- నిలువెత్తు నిర్లక్ష్యం వైసీపీదే కదా జగన్?
- నీ వైఫల్యాలను ఎన్నాళ్లని దాచగలవు?
- ప్రాజెక్టుపై రాజకీయం చేసింది నవ్వుకాదా?
- 11 ముంపు గ్రామాలతో ఆటాడుకున్నదెవరు?
- నీ నిర్లక్ష్యంవల్లే ప్రాజెక్టుపై అదనపు భారం
- నిర్వాసితులను నట్టేట ముంచిన పాపం పోతుందా?
- పెండిరగ్ పూర్తిచేయకుండానే ప్రారంభోత్సవాలు..
- ఎన్నికల స్టంట్‌కు రాష్ట్ర ప్రజలు చెక్..
- నాశనం చేసిన నోటితోనే ఇప్పుడు నీతి మాటలా?
అమరావతి (చైతన్య రథం): అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన వైసీపీ `వెలుగొండపై అకస్మాత్తుగా ప్రేమ చూపించడం జగన్ వికృత రాజకీయానికి నిదర్శనం. కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంలో వైసీపీ నిర్లక్ష్య రాజకీయమే ఇప్పుడు పెనుశాపమై కూర్చుంది. ఆ విషయాన్ని దాచిపెట్టి `వెలుగొండను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం వైసీపీ నికృష్ణ రాజకీయానికి పరాకాష్ట. ప్రాణం పోయినా నిజాలు చెప్పకూడదని గట్టి ఒట్టు పెట్టుకున్న జగన్ `వెలుగొండపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం.. ఆ ప్రాంత ప్రజలపై జగన్‌కున్న మమకారమేపాటిదో చెప్పకనే చెబుతుంది.
కోవిడ్ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టన్నెల్-1, జనవరి 2024లో టన్నెల్-2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశామని ‘ఎక్స్’ వేదికపై జగన్ చేసిన వ్యాఖ్యలు సుద్దపూస అబద్ధాలే. వాస్తవానికి `వెలుగొండ నిర్వాసితులకు పరిహారం చెల్లించుకుండా ప్రారంభోత్సవం చేయడం రైతులను మోసం చేయడమేనన్న విషయాన్ని జగన్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం `వైసీపీ పాలనలో ప్రాజెక్టు పనులపై ఎంతటి నిర్లక్ష్యం సాగిందో చెప్పకనే చెబతుంది. తాము అధికారంలోకి వస్తే వెలుగొండను ఏడాదిలో పూర్తి చేస్తామని బీరాలు పలికిన జగన్ సర్కారు.. గద్దెనెక్కగానే ప్రాజెక్టును గాలికొదిలేసింది. నిజానికి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చేసిన పనుల కారణంగానే.. వైసీపీ గద్దెనెక్కిన ఏడాదికే పెండిరగ్‌లోవున్న తొలి సొరంగం తవ్వకం పూర్తైందన్న విషయం ప్రకాశం జిల్లావాసులకు తెలీంది కాదు.
అప్పటకీ.. తొలి సొరంగం నుంచి ప్రాజెక్టులోకి నీరు తీసుకొనే అవకాశం ఏర్పడినా.. నిర్వాసితుల తరలింపును జగన్ నిర్లక్ష్యం చేయడంతో అదీ వీలు కాలేదు. నిర్వాసితులకు పునరావాసం కింద రూ.1300 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చి కూడా జగన్‌రెడ్డి నిధులు విడుదల చేయకపోవడం.. ప్రాజెక్టుపై జగన్ సర్కారు అలక్ష్యాన్ని చెప్పకనే చెబుతుంది. తాను అధికారంలో ఉన్నపుడు నిధులు విడుదల చేయలేకపోయిన జగన్.. ఈ సీజన్లోనే ఆర్ అండ్ ఆర్‌కు కావాల్సిన నిధులు విడుదల చేస్తే.. ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చని సుద్దపూస కబుర్లు చెప్పడం సిగ్గుచేటు. ఆర్ అండ్ ఆర్ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని వ్యాఖ్యానించడం మరీ దారుణం. పైగా ఎన్డీయే సర్కారు వచ్చి 3 నెలలవుతున్నా నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించడం లేదని వ్యాఖ్యానించడం జగన్ అనైతిక రాజకీయానికి పరాకాష్ట. నిజానికి లక్ష్మీపురంలో వందమందికి పైగా ప్యాకేజీ అందలేదు. వారిలో 40మందికి పైగా చనిపోయారన్న విషయాన్ని కూడా జగన్ ఎక్స్ వేదికపై స్పష్టం చేస్తే బావుండేది.
వెలుగొండ ప్రాజెక్టుపై జగన్ సర్కారు ఎంత అశ్రద్ధ చూపిందో చెప్పడానికి `తప్పుల తడకగా తయారైన నిర్వాసితుల జాబితా పరిశీలిస్తే సరిపోతుంది. గెజిట్లోని పేర్లు తొలగించేసి.. జగన్ ప్రభుత్వ జాబితాలో అర్హుల పేర్లు లేకుండా చేశారు. వెలుగొండ ప్రాజెక్టు కార్యాలయం వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవడం కోసం నిర్వాసితులు నెలల తరబడి అర్జీలిచ్చినా పట్టించుకున్న పాపానపోలేదనడానికి ఎన్నో ఉదంతాలు. ఆ వేదన భరించలేక `వెలుగొండ ప్రాజెక్టు కార్యాలయం వద్ద దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటనను కూడా జగన్ తన ఎక్స్ వేదికపై పోస్టుచేసివుంటే.. వెలుగొండ ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక అర్హత వచ్చివుండేది. దంపతుల ఆత్మహత్యకు, ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు అనాధలవ్వడానికి జగన్‌రెడ్డి కారణం కాదా?
