- జగన్‌రెడ్డి పాలనలో బీసీల అణిచివేత
- పలు సంక్షేమ పథకాలూ రద్దు
- రాజకీయ నిరుద్యోగ కేంద్రాలుగా కార్పొరేషన్లు
- బీసీ నేతలపై విశృంఖల దాడులు, హత్యలు
- చేతివృత్తిదారులకు నిండా ముంచేసిన వైనం
- బీసీల ఉద్ధరణకు నడుంగట్టిన తెదేపా
- ‘డిక్లరేషన్’ ప్రకటనతో నేడు జయహో బీసీ
అమరావతి (చైతన్యరథం): రాజకీ, ఆర్ధిక, సామా జిక రంగాల్లో తెలుగుదేశంపార్టీ అందించిన చేయూత కారణంగా గత నాలుగు దశాబ్ధాల్లో బీసీలు తలెత్తుకొని జీవించారు. అన్నిరంగాల్లోనూ ముందుకొచ్చారు. విద్యా రంగంలో అవకాశాలను ఒడిసి పట్టుకుంటూనే అటు రాజ కీయరంగంలోనూ తమ ఉనికి చాటుకున్నారు. కులవృత్తులను రక్షించుకుంటూనే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఒకడుగు ముందుకేశారు. కానీ గత ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో బీసీలు ఎన్నడూ లేనంత గా అణిచి వేతకు గురయ్యారు. వారికి అందిస్తున్న సం క్షేమ పథకాలన్నీ రద్దయ్యాయి.బీసీల అభ్యున్నతికి తోడ్ప డుతున్న కార్పొరేషన్లను రాజకీయ నిరుద్యోగ కేంద్రాల య్యాయి. చేతివృత్తిదారులు నిండా మునిగారు. చివరికి బీసీల ఆత్మ గౌరవం జగన్‌రెడ్డి సామాజికవర్గం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బీసీలపై దాడులుజరిగాయి. ప్రశ్నించిన బీసీలు దారుణ హత్యలకు గురయ్యారు. జగన్ గత ఎన్నికల్లో విజయా నికి ఎవరిని వెన్నుముక చేసుకున్నాడో, గద్దెనెక్కిన తరు వాత వారి వెన్నులే విరిచేశాడు. ఈ ఐదేళ్లలో బీసీల అణిచివేత అప్రతిహతంగా సాగిపోయింది.
బీసీ సంక్షేమాన్ని మంటగలిపిన జగన్‌రెడ్డి
జగన్‌రెడ్డి రూ.75వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించి సాధికారితను ప్రశ్నార్థకం చేశాడు.స్థానిక సంస్థల్లో టీడీపీ 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తే జగన్‌రెడ్డి 10శాతం రిజర్వేషన్తను కత్తిరించి… 16,800 రాజకీ య పదవులను బీసీలకు దూరం చేశారు. బీసీల అసైన్డ్ భూములు 8వేల ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. ఆదరణ పథకాన్ని రద్దుచేసి బీసీల పొట్ట గొట్టాడు.లబ్దిదారుల 10శాతం సొమ్ముస్వాహా చేశాడు. బీసీలకు విదేశీ విద్య, పెళ్ల కానుకలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దుచేశారు. బీసీ భవన నిర్మాణాలను నిలిపేశా రు. కేంద్ర పథకాలను రద్దుచేసి చేనేత వర్గాలకు కేంద్ర సబ్సిడీలు దూరం చేశాడు.
