ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ ఈనెల 26వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు సోమవారం విచార ణకు రాగా జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈనెల 26కు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయాలని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కోరారు. మూడు వారాల తర్వాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే సీఐడీ తరపు న్యాయవాది రంజిత్‌కుమార్ స్పందిస్తూ కౌంటర్ దాఖలుకు గతంలో సమయం తీసుకుని ఇప్పుడు మళ్లీ వాయిదా కోరుతున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు తరపున కౌంటర్ దాఖలు చేశారని చెప్పారు. విచారణకు తేదీని నిర్ణయించాలని కోరారు. తొలుత రెండు వారాల తర్వాత లిస్ట్ చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. రంజిత్‌కుమార్ విజ్ఞప్తితో ఈనెల 28కి వాయిదా వేసింది.