పాలనాదక్షకుడిగా గుర్తింపు పొందినవారే ప్రజాహృదిలో చిరస్థాయిగా ఉంటారు. అలా.. ఉమ్మడి ఏపీలో సంక్షేమ పథకాల ఆధ్యుడిగా, సామాన్యులకు ఆరాధ్యదైవంగా ఎన్టీఆర్ నిలిస్తే… అభివృద్ధి, ఐటీ, సంస్కరణలకు పెట్టిందిపేరుగా చంద్రబాబు నిలిచారు. విభజిత ఆంధ్రలోనూ తనకు సాటి తానేననిపించుకున్నది చంద్రబాబే. ఉత్తమ పాలకుడిగా, నవ్యాంధ్ర నిర్మాతగా ప్రజా హృదయంపై చెరగని ముద్ర వేశారనడానికి `2024 ఎన్నికలే సజీవ సాక్ష్యం. అడ్మినిస్ట్రేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అనడానికి ఉమ్మడి, విభజిత రాష్ట్రంలో లెక్కలేనన్ని ఉదంతాలు. ప్రకృతి విపత్తు బుడమేరు వరదలో చిక్కుకున్న బెజవాడను ఆపద్బాంధవుడిలా ఆదుకున్న ఘట్టం.. మరోసారి చంద్రబాబు పాలనాదక్షతకు అగ్రపీఠమేసింది.
సరిగ్గా వారం క్రితం.. రెండురోజులపాటు ఎడతెరిపిలేని కుంభవృష్టి ఉమ్మడి కృష్ణాను అతలాకుతలం చేసింది. కృష్ణా క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలతోపాటు.. బుడమేరుకు వాగులు, వంకలనుంచి ప్రవాహం పోటెత్తడంతో కట్టలు తెంచుకున్న వరద నగరంపై విరుచుకుపడిరది. ఫలితంగా `నగరం జలదిగ్బంధమైంది. క్రైసిస్ మేనేజ్‌మెంట్‌లో దిట్ట అయిన చంద్రబాబు.. ముంచుకొచ్చిన ముప్పును వేగంగా అంచనా వేయగలిగారు. హోంమంత్రి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌లతో ఏపీఎస్‌డీఎమ్‌ఏ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ)లో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తూనే.. ఆపరేషన్ ఫ్లడ్‌ను రూపొందించారు. వరదను ఎదుర్కోవాలంటే `వరదలోనే ఉండాలనుకున్నారు. ‘ఆపరేషన్ ఫ్లడ్’లో ఇదీ చంద్రబాబు తీసుకున్న తొలి నిర్ణయం. వెంటనే `ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌ను క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ.. అక్కడే ఉన్నారు. అక్కడే తిన్నారు. అక్కడినుంచే క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లారు. అక్కడే విశ్రమించారు. అధికారులతో అక్కడే సమీక్షలు జరిపారు. సీఎం ఆదేశాలతో ఎస్డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్) రంగంలోకి దిగింది.
కేంద్రానికి పరిస్థితిని వివరించి.. ఎన్డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్)ను రంగంలోకి దించారు. సహాయక చర్యలను ముమ్మరం చేస్తూనే.. ఆర్మీని సైతం ఇవ్వాలంటూ కేంద్రంతో మాట్లాడారు. ఉత్పాత పరిస్థితిని చంద్రబాబు సమర్థంగా వివరించడంతో.. హెలీకాఫ్టర్లూ రంగంలోకి దిగాయి. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బోట్లు సరిపోకపోవడంతో మత్స్యశాఖ నుంచీ వందలాది బోట్లను వరద ప్రభావిత ప్రాంతాలకు తెచ్చారు. వరదలో చిక్కుకున్న ప్రజలకు ఆహారం, తాగునీరు అందిస్తూనే.. ప్రకృతి ఉత్పాతంలో భారీ ప్రాణనష్టం సంభవించకుండా చంద్రబాబు తీసుకున్న చర్యలు, నిర్ణయాలూ అద్భుత ఫలితాలే ఇచ్చాయి. లోతట్టునున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో.. సీఎంగా చంద్రబాబు కఠోర శ్రమ ఫలించింది. బోట్లు వెళ్లలేని ఇరుకైన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీటిని అందించడం.. విపత్తు నివారణ సమయంలో చంద్రబాబు ఆలోచనా విధానానికి గీటురాయి. ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనుసరించిన ప్రణాళికా విధానం, వేగం, కఠోర శ్రమను అభినందించకుండా ఉండలేం’ అంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు చాలు `‘అతడే ఒక సైన్యం’ అంటూ రాష్ట్ర ప్రజలు మురిసిపోవడానికి!
