అమరావతి: నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం ఆయనకు నివాళులర్పించారు. మంచితనానికి, ఆప్యాయతకు రూపమిస్తే అది నందమూరి హరికృష్ణ అని చంద్రబాబు కొనియడారు. తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథ సారథిగా, నటుడిగా తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యా రన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. రాజకీయాల్లో, నటనలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని లోకేష్ తెలిపారు. ముక్కుసూటితనం నందమూరి హరికృష్ణ నైజమని, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయన ప్రత్యే కత అని కొనియడారు.
టీడీపీ జాతీయ కార్యాలయంలో నివాళి
నందమూరి హరికృష్ణ నటుడిగా, రాజకీయనేతగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినట్లు టీడీపీ నేతలు కొనియాడారు. హరికృష్ణ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. హరికృష్ణ నటుడిగా పలు సందేశాత్మక చిత్రాల్లో నటించినట్లు నేతలుచెప్పారు. ఎన్టీఆర్ స్పూర్తితో ప్రజాసేవ చేసేం దుకు రాజకీయ అరంగేట్రం చేసినట్లు తెలిపారు. పార్టీ స్థాపించిన రోజుల్లో హరికృష్ణ చైతన్య రధసారధిగా అన్న ఎన్టీఆర్‌కి సేవలందిస్తూ రాష్ట్రమంతా పర్యటించి నట్లు వివరించారు. హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా, శాసన సభ్యుడి గా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించారన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంకోసం తనపదవిని తృణ ప్రాయంగా త్యాగం చేసిన వ్యక్తి హరికృష్ణ అని టీడీపీ నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమమహేశ్వరరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, టీడీపీ నాయకులు కొటారు దొరబాబు, కొత్తా నాగేంద్రకుమార్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, భీమినేని వందనాదేవి, హషన్ బాషా, టీడీఎల్పీ సురేష్, రామకృష్ణ, ఎస్పీ సాహెబ్, రైతు సాంబిరెడ్డి, పర్చూరి కృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, రాష్ట్ర మీడియా కోర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.