- అనంతపురం ఎస్పీకి లోకేష్ సూటిప్రశ్న
- మాధవ్ ఎలాంటి వాడో
- ఫకీరప్పకు బాగా తెలుసు
- ఆ వీడియో ఫేకో, రియలో ప్రజలే తేలుస్తారు
- అనంతపురం ఎస్పీకి లోకేష్ సూటిప్రశ్న
అమరావతి : ఎంపి మాధవ్ న్యూడ్ వీడియో ఫేక్ అని ఎస్పీ ఫకీరప్ప ఎలా తేల్చారో చెప్పాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిలదీశారు. మంగళగిరిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏ ఫోరెన్సిన్ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వ్యాఖ్యలను టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు. హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో.. రియలో ప్రజలే తేలుస్తారని లోకేష్ అన్నారు. ఫేక్ వీడియో అయితే.. నాలుగు గోడల మధ్య జరిగితే తప్పేంటి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల ఎలా అంటారని ప్రశ్నించారు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ల వాయిస్ కూడా ఫేక్ అని తేల్చేశారా? అని నిలదీశారు. మాధవ్ వీడియోపై అనంతపురం ఎస్పీ వివరణను తప్పుపట్టిన లోకేశ్.. ఆయనేమైనా ఫోరెన్సిక్ నిపుణుడా అని నిలదీశారు. వీడియో ఒరిజినల్ కాదని చెప్పే ఫోరెన్సిక్ నివేదిక ఏదైనా ఆయన వద్ద ఉందా అని ప్రశ్నించారు. మహిళలను కించపర్చే విధంగా వైకాపా నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫకీరప్ప పోలీసుశాఖలోనే ఉన్నందున మాధవ్ గురించి ఎస్పీకి బాగా తెలుసునకుంటా అని ఎద్దేవా చేశారు. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయటం ఎంత అనివార్యమో… మంగళగిరి నుంచి తాను పోటీ చేయటం కూడా అంతే అనివార్యమని లోకేష్ స్పష్టంచేశారు.