పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల దాష్టీకాలకు వ్యతిరేఖంగా పుట్టింది ఈ యువగళం. జగన్ నిరంకుశ పాలనకు చమరగీతం పాడేందుకు అవతరించింది ఈ యువగళం. అణిచివేతకు గురవుతున్న వారి గొంతుకగా పుట్టింది ఈ యువగళం. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను అంతమెందించేందుకు జనగళమే యువగళంమై పుట్టుకొచ్చి నవోద్యమమై పుట్టుకొచ్చింది.
ప్రభుత్వ వైఫల్యా లను పాదయాత్రలో ప్రశ్ని స్తున్నందుకు యుగళాన్ని ఆపేందుకు చాలావిఫలయత్నా లు చేసింది ఈ సైకో ప్రభుత్వం. జీవో నెం 1 ని తీసుకుని రావడం నుంచి డ్రోన్ లను మోహరించడం వరకు, వాహనాలను అడ్డుకోవడం నుంచి మీటింగ్ లలో కరెంటు తీసేయడం వరకు అన్నీ చేశారు. కానీ ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ప్రజలకు మరింత చేరువయ్యారు.
● గడిచిన వందరోజుల పాదయాత్రలో రాష్ట్రంలోని మొత్తం జనాభాలో మూడో వంతుమందికి యువగళం చేరువైంది. అరాచక ప్రభుత్వంపై ఎక్కు పెట్టిన బాణంగా మొదలైన యువగళంలో కొన్ని లక్షల మంది మద్దతుగా అడుగులేశారు. వారి సమస్యలను చెప్పుకున్నారు.
● సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో నారా లోకేష్ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మంది అవినీతి ఎమ్మె ల్యే లను ప్రజల ముందు నిలబెట్టింది. అధికారపార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టించింది. అవినీతి ప్రశ్నించటంతో పాటు గతంలో రామారావు గారు, చంద్రబాబు గారు చేపట్టిన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేసి సక్సె స్ అయ్యారు.
● “హలో లోకేష్”, “రైతన్నతో లోకేష్”, “లోకేష్ తో గుఫ్తాగు”, “పల్లె ప్రగతి కోసం లోకేష్” వంటికార్యక్రమాల ద్వా రా కొన్ని లక్షలమందికి ప్రశ్నించే గొంతును ఇచ్చా రు నారా లోకేశ్. దీంతో రాయలసీమలోని ఎంతో మంది ప్రజలు లోకేశ్ కు మద్దతుగా యువగళంలో భాగం అయ్యారు.
● నారా లోకేష్ సుమారు 800 వివిధ వర్గాల వారితో పాదయాత్రతో సమావేశమయ్యారు. అనేక చేతి వృత్తుల వారితో కూడా మాట్లాడారు. వారి సంక్షేమం కోసం పోరాడతానని హామీ ఇచ్చారు. అంతేగాకుండా యువ గళం ద్వా రా లోకేష్ ఇప్పటివరకు అణిచివేతకు గురైన 150 సామాజిక వర్గాల వారకు గొంతుకగా మారారు.
● ప్రభుత్వం ద్వా రా ఇబ్బందులు పడుతున్న ప్రజలు వారి బాధను పంచుకోవడానికి యువగళం ఓ చిరునామాగా మారింది. వైసీపీ నాయకుల ఆకృత్యాలకు బలైనన బాధితులు కూడా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా బయటపెట్టే వేదికగా యువగళం మారింది. రజక వర్గానికి చెందిన మిస్బా తల్లిదండ్రులు, మునిరాజమ్మ వంటి వైసీపీబాధితులకు కూడా గొంతుక
అయింది మన యువ గళం.
● నారా లోకేష్ యువ నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడమే కాకుండా యువగళంలో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యా లను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి సింహస్వప్నంగా మారారు. సెల్ఫీ ఛాలెంజ్ ల ద్వా రా అధికార పార్టీ నేతల అవినీతి చిట్టాలను బయటపెట్టారు.
● యువగళం ఇప్పటికే రాహ్స్త్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ లో వచ్చే ఎన్నికలపై ఆందోళన కలిగిస్తుంది. అధికార పార్టీని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్న వారికి అండగా నిలుస్తోంది. సైకో పాలనను తిరస్కరించేలా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబధ్రులు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చారు.