24/7 అందుబాటులో కమాండ్ కంట్రోల్ రూమ్
సీపం చంద్రబాబు తీసుకున్న మరో కీలక నిర్ణయం కమాండ్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు. పోలీస్, విపత్తుల నిర్వహణ, మున్సిపల్ శాఖలతోపాటు కలెక్టరేట్‌లో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలనుంచే సమాచారం తీసుకున్నారు. అంతవేగంతో వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి, వారి ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రాణనష్టం సంభవించకుండా.. నెట్‌వర్క్ ఆపరేటింగ్ బాధ్యతలను యవ మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు. సీఎం క్యాంపు కార్యాలయంగా మారిన కలెక్టరేట్ నుంచే వివిధ విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, కమిషనర్లు, డైరెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులందరినీ సమావేశపరచి.. మంత్రి లోకేష్ సారథ్యంలో ‘ఆపరేషన్ ఫ్లడ్’ మొదలైంది. సీఎం వేగవంతమైన నిర్ణయాలు ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చాయనడానికి `భయవిహ్వల పరిస్థితినుంచి సాధారణ స్థితికి చేరిన వరద బాధితులే నిలువెత్తు నిదర్శనం.
బుడమేరు గండ్లు పూడ్చడంలో కఠోర దీక్ష
బుడమేరు కుడిగట్టుకు ఎనిమిది, ఎడమ గట్టుకు మూడు గండ్లు పడ్డాయి. ఇది ఐదేళ్ల వైసీపీ పాలనా పాపాల ఫలితం. విజయవాడ సిటీ పీకల్లోతు కష్టాల్లో పడటానికి ప్రధాన కారణం కూడా. భారీ వరదకు మూలంపై దృష్టిపెట్టిన చంద్రబాబు.. తక్షణమే మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్‌కు గండ్లుపూడ్చే బాధ్యతలు అప్పగించారు. సీఎం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయికి వెళ్లిన మంత్రులు, గండ్లు పూడ్చే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. సడలని సంకల్పంతో బుడమేరు గండ్లకు గట్టుకట్టడంలో సీఎం, మంత్రులు కఠోర దీక్ష ఫలించింది.
వరదకు ఎదురెళ్లిన చంద్రబాబు..
ప్రజలు కష్టంలో ఉన్నారంటే.. ప్రకృతి సవాళ్లకు ఎదురెళ్లడం చంద్రబాబుకు కొత్తకాదు. నాలుగు దశాబ్దుల రాజకీయ ప్రయాణంలో అందుకు ఎన్నో ఉదంతాలు, ఘట్టాలు లేకపోలేదు. ఈసారీ అలాంటి దృశ్యాలే తారసపడ్డాయి. వరద ముంచెత్తుతున్నా, ప్రవాహ వేగానికి వంతెనలు ప్రమాదకర స్థితిలో పడినా.. రైల్వే వంతెనలపై రైళ్లు తిరుగుతున్నా.. ముఖ్యమంత్రికి అవేమీ కనిపించలేదు, కష్టంలోవున్న ప్రజలు తప్ప. అందుకే `రేయింభవళ్లు వరద పరిస్థితికి ఎదురెళ్లారు. తాను కనిపిస్తే.. కష్టంలోవున్న ప్రజలకు కొండంత ధైర్యమని నమ్మారు. ఒకపక్క క్షేత్రస్థాయి పర్యటనలో ప్రజలను కలుస్తూ.. మరోవైపు పరిస్థితి తీవ్రతపై అధికారులతో సమీక్షలు జరుపుతూ.. ఇంకోపక్క కేంద్రానికి పరిస్థితిని వివరిస్తూ.. అన్నీ తానై నడిపించడం చంద్రబాబుకే సాధ్యమైంది. సీఎం హోదాను, అనుసరించాల్సిన కాన్వాయ్‌ని దూరంపెట్టి.. రెండు రోజులు ప్రొక్లెయినర్‌పైనే పర్యటనలు జరిపారంటే.. నాయకుడిగా బాబు సంకల్పానికి హేట్సాఫ్. పడవలు, జేసీబీలు, ట్రాక్టర్లు, ఫంటులలో ప్రయాణిస్తూ.. వరద బాధితులకు ధైరాన్నిచ్చే వెలుగయ్యాడు. పాలనాదక్షుడు అన్న పదానికి నిలువుటద్దమై నిలిచారు చంద్రబాబు.
