- ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై సీఐడీ కేసు
- 17 ఏ తీర్పునిచ్చాకే ఫైబర్ నెట్ కేసులో బెయిల్ విషయం చేపడతామన్న సుప్రీం కోర్టు
- ధర్మాసనం మందు నేడు కూడా లిస్ట్ కాని 17 ఏ తీర్పు
- పలు కేసులపై పడనున్న 17 ఏ తీర్పు ప్రభావం
- తీర్పు ఆలస్యంపై సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ : ఫైబర్ నెట్ ప్రాజెక్టు అమలుకు సంబంధించి రాష్ట్ర సీఐడీ నమోదుచేసిన కేసులో తెదేపా అధి నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టులో నేడు విచారణ తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, శ్రీమతి బేలా త్రివేది లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ముందు ఈ రోజు మధ్యాహ్నం విచారణ కోసం బెయిల్ పిటిషన్ లిస్ట్ అయింది.
గత తెలుగుదేశం ప్రభుత్వం దేశంలోకెల్ల అత్యంత తక్కువ ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ గ్రిడ్ ను ఏర్పాటు చేసి, అతి తక్కువ రేటుకు వినియోగ దారులకు టీవీ, అంతర్జాలం(ఇంటర్నెట్), టెలిఫోన్ సేవలు అందించినా రాజకీయ కక్షతో ఎట్టి ఆధారా లు లేకుండా జగన్‌రెడ్డి ప్రభుత్వం తన కనుసన్నల్లో నడిచే సీఐడీ చేత చంద్రబాబుపై అక్రమంగా కేసు బనాయించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్ దీపావళి సెలవులకు ముందు అదే ద్విసభ్య ధర్మాసనం ముందు రెండుసార్లు విచారణకు వచ్చినా ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించడానికి అవకాశం లభించలేదు. అంతకుముందే.. తనపై గవర్నర్ అనుమతి లేకుండా కేసులు నమోదు చేయటాన్ని ప్రశ్నిస్తూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసును క్వాష్ చేయా లంటూ సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖ లు చేశారు. అవినీతి నిరోధక సవరణ చట్టం, 2018లోని సెక్షన్ 17ఏ ప్రకారం గతంలో ముఖ్య మంత్రిగా చేసిన తమపై గవర్నర్ అనుమతి లేకుం డా కేసు పెట్టటాన్ని ప్రశ్నిస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబా బుకు 17ఏ వర్తిస్తుందని ఆయన తరపు సీనియర్ లాయర్లు గట్టిగా వాదించారు.
17 ఏ తీర్పు ప్రాముఖ్యత
చంద్రబాబుకు 17ఏ వర్తింపుపై అనిరుద్ధ బోస్, శ్రీమతి బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముం దు సుదీర్ఘంగా జరిగిన ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈ విచారణతో పాటు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ధర్మాసనం ముందుకు వచ్చింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను పలు మార్లు వాయిదా వేసిన ధర్మాసనం.. 17ఏ పై తమ తీర్పును ప్రకటించాక ఆ పిటిషన్ ను చేపడతామని చెబుతూ, దీపావళి సెలవులకు ముందు జరిగిన విచారణ సందర్భంగా ముందస్తు బెయిలు విచాం ణను నవంబర్ 30కి వాయిదావేస్తూ.. అప్పటి వర కు చంద్రబాబును అరెస్టు చేయొద్దని సీఐడీని ధర్మా సనం ఆదేశించింది.
సుప్రీం కోర్టు ధర్మాసనం రెండు మూడు సార్లు ఇచ్చిన సంకేతాల ప్రకారం ఇప్పటికే 17ఏపై తీర్పు రావాల్సివుంది. అయితే.. నేటి లిస్టులో కూడా ఈ తీర్పు విషయాన్ని పొందుపరచలేదు.
ఈ నేపథ్యంలో.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఇటీవల రాష్ట్ర హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ జగన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని మంగళవారం విచారణకు చేపట్టిన సర్వో న్నత న్యాయస్థానం.. 17ఏ పై తీర్పు వచ్చిన తరు వాతనే చంద్రబాబు బెయిలు రద్దు విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
17ఏ సెక్షన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు అన్వయిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆయన పై రాష్ట్ర సీఐడీ అక్రమంగా నమోదుచేసిన 6 కేసు లు(అంగళ్లు కేసు తప్ప) వీగిపోతాయని న్యాయకోవి దుల అభిప్రాయం.
17ఏ తీర్పునిచ్చాకే ఫైబర్‌నెట్ కేసులో చంద్ర బాబు ముందస్తు బెయిలు విషయం చేపడతామన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఆ తీర్పు వచ్చాకే స్కిల్ కేసు లో చంద్రబాబు బెయిలు రద్దు అంశాన్ని విచారిస్తా మన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా 17 ఏ తీర్పు ప్రాధాన్యతను వెల్లడిరచాయి. అందుకనే.. 17ఏ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ఆ తీర్పు ఎప్పుడో?