నిరుద్యోగ కేంద్రాలుగా.. కార్పొరేషన్లు
ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించినపుడే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. కార్పొరేషన్లంటే.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రాలుగా ఉండేవి. కానీ జగన్‌రెడ్డి వాటినికేవలం రాజకీయ నిరుద్యోగుల ఆవాస కేంద్రాలుగా మార్చారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొ రేషన్ల ద్వారా దాదాపు 4.4లక్షలమందికి రూ.లక్ష సబ్సి డీతో రూ.2లక్షల వ్యక్తిగత రుణాలు, ఫెడరేషన్ల ద్వారా 70వేల మందికి రూ.10లక్షల చొప్పున గ్రూప్ రుణా లిచ్చారు. టీడీపీ హయాంలో ఒక్కో కార్పొరేషన్ ద్వారా రూ.1200కోట్ల చొప్పున ఖర్చు చేశారు. అయితే, జగన్ రెడ్డి తన అనుయాయులను కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్ట ర్లుగా నియమించి ఉత్సవ విగ్రహాలు చేశారు. ఛైర్మన్లు గా బాధ్యతలు స్వీకరించినా.. బీసీ సంక్షేమానికి మాట సాయం కూడా చేయలేకుండా పదవి పూర్తి చేసుకున్న చరిత్ర ప్రస్తుత బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లదే.
బీసీ నేతలపై దాడులు`హత్యలు
వైసీపీ పాలనలో 74మంది బీసీ నేతలు హత్యకు గురయ్యారు. 800మందిపై తప్పుడుకేసులున మోద య్యాయి. 3000 మందిపై దాడులు చోటుచేసుకున్నా యి. బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో ఉప్పల అమర్ నాథ్‌ని పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు. తన అక్కను వేధిస్తున్న వైసీపీ మూకను నిలదీయడమే అత ను చేసిన నేరం. విజయనగరం జిల్లా రాజాం నియోజ కవర్గం ఉద్దవోలు గ్రామానికి చెందిన కృష్ణ మాస్టారు (ఏగిరెడ్డి కృష్ణ)ని రాజకీయ కక్షతో అధికారపార్టీ నాయ కులు కారుతో ఢీకొట్టి, ఇనుప చువ్వలతో కళ్లు పొడిచి, రాడ్డుతో తలపై మోది దారుణంగా చంపేశారు. గుం టూరు జిల్లా పల్నాడులో తోట చంద్రయ్యను వైసీపీలో చేరాలని వేధించారు. జై చంద్రబాబు అన్న నినాదం ఇచ్చినందుకు నడిరోడ్డుపై గొంతు కోసి హత్యచేశారు. ప్రకాశం జిల్లా చినగంజాంలో వైసీపీలో చేరనన్నందుకు బీసీ మహిళను వివస్త్రను చేశారు. అవమానభారంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిరది. శ్రీకాళహస్తిలో నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో స్థానిక సమస్యలు చెప్పిన పాపానికి రజక వర్గానికి చెందిన మునిరాజమ్మ అనే మహిళను వేధించారు. టిఫిన్ షాపు ధ్వంసం చేశా రు. శ్రీకాళహస్తి దేవాలయంలో సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న మునిరాజమ్మ భర్తను ఉద్యోగం నుండి తొలగించారు.
నామినేటెడ్ పోస్టులు, పనుల్లో బీసీలకు అన్యాయం
నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించిన జగన్‌రెడ్డి.. ఆ ప్రకటనను పత్రాలకే పరిమితం చేశారు. వెయ్యి నామినేటెడ్ పదవులు సొంత సామాజిక వర్గంతో నింపుకున్నారు. 37 మందితో కూడిన టీటీడీ జంబో బోర్డులో బీసీ లకు 3 సీట్లు మాత్రమే ఇచ్చారు. యూని వర్శిటీ వీసీల్లో 12కుగానూ పది స్థానాల ను రెడ్ల కులంతో నింపారు. ప్రాధాన్యత కలిగిన సంస్థలన్నింటికీ ఛైర్మన్లుగా సొంత సామాజికవర్గానికి చెందిన వారిని నియమించి ప్రాధాన్యతలేని కుల కార్పొరేషన్లకు చైర్మన్లుగా బీసీలను నియమించారు.
