ఆంధ్రుల హక్కు ఉక్కయితే.. ఉత్తరాంధ్రకు దిక్కు తెదేపా `అని శంఖారావంలో ధీమాగా ప్రకటించాడు యువనేత నారా లోకేష్. ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసానికి గురై కళతప్పిన ఉత్తరాంధ్ర `మళ్లీ కళకళలాడాలంటే తెలుగుదేశాన్ని గెలిపించుకోవడం ఒక్కటే మార్గమని గుండెనిబ్బరంగా ప్రకటించాడు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్ర ఎన్నడుగులు ముందుకేసిందో వెనక్కెళ్లి చూడండి. వైసీపీ పాలనలో ఎంత వెనక్కి పోయిందో ముందుకొచ్చి చూడండంటూ `పార్టీ శ్రేణుల కేరింతల మధ్య ప్రకటించాడు. రోడ్లు, బ్రిడ్జిలు, భోగాపురానికి భూసేకరణ, సాగునీటి ప్రాజెక్టులు, పక్కా ఇళ్లు.. ఒక్కటేమిటి `ప్రగతి చక్రాన్ని పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం అని భావోద్వేగంతో ప్రకటించాడు. గురువారం రాజాం, చీపురుపల్లి, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావ సభలు నిర్వహించిన లోకేష్ `వైసీపీని భూస్థాపితం చేద్దామని పిలుపిస్తూనే.. తెదేపా, జనసేనలను గెలిపించుకుని.. ఉత్తరాంధ్రపై చెరగని అభివృద్ధి సంతకం చేద్దామన్నాడు.
- ఊరికో అబద్ధం.. ఊరికే అబద్ధం అతని నైజం
- నాకు క్లాస్‌మేట్స్.. అతనికి జైల్‌మేట్స్
- 420 కింద జగన్‌పై 28 కేసులు
- కేబినెట్ మంత్రులంతా దద్దమ్మలు
- అలాంటి వాళ్ల ప్రభుత్వంతో ఒరిగేదేముంది?
- ఉత్తరాంధ్ర అభివృద్ధి నాదీ పూచీ
- సూపర్ `6ని జనంలోకి తీసుకెళ్లండి
- పార్టీ శ్రేణులకు నారా లోకేష్ పిలుపు
రాజాం (చైతన్యరథం): రాష్ట్ర ముఖ్యమంతి జగన్ రెడ్డికి నిజం చెబితే తల ముక్కలయ్యే శాపముంది. అందుకే ఊరికో అబద్ధం, ఊరికే అబద్ధం చెప్తుంటాడు. అసలు విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసిందే తెలుగుదేశం. రోడ్లు, బ్రిడ్జిలు, భోగాపురానికి భూ సేకరణ,సాగునీటి ప్రాజెక్టులు, పక్కాఇళ్లు.. ఒక్కటేమిటి `ప్రగతి చక్రాన్ని పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం’ అని పార్టీ యువనేత నారా లోకేష్ భావోద్వేగంగా మాట్లా డారు. యువనేత నిర్వహిస్తున్న శంఖారావంలో భాగం గా గురువారం ఉదయం రాజాం నియోజకవర్గంలో సభ నిర్వహించారు. సభలో లోకేష్ మాట్లాడుతూ ` ఎన్నికేసులు పెట్టినా ఎత్తిన జెండా దించకుండా కాపలా కాస్తున్న పసుపుసైన్యానికి పాదాభివందనాలు అన్నారు. విజయనగరం జిల్లాలోనే విజయముందని, ఇక్కడి నుంచి ఏ పని మొదలుపెట్టినా విజయమే అన్నారు. ఉత్తరాంధ్రలోని పైడితల్లిని, అల్లూరి సీతారామరాజును గుర్తు చేసుకున్నారు. సీఎం జగన్‌ను 420గా అభి వర్ణిస్తూ.. ఆయనపై 420 కేసులు 28 ఉన్నాయన్నారు. సీపం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ 840 అని ఛలోక్తి విసురుతూ`పనికిమాలిన సలహాలు ఇవ్వడంలో ఆయన దిట్ట అని ఎద్దేవా చేశారు. పనికిరాని పోస్ట్ తగిలించుకుని ఇప్పటివరకు జీతాల పేరుతో 150 కోట్లు ప్రజాధనం మింగేశాడన్నారు. సజ్జలకు రెండు ఓట్లు ఉన్నాయని చెప్తూ, సీఎం సలహాదారుడే దొంగ ఓట్లువేసే పరిస్థితి రావడం దౌర్భాగ్యమన్నారు. తిరుపతి ఉపఎన్నిక సమయంలోనే దొంగ ఓట్లు చేర్పించే అధి కారులపై చర్యలు తప్పవని చెప్పానని గుర్తుచేస్తూ, ఇప్పుడేమైంది అక్రమాలకు పాల్పడిన ఐఏఎస్‌ను, డీఎస్పీ, సీఐలను, ఎస్‌ఐలను ఈసీ సస్పెండ్ చేసిందిగా అన్నారు. రేపోమాపో మరికొందరిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. ఎందుకు అధికారులు నా రెడ్‌బుక్‌లో ఎక్కాలనుకుంటారు? