- సీఎం జగన్‌రెడ్డి సంక్షేమమంతా రంగు కాగితాలకే పరిమితం
- సిఎం, మంత్రులకు ఎమ్మెల్సీ అశోక్ బాబు సవాల్!
అమరావతి: ఎన్నికల హామీలు 98 శాతం అమలుచేశామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, వాటి పూర్తి సమాచారం, లబ్ది దారుల వివరాలతో సహా ప్రజల ముందు ఉంచే ధైర్యం ఉందా అని తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్సీ పరు చూరి అశోక్‌బాబు ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా సరే డ్రిప్ ఇరిగేషన్‌కు ఈ ప్రభుత్వం రూపాయి సాయం చేసిందని నిరూపిస్తే, నా పదవికి రాజీనామా చేస్తానని వ్యవసాయ మంత్రికి, ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా. అధికారం కోసం అలవికాని హామీలతో ఏపీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక వారికి నరకం చూపిస్తున్నాడు. జగన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధి అంతా రంగు కాగి తాలకే పరిమితం. ఎన్నికల హామీలు అమలు చేశామని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పడం హాస్యాస్పదం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పుకు నే జగన్మోహన్‌రెడ్డి, హామీలు ఇప్పటికే అమలుచేశామని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు. ఆ సంక్షేమం అంతా అంకెలగారడీ, రంగుకాగితాలకే పరిమితమని ఘంటాపథంగా చెప్పగలం.
రైతులు మొదలు ఉద్యోగుల వరకు అందరికీ పంగనామాలే
రైతు భరోసా కింద ప్రతి రైతుకి రూ.15వేలు ఇస్తామన్న జగన్‌రెడ్డి, రూ.7,500లతో సరిపెట్టాడు. కేంద్రం ప్రకటించక ముందే రైతు భరోసా సాయం రూ.15వేలు ఇస్తానన్న జగన్‌రెడ్డి, తీరా ఏరుదాటాక తెప్పతగలేసినట్లు కేంద్రమిచ్చే కిసాన్ యోజన సొమ్ము తో కలిపి రూ.15వేలని నాలుక మడత పెట్టేశాడు. గత ప్రభుత్వంలో అన్నదాతలకు రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణాలు,మూడు లక్షల వరకు పావలా వడ్డీ కింద రుణాలిచ్చారు. జగన్‌రెడ్డి వచ్చాక పావలా వడ్డీ రుణానికి మంగళం పాడేశాడు. ఆక్వా రంగానికి ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ, డీజిల్ రాయితీని తొలగించారు. మోటార్లకు మీటర్లు బిగించి, రైతుల మెడకు ఉరితాళ్లుబిగించడానికి కూడా ఈ ముఖ్యమంత్రి వెనుకాడలేదు. అదేమంటే నాణ్యమైన విద్యుత్ కోసమంటూ నంగ నాచి కబుర్లు చెబుతున్నారు.
పెద్ద పళ్లెంలో అన్నం పెడుతున్నామని గొప్పలు చెప్పడం కాదు, ఎంత ఆహారం, ఎందరికి పెడుతున్నామన్నదే ప్రధానం. 2019-20 నుంచి ఇప్పటివరకు రూ.8 లక్షలకోట్లు అప్పులు చేసిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం అమలుచేసినన్ని పథకాలు ఎందుకు అమలుచేయలేదు? జగన్‌రెడ్డి చెబుతున్న పథకాల అమలు, సంక్షేమం అంతా ప్రకటనలకే పరిమితం. ఈ ముఖ్య మంత్రి ఒకచేత్తో రూపాయి ఇస్తూ, మరోచేత్తో 30 రూపాయలు లాక్కుంటున్నాడని ప్రజలకు బాగా అర్థమైంది.
టీడీపీ ప్రభుత్వం ఏటా రైతు రథం కింద ట్రాక్టర్లు పంపిణీ చేస్తే, జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లయ్యాక మొక్కు బడిగా అరకొరా పంపిణీ చేశాడు. రైతు ఇన్‌పుట్ సబ్సిడీ, ధరల స్థిరీకరణ నిధి, గిట్టుబాటు ధరల మాటే మిటి?. గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ రైతులకు ధాన్యం కొనుగోళ్ల తాలూకా డబ్బులివ్వలేదు.
జాబ్ క్యాలండ్ విషయంలో నిరుద్యోగులను మోసం చేశారు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని చెప్పినవారు, ఇప్పుడేమో 75వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీలున్నా యంటున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ అని నిరుద్యో గుల్ని మోసగించారు. టీడీపీ హాయాంలో ఇచ్చిన నిరు ద్యోగభృతికి మంగళం పాడారు. ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పుడేమో హోదా అడగ డానికే బెంబేలెత్తుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయాంలో ఆరోగ్యశ్రీని కేవలం రెండు జిల్లాల్లోనే అమలుచేస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని రాష్ట్రమంతా అమలుచేశారు. ప్రజలకు ఎన్ని కట్టుకథలు చెప్పినా, ఎన్ని రంగు కాగితాలు పంచినా, వారిజీవన విధానం మెరుగు పడలేదని జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి.
ఎంతమందికి సాయం చేశారో చెప్పగలరా?
డ్రైవర్లు, నేతకార్మికులు, దర్జీలు, మత్స్యకారులు రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారు. మీరు ఎంతమందికి సాయం చేశారో చెప్పగలరా? కళ్యాణమస్తు పథకానికి కూడా సవాలక్ష కొర్రీలు.హామీల అమలుపై ఏ మంత్రి బహిరంగచర్చకు వస్తారో రావచ్చు.
కొంగను విందు భోజనానికి పిలిచి నక్క మోసం చేసినట్లుగా ముఖ్యమంత్రి సంక్షేమం పేరుతో ప్రజల ను మోసగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు పూర్తిగా రివర్స్ గేర్‌లో నడిచింది. సీపీ ఎస్ రద్దు చేయలేం. జీపీఎస్ అనే పరిస్థితికి వచ్చారు. పోలవరం నిర్మాణంపై కూడాగతంలో మంత్రిగా ఉన్న అనిల్‌కుమార్ ప్రగల్భాలు పలికి, ఇప్పుడు పత్తాలేకుం డా పోయాడు. రాష్ట్రంలోని పీడీ ఖాతాల్లోని సొమ్ముని దారిమళ్లించి పథకాలకు వినియోగించారు తప్ప ఏ కార్పొరేషన్‌కు సొంతంగా నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి బటన్ నొక్కుళ్లతో ప్రజలంతా సంతోషం గా ఉంటే, సొంతపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను జగ న్‌రెడ్డి ఎందుకు తిడుతున్నాడు? ‘గడపగడపకు’ అం టూ ప్రజల ముందుకు వెళ్తున్నవారికి చీపుర్లు, చెప్పు లతో కూడిన స్వాగతాలు ఎందుకు లభిస్తున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అశోక్‌బాబు నిలదీశారు.