- గత ప్రభుత్వం హంద్రీనీవా పనులను విస్మరించింది
- వచ్చే సీజన్ నాటికి ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తాం
- పుంగనూరు,కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు చర్యలు
- కైగల్ రిజర్వాయర్ పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం
- జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
పలమనేరు(చైతన్యరథం): జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం మధ్యాహం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కైగల్ వాటర్ ఫాల్స్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో కలసి పరిశీలించారు. రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు గతంలో చంద్రబాబు హయాంలో హంద్రీ నీవాకు రూ.4,200 కోట్లు ఖర్చు చేశారు. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో 3,800 క్యూసెక్కుల సామ ర్థ్యానికి పెంచి హంద్రీనీవా ఏర్పాటుకు కృషిచేశారు. అయితే గత ఐదేళ్లలో కాలువ విస్తరణ పనులు, లైనింగ్ పనులు చేయకపోవడంతో పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేక పోతు న్నారని తెలిపారు. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌లలో చుక్కనీరు లేదన్నారు.
ముఖ్య మంత్రి రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్ల పూర్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. గాలేరు- నగరి, తెలుగుగంగ, హంద్రీ నీవా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి గత మూడురోజుల నుంచి హంద్రీ నీవా పనులను పరిశీలిస్తున్నట్టు వివరించారు. వచ్చే సీజన్ కల్లా వీటిని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి 220 కిలోమీటర్ల వైండిరగ్, అవస రమైన చోట లైనింగ్ పనులు వెంటనే చేపట్టేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. తద్వారా పూర్తిస్థాయిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌లో నీరు ప్రవహిం చేలా చర్యలు చేపడతామన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు సంబంధించి లైనింగ్ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
కైగల్ రిజర్వాయర్ పనుల బాధ్యత తీసుకుంటాం
కైగల్ రిజర్వాయర్‌కు గతంలో నిధులు మంజూరు చేసినా పనులు జరగలేదన్నారు. కైగల్ రిజర్వాయర్ పనులను కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఆర్డీవో మనోజ్‌రెడ్డి, నాయకులు సి.ఆర్.రాజన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.