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిం చారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎవరినీ వదిలిపెట్టనని, నీతి నిజాయతీలతో బతకాలని అధికార యంత్రాంగానికి లోకేష్ సూచించారు.
సీఎం జగన్‌పై సెటైర్లేస్తూ.. తాను అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకుంటే, రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ మ్ముకున్నాడని ఎద్దేవా చేశారు. తాను జనంలో తిరుగుతుంటే.. జగన్ పరదాల మాటున దాక్కుంటు న్నాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘నేను స్టాన్‌ఫోర్ట్ లో చదివితే, జగన్ టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడని అంటూ.. నాకు క్లాస్ మేట్స్ ఉంటే జగన్‌కు జైలుమేట్స్ ఉన్నారని ఎద్దేవాచేశారు. ఉదయం లేస్తే ఢల్లీి చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు మన ఆర్థికమంత్రి బుగ్గన అని, ఇసుక, గనులు మింగేసే గనులశాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి, నకిలీ మద్యం అమ్మడంతో పాటు కోర్టు ఫైళ్లు కొట్టేసిన వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి.. ఇంత గొప్పవాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తుంటే ఏం అభివృద్ధి సాధించగలమని ప్రశ్నించారు. పిల్ల కాలువలు కూడా తవ్వలేని వ్యక్తి అరగంట రాంబాబు `ఇక ఇరిగేషన్‌కు చేసేదేముంటుందని ప్రశ్నించారు. సొంత ఊళ్లో ధాన్యం సంచులు ఇవ్వలేని వెర్రివెంగళప్ప మంత్రి కారుమూరి అని, పిల్లలు బాగా చదవకపోవడం వల్లే ఉద్యోగాలు రాలేదన్న విద్యాశాఖ మంత్రి బొత్ససత్య నారాయణ అంటూ ఇంతటి ఘనాపాటీలతో పాలన ఏం సాగుతుందని ఎద్దేవా చేశారు. పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్‌పై సెటైర్లువేస్తూ.. కోడి, గుడ్డు కథలు చెప్పడం వినా.. మొత్తంగా కేబినెట్ ఓ పనికిరాని దద్దమ్మల గుంపుగా అభివర్ణించారు.
ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చంద్రబాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారని గుర్తు చేస్తూ `యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటామన్నారు. ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని, ప్రతి ఏడాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం, జీవో 3 పునరుద్ధరించి గిరిజనులకే ఉద్యోగాలిస్తామని. ఉద్యోగం రానివారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ సిక్స్ హామీలను ప్రస్తావించారు.
దర్జాగా దందాలు..
