు. నీకు కొన్ని ఓట్లు వేసిన పాపానికి ఇలా చేయడం దుర్మార్గం. రాష్ట్రంలో జరగని అరాచకం ఏమన్నా ఉందా? రాష్ట్రం లో రికార్డులు తారుమారుచేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, సర్టిఫికెట్లపై సైతం జగన్ ఫోటో పెట్టుకు న్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజాకోర్టులో జగన్‌ను శిక్షించాలి. వలంటీర్లు సేకరిం చిన ప్రజల వ్యక్తిగత సమాచారం వలంటీర్లు, ఐప్యాక్ వద్ద ఉంది.. వలంటీర్ల వద్ద ఉన్న ఫోన్లు కూడా వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మొత్తం నాశనమే
కుప్పంలో మెడికల్ కాలేజీతో పాటు అన్నీ అభివృద్ధి చేశా…పులివెందులను కూడా అభివృద్ధిచేశాను. కుప్పం లో నేను తెచ్చిన ఇజ్రాయేల్ టెక్నాలజీ గతం లోనూ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కక్షగట్టి నిలిపి పేశారు. ఇప్పుడు జగన్ వచ్చాక మొత్తం నాశనం చేశాడు. సంపదను కొల్లగొట్టారు. గుండిశెట్టిపల్లెలో బసవేశ్వరస్వామి మాన్యం భూమిని కొట్టేయాలని చూస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
అన్నీ సరిచేస్తాం
జె.బ్రాండ్స్ మద్యం గురించి చెప్పినప్పుడు, కాదని నిరూపించకుండా మాపై దాడులకు దిగారు. గంజాయి వచ్చిందని చెప్తే మా కార్యాలయంపై దాడి చేశారు. విశాఖలో అంతపెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడితే జగన్ కనీసం స్పందించలేదు. అంతర్జాతీయ నేర సామ్రాజ్యం లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రముఖుడు. వారు తప్పులు చేసి ఎదుటివారిని నిందిస్తున్నారు. ప్రజలు తిరగబడనంతవరకూ వీళ్లు అరాచకాలు చేస్తూనే ఉం టారు. రాష్ట్ర బ్రాండ్ ను దెబ్బతీశారు. జగన్ కు ఓటేస్తే ఎవరి కుటుంబానికి వారు అన్యాయం చేసినట్లే. జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్నీ డమ్మీలే. ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో చూడలేదు.. అన్నీ సరిచేస్తా మని చంద్రబాబు స్పష్టం చేశారు.