- ఆలయ నిర్వహణకు నిధులు ఇస్తాం
- స్థానిక ఎన్నికల్లో కురబలకు ప్రాధాన్యం
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
కర్నూలు(చైతన్యరథం): త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్న టు బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. విద్యతోనే కురబల అభివృద్ధి సాధ్య మవు తుందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీపరంగా కురబలకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటు న్నామని వివరించారు. కర్నూలులో ఆదివారం జరిగిన కురబల ఆత్మీయ సమావేశంలో ఎంపీ బత్తిపాటి నాగరాజుతో కలిసి ఆమె పాల్గొని ప్రసంగించారు. ఐక్యతతోనే కురబల అభివృద్ధి సాధ్యమవు తుందన్నారు. రాజకీయాలకతీతంగా ఆత్మీయ సమావేశం నిర్వహి స్తున్నందుకు అభినందనలు తెలిపారు. భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడమే కాకుండా శాశ్వత జీవో కూడా ఇచ్చామన్నారు. త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదే విషయమై ఇటీ వల సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న కురబలు జిల్లాలు, మండలాల వారీగా తక్షణమే కుల సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ నియామ కానికి ఆసక్తి కలిగిన వారు తమ పేర్లు అందజేయాలని తెలిపారు.
అనంతరం కురబ రాష్ట్ర సంక్షేమ సంఘ అధ్యక్షునిగా ఎస్.కే.మల్లి కార్జున, గౌరవ అధ్యక్షుడిగా తట్టే అర్జునరావు, వర్కింగ్ ప్రెసిడెం ట్గా రెడ్డి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా కర్నూలు శ్రీనివాసరావు, మదనపల్లి లక్ష్మన్న, గుంటూరు సత్యనారా యణ రాజు, నంద్యాల శ్రీరాములు, జనరల్ సెక్రటరీగా ఏలూరి సూర్యనారాయణ, కోశాధికారిగా సంతల శ్రీరాములును అందరి సూచన మేరకు ఎంపిక చేశారు. కార్యదర్శులుగా మహేంద్ర (కర్నూలు), చెన్నప్ప (కొత్తచెరువు), దోనస్వామి (అనంతపురం), వెంకటేశ్వరరావు (మచిలీపట్నం), రఘు (రాయచోటి), కాంతారావు (పీలేరు), ప్రచార కార్యదర్శులుగా ఆదోని సంతోష్, పెనుకొండ రామాంజి నేయులు, తిరుపతి శ్రీనివాసులు, బాపట్ల పరమేశ్వరరావు, బక్క రామకృష్ణను ఎంపిక చేశారు. ఎంపికైన వారు కురబల సంక్షేమా నికి కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి సవితను కురబ సామాజిక వర్గీయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కురబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కర్నూలు జిల్లాకు చెందిన కురబ సామాజిక వర్గీయు లు, వివిధ పార్టీలకు చెందని కురబ నేతలు పాల్గొన్నారు.
