బాబుకు బలమైన `టీమ్ సీబీఎన్
జలదిగ్బంధాన్ని చేధించడంలో సీఎం సంకల్పానికి వెన్నుముకలా నిలిచింది `టీమ్ సీబీఎన్. ఐటీ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, మున్సిపల్ మంత్రి నారాయణ, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ మంత్రి గొట్టిపాటి, బీసీ సంక్షేమ మంత్రి సవిత, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి, గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారధి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, దాదాపు 30మంది ఎమ్మెల్యేలు వరద సహాయక చర్యల్లో విశ్వసనీయ పాత్ర పోషించారు. కేంద్రమంత్రులు కె. రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తంగా.. సీఎం దిశానిర్దేశం మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ట్రాక్టర్లు నడుపుతూ ఆహారం, మంచినీరు, పాల ప్యాకెట్లను ప్రజలకు అందించారు. విపత్కర పరిస్థితిని చక్కదిద్దడంలో ముఖ్యమంత్రికి ప్రధాన బలమయ్యారు. ఇక `వార్డుకొక ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించడం.. చంద్రబాబు తీసుకున్న అద్భుత నిర్ణయం. 64మంది ఐఏఎస్‌లు, జిల్లాస్థాయి, మండలస్థాయి, సచివాలయస్థాయి అధికారులు వరద సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
బాబు పిలుపుతో వరదను మించిన సాయం…
‘ప్రభుత్వం పిలుస్తోంది. రండి, కదలిరండి’ అంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో రాష్ట్రం మొత్తం కదిలింది. వరదలో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్న బాధితులకు సాయం చేయమన్న బాబు పిలుపుతో `ప్రజలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు స్వచ్ఛందంగా కదిలారు. బాబు పిలుపుతో బాధితుల ఆకలికి పరిష్కారం దొరికింది. కడుపు నిండిరది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితినుంచి బయటపడగలమన్న ధైర్యం చిక్కింది. ప్రభుత్వం అందించే ఆహారపొట్లాలే కాదు, ప్రజలూ ఆహారం, మంచినీరు, బిస్కెట్లు, పాలు, పండ్లు స్వయంగా పంచారు. ప్రజల సాయం పోటెత్తిన వరదను అధిగమించింది. మరోపక్క `ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలు, సెలబ్రిటీలు, ట్రస్టులు, ఎన్నారైలు.. వరదను మించిన విరాళాలిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. చంద్రబాబుపై ప్రజా నమ్మకానికి ఇదొక ‘మెచ్చు’తునక!
ఇళ్లకే నిత్యావసరాలు…
వరద బాధితులకు నిత్యావసరాలందించే ప్రక్రియ ఉద్యమంలా సాగుతోంది. రాష్ట్రం నలుమూలలనుంచీ వందలాది లారీలతో నిత్యావసరాలు విజయవాడ నగరానికి వచ్చేలా చేశారు. బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, పంచదార, బంగాళదుంప వంటి సరుకులను ప్యాకింగ్ చేసి, రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే ప్రాసెస్‌కు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. అదేసమయంలో రాష్ట్రం నలుమూలల నుంచీ కూరగాయలను విజయవాడకు రప్పించారు. వాహనాలనే మొబైల్ మార్కెట్లు చేసి.. ప్రధాన కూడళ్లు, వార్డు కేంద్రాల వద్ద పెట్టి.. కేవలం రూ.10 నుంచి రూ.20లోపు ధరలకే కూరగాయలు అందించే చర్యలు తీసుకున్నారు చంద్రబాబు . వరద బాధితులకు ఇది పెద్ద ఉపశమనం.
వాయువేగంతో పారిశుధ్య పనులు
వరద తెచ్చిన బురదతో సతమతమవుతున్న ప్రజలకు.. చంద్రబాబు తన విజన్‌తో అండగా నిలిచారు. రాష్ట్రంలోని, పొరుగు రాష్ట్రాలనుంచీ ఫైరింజన్లను రప్పించి.. ఇళ్లు, రోడ్లమీద బురదను శుభ్రం చేయించే పనులు చేపట్టారు. రాష్ట్రవ్యాప్త పారిశుధ్య కార్మికులను విజయవాడకు రప్పించి డ్రైనేజీ పూడిక, రోడ్లపై పేరుకున్న ఇతర వ్యర్థాలను శుభ్రం చేయించే పనులకు శ్రీకారం చుట్టారు. శానిటేషన్ ప్రక్రియలోనూ డ్రోన్లను వినియోగించేలా సీఎం చర్యలు తీసుకున్నారు. ఆనారోగ్యంపాలైన ప్రజలకు అందుబాటులో వార్డుల వారీగా వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. నిత్యావసరాలతో పాటు 6 రకాలు అత్యవసర మందులను పంపిణీ చేసేలా చంద్రబాబు ఆదేశాలిచ్చారు. అదీ `సీఎం చంద్రబాబు పాలనాదక్షత. ప్రజాహృదిలో చిరస్థాయిగా నిలిచే నాయకుడు చంద్రబాబు.
-మునీంద్ర కొడాలి, పొలిటికల్ అనలిస్ట్