- తరలించేందుకు వచ్చిన విపత్తు నిర్వహణ బృందం
- తనకంటే ముందు ముంపు ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశం
- ఆపై స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని పర్యవేక్షణ
- బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు
- జనజీవనం సాధారణ స్థితికి వచ్చేదాకా కదిలేది లేదని వెల్లడి
- గత ఐదేళ్లు జలవనరుల శాఖ నిద్రపోయిందని వ్యాఖ్య
విజయవాడ(చైతన్యరథం): నగరంలోని రామవరప్పాడు వంతెన కింద ఉన్న హోం మంత్రి అనిత నివాసం వరద నీటితో జలమయమైంది. ఈ క్రమంలోనే విపత్తు బృందం అక్కడికి చేరుకుంది. కానీ, తన ఇంటి వద్ద కంటే ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేప ట్టాలని ఆమె ఆదేశించారు. సహాయక బృందాన్ని సింగ్‌నగర్ వైపు పంపించారు. అనం తరం తన పిల్లలను ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి పంపించి తర్వాత స్వయంగా వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆదివారం నుంచి హోం మంత్రి నివాసం వరద ముంపులోనే ఉన్నా అనిత సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కాలనీలో ఇతర కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
బుడమేరు కట్ట తెగిపోవడంతోనే వరద
ఆదివారం ఉదయం బుడమేరు కట్ట తెగిపోవటంతో ఒక్కసారిగా వరద నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తిందని హోం మంత్రి అనిత తెలిపారు. నగరంలోని 8 డివిజన్లతో పాటు గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు పరిధిలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద తాకి డికి గురయ్యాయని తెలిపారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల పరిధిలో 24 కాలనీలు 70 సచివాలయాలు ఉన్నాయని చెప్పారు. ప్రతీ సచివాలయం పరిధిలో ఒక ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించామని వెల్లడిరచారు. యుద్ధప్రాతిపదికన 5,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వివరించారు. మిగిలిన వారిని తరలించేందుకు పడ వల సమస్య ఉండటంతో కేంద్ర సాయం కోరామని పేర్కొన్నారు. విజయవాడ నగరం సాధారణ స్థితికి వచ్చి జనజీవనం మామూలుగా సాగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతవరకూ ముఖ్యమంత్రి సహా ఏ ఒక్కరూ కదలకూడదని నిర్ణయించామని చెప్పారు. దాదాపు 2 లక్షల మందికి యుద్ధప్రాతిపదికన ఆహారం పంపిణీ చేపట్టామని వెల్లడిరచారు.
గత ఐదేళ్లు జలవనరుల శాఖ నిద్రపోవడంతోనే ఈ దుస్థితి
విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద నీటిని ఎక్కడికి ఎత్తి పోయాలన్నది ఇప్పుడు ప్రధా న సవాల్‌గా మారిందని చెప్పారు. మంత్రి రామానాయుడు నేతృత్వంలో జల వనరుల శాఖ దీనిపై క్షేత్రస్థాయిలో నిర్విరామంగా పనిచేస్తోందని వెల్లడిరచారు. గత ఐదేళ్లు జలవనరుల శాఖ నిద్రపోవడం వల్లే ఇప్పుడు వరద నీరు ఎటు పంపాలో అర్థం కాని పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు.