- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నివాళి
- ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నందమూరి హరికృష్ణ వర్ధంతి
అమరావతి(చైతన్యరథం): ప్రజలకు, టీడీపీకి దివంగత నందమూరి హరికృష్ణ అందించిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. దివంగత రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు, పార్టీకి హరికృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు. తెలుగు వాడి కీర్తిని చాటి చెప్పడంలో చైతన్యరథ సారథిójైు నిలిచారు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా హరికృష్ణ నిలిచిపోయారు. భౌతికంగా ఆయన మనతో లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మన మదిలో చెరగని ముద్ర వేశాయని మంత్రి శ్రీనివాస్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, పార్టీ నాయకులు బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, ఏవి రమణ, నరసింహ ప్రసాద్, మురళి, వెంకటప్ప, పర్చూరి కృష్ణ, వెంకటేశ్వరరావు, పారా రామకృష్ణ, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.