బీసీల ఆత్మగౌరవం తాకట్టు
టీడీపీ ప్రభుత్వ హయంలో బీసీలకు అత్యుత్తమ గౌర వం దక్కింది. కీలకమైన పదవుల్లో యనమల రామ కృష్ణుడు, అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రలాంటి వారు కొనసాగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీసీ నేతలకు టీడీపీలో ఎనలేని గౌరవముంది. వారి ఆత్మగౌరవం ఇను మడిరచేలా పార్టీ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడుగానీ, ప్రతిపక్షంలో ఉన్న ప్పుడుగానీ బీసీలంతా తలెత్తుకొని జీవించారు. కానీ వైసీపీ పాలనలో బీసీల ఆత్మగౌరం జగన్‌రెడ్డి, ఆయన సామాజిక వర్గం పెత్తందారీతనం ముందు తాకట్టు పెట్ట బడిరది. అనంతపురంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంట్లో జరిగిన ప్రెస్ మీట్లో.. ఆమెకు కనీసం కుర్చీలేకుండా చేసి, మంత్రి పెద్ది‘రెడ్డి’ కుర్చీలో కూర్చున్నారు. ఎంపీ రంగయ్య, జెడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద్.. ఇంతమంది బీసీల్ని నిలబెట్టి ‘రెడ్డి’ కుర్చీ వేసుకున్నారు. వై.వి.సుబ్బా‘రెడ్డి’ ముందు బీసీ సామాజికవర్గ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను మోకాలిదండ వేయించారు.ఢల్లీిలో నీతి ఆయోగ్ సమావేశానికి జగన్‌రెడ్డి హాజరయ్యే సమయంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ,కాపు ఎంపీలను గేటు బయటే నిలబెట్టి.. సొంత ‘రెడ్డి’మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డి ని లోపలకు తీసుకెళ్లారు. నామినేటేడ్ పోస్టులు, యూని వర్శిటీల వైస్ ఛాన్స్‌లర్ పోస్టులు, టీటీడీ పోస్టుల నియా మకంలో టీడీపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తే… వైసీపీ మాత్రం అన్ని పోస్టుల్లోనూ బీసీలకు మొండి చేయ్యే చూపించింది.
ఆదినుంచీ బీసీలకు వెన్నుదన్నుగావున్న తెలుగు దేశం పార్టీ `ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల పరిస్థితి చూసి చలించి పోయింది. రాష్ట్ర జనాభాలో సగభాగమున్న బీసీలకు పూర్వవైభవం తీసుకొచ్చి, ఆత్మగౌరవ పరిరక్షణకు నడుం గట్టింది. ప్రభుత్వ ప్రేరేపిత అణచివేతనుంచి బీసీలను మళ్లీ గట్టెక్కించి.. ఉజ్వల భవిత కోసం తెలుగుదేశం ` జనసేన కూటమి మంగళవారం ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటిం చనుంది. జయహో బీసీ!