ఉత్తరాంధ్రలో మూడు కుటుంబాలకు జగన్ లైసెన్స్ ఇచ్చారు. బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి భూములు, చెరువులు కబ్జా చేస్తున్నారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని లోకేష్ విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీ కరణలో జగన్ ఆటలు సాగవని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఫ్యాక్టరీని నడిపిస్తుందన్నారు. విజయ నగరం జిల్లాకు 50 హామీలిచ్చిన జగన్ ఒక్కటైనా నెరవేర్చాడా? అని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తిచేయలేదు, రామతీర్థం ప్రాజెక్టు గాలికొది లేశారు. చివరకు గోస్తనీ-చంపావతి నదుల అనుసం ధానం చేయలేదు. రామభద్రాపురం, పెద్దగడ్డ ప్రాజెక్టు లు పూర్తిచేస్తామని చెప్పి పట్టించుకోలేదు. సాలూరు బైపాస్ రోడ్డు, పాలేరు నదిపై డ్యామ్ నిర్మాణం, స్వర్ణ ముఖి-చిట్టిగడ్డపై బ్రిడ్జిపై నిర్మిస్తామన్నారు. ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిస్తే ` పిల్లకాలు వలు తవ్వి ప్రతి ఎకరాకు నీరు ఇస్తామన్నారు. గతం లోనే తాగునీరు ఇచ్చామని, ఇంకా అందించాల్సి ఉంది. అదీ చేస్తామన్నారు.
గతంలోనే ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చామని, మహిళల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, ఐటీఐ, రైతుబజార్, తాను మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించి సీసీ రోడ్లు వేసినవే అన్నారు. కంబాల జోగులు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగావున్నా, ఒక్క పనైనా జరిగిందా? అని ప్రశ్నించారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాలు జోగులును గెలిపిస్తే మీకు ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చినట్టు అంటూ వెటకారం చేశారు. ఏ పని జరగాలన్నా ముగ్గురి దగ్గరకు వెళ్లి కప్పం కట్టాలి. ఓ పక్క ఎమ్మెల్యే, మరోపక్క ఎమ్మెల్సీ విక్రాంత్, ఇంకో పక్క చిన్న శ్రీను అంటూ వ్యగ్యంగా మాట్లాడారు. వీరంతా కలిసి పెద్దఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారు. పక్కనే నాగావళి నది ఉన్నా నేడు ట్రాక్టర్ ఇసుక రూ.5వేలు అయిందంటే వీరు ముగ్గురే కారణం. రైతులు ధాన్యం కొనుగోళ్లలో కూడా పెద్దఎత్తున దోపిడీ చేశారని తీవ్ర స్వరంతో విమర్శించారు. జిల్లాల్లో పంచాయతీ రాజ్ జేఈ రామకృష్ణ ఆత్మహత్యకు కారణం వైకాపానే. ఆయనను బెదిరించి ఇసుక, ఇనుము లాక్కున్నారు. తిరిగి ఆయన్నే డబ్బులు కట్టమంటే, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. 2024లో టీడీపీ-జనసేన బలపరిచిన వ్యక్తిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రామిస్ చేశారు. పద్ధతి ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామని, తోటపల్లి ప్రాజెక్టుకు అవసరమైన పిల్ల కాలువలు తవ్వుతామని, రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో నాకు తెలుసు. మనం అధికారంలోకి వస్తే మొదటి వంద రోజుల్లో రోడ్లు వేసే బాధ్యత నేను తీసుకుంటా అని ప్రామిస్ చేశారు.
విజయనగరం-పాలకొండ-రాజాం మార్గంలో 4 లైన్ రోడ్లు వేస్తామని, పట్టణానికి భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తామని, రింగ్ రోడ్డు కూడా ఏర్పాటుచేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పవన్ రాష్ట్రానికి వస్తుంటే ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసిందీ అరాచక ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఏపీ బోర్డర్ లో 3గంటలు ఆపేశారు. అందుకే సైకో జగన్‌ను తరిమికొట్టాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించుకున్నారని లోకేష్ హెచ్చరించారు. ప్రతి కార్యకర్తా ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని, టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.