- అడుగడుగునా యువనేతకు ఆత్మీయ స్వాగతం
యలమంచిలి: జనగళమే యువగళమై ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర 223వరోజు యలమంచిలి నియోజకవర్గంలో దద్దరిల్లింది. పంచదార్ల గ్రామం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు అడుగుడగునా మహిళలు, యువకులు, విద్యార్థినీ విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. దారిపొడవునా రైతులు, మత్స్యకారులు, ఎస్‌ఈ జడ్ బాధితులు, వివిధ గ్రామాల ప్రజలు లోకేష్ ను కలిసి అరాచకపాలనలో తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. మరో 3నెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. మధ్యాహ్నం వెదురువాడలో ఎన్‌ఎఓబి బాధిత మత్స్యకారులు, కొప్పుల వెలమలు, సెజ్ బాధితులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. 223వరోజు యువనేత లోకేష్ 14.7 కి.మీ.ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు 3088.7 కి.మీ.లు పూర్తయింది. 224వరోజు యువగళం పాదయాత్ర అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. అనకాపల్లి పట్టణంలోని పాదయాత్ర 3100 కి.మీ.ల మైలురాయిని కూడా చేరుకోనుంది.ఇదిలావుండగా ఈనెల 18వతేదీన గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద యువగళం పాదయాత్ర ముగియనుంది. యువగళం ముగింపునకు గుర్తుగా భారీపైలాన్ ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తల్లి భువనేశ్వరితోపాటు నారా, నందమూరి కుటుంబసభ్యులు హాజరు కానున్నారు.