చేతివృత్తుల వారికి ద్రోహం
తెలుగుదేశం ప్రభుత్వ హయంలో.. చేతివృత్తు లపై ఆధారపడిన అందరికీ ఆదరణ పరికరా లు అందించి ఉత్పాదకత సులువుయ్యేలా చేశారు. ఉపాధికి మెరగైన మార్గాలేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆదరణకు అవినీతి ముసుగు తగిలించి నిలపేశారు. పనిముట్లకు తుప్పుపట్టేలా చేశారేగానీ వాటిని లబ్దిదారులకు అందిం చలేదు. కులవృత్తులు చేసుకునే అందరినీ చేతివృత్తి దారులుగా టీడీపీ ప్రభుత్వం గుర్తింపు ఇస్తే.. జగన్‌రెడ్డి వారిని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలో రిజిస్టర్ అయితేనే ప్రభుత్వ లబ్ది అంటూ ద్రోహం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారులకు వలలు, పడవలు, ఐస్ బాక్సు లు, మోటార్ సైకిళ్లు 70-90శాతం సబ్సిడీతో అందించగా జగన్మోహన్‌రెడ్డి ఒక్కరికీ సబ్సిడీ పరిక రాలు అందించింది లేదు. చెరువులు, రిజర్వాయర్లు ఫిషర్‌మెన్ సొసైటీల ఆధ్వర్యం లో ఉండగా వాటిని జగన్‌ప్రభుత్వం వేలం వేసి సొంతవారికి కట్టబెట్టడం ద్వారా సొసైటీ లను నిర్వీర్యంచేసింది.టీడీపీ ప్రభుత్వ హయం లో వేటకు వెళ్లి మరణించినవారి కుటుంబా నికి చంద్రన్న బీమా ద్వారా రూ.5లక్షలు అం దించారు. సహజ మరణానికి రూ.2 లక్షలు అందించారు. మొదటి రెండేళ్లు బీమాను జగన్‌రెడ్డి ప్రభుత్వం తొక్కిపెట్టింది.సహజ మరణానికి బీమాను రూ.లక్షకు కుదించింది.
వైసీపీ పాలనలో 74మంది బీసీ నేతలు హత్యకు గురయ్యారు. 800మందిపై తప్పుడు కేసులు నమోదయ్యాయి. 3000 మందిపై దాడులు చోటుచేసుకున్నాయి. బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంలో ఉప్పల అమర్‌నాథ్‌ని పెట్రోలుపోసి సజీవ దహనం చేశారు. తన అక్కను వేధిస్తున్న వైసీపీ మూకను నిలదీయడమే ఆ పిల్లాడు చేసిన నేరం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ఉద్దవోలు గ్రామానికి చెందిన కృష్ణ మాస్టారు (ఏగిరెడ్డి కృష్ణ)ని రాజకీయ కక్షతో అధికార పార్టీ నాయకులు కారుతో ఢీకొట్టి, ఇనుప చువ్వలతో కళ్లుపొడిచి, రాడ్డుతో తలపై మోది దారుణంగా చంపేశారు.గుంటూరు జిల్లా పల్నాడులో తోట చంద్రయ్యను వైసీపీలో చేరాలని వేధించారు. జై చంద్రబాబు అన్న నినాదం ఇచ్చినందుకు నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేశారు. ప్రకాశంజిల్లా చినగంజాంలో వైసీపీలో చేరనన్నందుకు బీసీ మహిళను వివస్త్రను చేశారు. అవమానభారంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిరది. శ్రీకాళహస్తిలో నారాలోకేశ్ పాదయాత్ర సమయంలో స్థానిక సమస్యలు చెప్పిన పాపానికి రజక వర్గానికి చెందిన మునిరాజమ్మ అనే మహిళను వేధించారు. టిఫిన్ షాపు ధ్వంసం చేశారు. శ్రీకాళహస్తి దేవాలయంలో సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న మునిరాజమ్మ భర్తను ఉద్యోగం నుండి తొలగించారు.
టీడీపీ ప్రభుత్వ హయంలో బీసీలకు అత్యుత్తమ గౌరవం దక్కింది. కీలకమైన పదవుల్లో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రలాంటి వారు కొనసాగారు. కానీ వైసీపీ పాలనలో బీసీల ఆత్మగౌరం జగన్‌రెడ్డి, ఆయన సామాజిక వర్గం పెత్తందారీతనం ముందు తాకట్టు పెట్టబడిరది. అనంతపురంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంట్లో జరిగిన ప్రెస్ మీట్లో.. ఆమెకు కనీసం కుర్చీలేకుండా చేసి, మంత్రి పెద్ది‘రెడ్డి’ కుర్చీలో కూర్చున్నారు. ఎంపీ రంగయ్య, జెడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద్.. ఇంతమంది బీసీల్ని నిలబెట్టి ‘రెడ్డి’ కుర్చీ వేసుకున్నారు.