- బాబాయిని చంపించేశావు
- సొంత తల్లి, చెల్లిని తరిమేశావు
- నీ సహనిందితులకే పదవులు పంచావు!
- జగన్ రెడ్డికి ఒక్కఛాన్స్ ప్రజలపాలిట ఖర్మ
మంగళగిరి : సొంత బాబాయ్‌ని చంపించేశావు.. తల్లి, చెల్లిని తరిమేశావు.. జనం నిన్నెలా నమ్ముతారు జగన్‌రెడ్డీ అంటూ టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అని అడిగి గద్దె నెక్కిన జగన్ రాష్ట్ర ప్రజల పాలిట ఖర్మగా మారారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మం డలం మోరంపూడిలో గురువారం జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశ్నావళితో ప్రజా సమస్యలు తెలు సుకున్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ అక్రమాస్తుల కేసులో సహనిందితుల్ని నమ్ముకున్న నిన్నెలా జనం నమ్ముతారు జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు. నమ్మి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, రైతుల్ని జగన్ నట్టేట ముంచా రని ఆరోపించారు. అవినీతి డబ్బు, దౌర్జన్యాలు, కబ్జా లు, విధ్వంసాన్ని నమ్ముకున్న జగన్‌రెడ్డిని సాగనంపే సమయం ఆసన్నమైందన్నారు. తనకి ఛానెల్స్, పేపర్స్ లేవని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్న జగన్‌రెడ్డి అక్ర మాస్తుల పుత్రిక సాక్షి, దానికి అనుబంధంగా పని చేస్తున్న బ్లూ మీడియా ఎవరివో చెప్పాలని నిలదీశారు. అన్నివర్గాలకు అన్యాయం చేసి.. తన కులం, ప్రాం తం, మతం వారికే పదవులు కట్టబెడుతున్న జగన్ రెడ్డిని గద్దె దింపేందుకు జనం ఎదురుచూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు గారు మళ్లీ వస్తేనే బాగుపడతా మని ప్రజలు నినదిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా అధిక ధరలు, పన్నుల భారం తీవ్రంగా ఉందని గ్రామ స్తులు లోకేష్‌కి వివరించారు. రోడ్లు, కాలువలు లేక నానా ఇబ్బందులూ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన లేక మూడు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటివర కూ గ్రామస్తులు అందజేసిన సమస్యలన్నీ నమోదు చేసుకున్నామని.. టిడిపి ప్రభుత్వం రాగానే అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.