11 ముంపు గ్రామాలతో జగన్ సర్కారు గేమ్?
వెలుగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి.. 11 ముంపు గ్రామలు, 7200 కుటుంబాల జీవితాలతో జగన్ సర్కారు గేమ్ ఆడిరది. పైగా కమిషన్ల కక్కుర్తితో తరచూ కాంట్రాక్టర్లను మార్చడం వల్ల మరో రూ.419 కోట్లమేర ప్రాజెక్టు వ్యయం పెరిగింది. ఇంత జరిగినా.. పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, పల్నాడు 3 జిల్లాల్లో 4 లక్షల 60వేల ఎకరాలకు సాగు నీరు, 15 లక్షల మందికి తాగు నీరు అందించే ప్రాజెక్టును జగన్ సర్కారు కొలిక్కి తేలేకపోయింది. ఏళ్ల తరబడి తనవల్లకాని పనులను మూడు నెలలు కూడా దాటని ప్రజా ప్రభుత్వం పూర్తి చేయలేదని నిస్సిగ్గు వ్యాఖ్యలు చేయడం జగన్‌కే చెల్లు.
నిజానికి `2020 జూలైనాటికి వెలిగొండ తొలి సొరంగం ద్వారా నీరందిస్తానని 2020 ఫిబ్రవరి 20న వెలిగొండ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా జగన్ చెప్పిన మాట నీటి మూటే అయ్యింది. 2022 ఆగస్టునాటికి తొలి సొరంగం, 2023 ఫిబ్రవరినాటికి రెండొ సొరంగం పూర్తి చేసి నీళ్లిస్తానని 2021 అక్టోబరు 7న ఒంగోలు సభలో చేసిన ప్రకటనా నీరుగారింది. 2023 సెప్టెంబర్ నాటికి సొరంగం పనులు పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని, తర్వాతే ఎన్నికలకు వెళ్తామని 2022 ఆగస్టు 23న చీమకుర్తి పర్యటనలో ప్రకటించిన జగన్.. అదీ నెరవేర్చలేదు. కప్పదాటు మాటలతో వెలుగొండను నెట్టుకురావడం తప్ప జగన్ సాధించిన ప్రాజెక్టు పురోగతి అంటూ ఏమీ లేదనడం అతిశయోక్తి కానేకాదు.
వెలుగొండ ప్రాజెక్టు ఖర్చు..
ఐదేళ్లు వెలిగొండ ప్రాజెక్టును పట్టించుకోకుండా, పనులు పూర్తి చేయకుండా, నిర్వాసితులకు పరిహారమివ్వకుండా ఎన్నికల ముందు మార్చి 6, 2024న ప్రారంభోత్సవమంటూ జగన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వెలుగొండ ప్రాజెక్టుకు ఇప్పటివరకూ వెచ్చించింది రూ.5,974 కోట్లు. అందులో జగన్ చేసిన ప్రాజెక్టు వ్యయం రూ.958 కోట్లు. ఇదీ ప్రాజెక్టుపట్ల జగన్ శ్రద్ధ. జగన్ నిర్లక్ష్యం మాట అటుంచితే.. అధికారుల అంచనా ప్రకారం ప్రాజెక్టు వ్యయ అంచనా సుమారు రూ.10వేల కోట్లకు చేరింది. అంటే ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.4వేల కోట్లు అవసరమన్న మాట.
నిర్వాసితులను నట్టేట ముంచిన జగన్ రెడ్డి
నిర్వాసితులను తరలించాలన్న కీలక ప్రక్రియను పూర్తి చేయకుండానే.. రెండు సొరంగాలను జాతికి అంకితం పేరిట శిలా ఫలకాన్ని జగన్ ఆవిష్కరించం నిస్సందేహంగా ప్రజలను మోసం చేయడమే. వాస్తవ లెక్కల ప్రకారం ఇంకా 7వేల మంది నిర్వాసితులకు సాయం అందాల్సి ఉంది. పెద్దారవేడు, మార్కాపురం, అర్ధవీడు మండలాల్లోని 11 ముంపు గ్రామాలను తరలించాల్సి ఉంది. నిర్వాసితులకు రూ.1,500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కాని వారికి పరిహారం చెల్లించకుండా జగన్‌రెడ్డి ఐదేళ్లు నెట్టుకొచ్చాడు. విచిత్రమేమంటే.. భూములు, ఇళ్ల స్థలాలిచ్చిన రైతులను ప్రారంభోత్సవానికి రావద్దంటూ పోలీసుల చేత నోటీసులు ఇచ్చిన నీతిమాలిన చరిత్రను జగన్ పోగేసుకున్నాడు.
పెండిరగ్ పనులు పూర్తికాకుండానే ప్రారంభోత్సవాలా?
నిర్వాసితుకు పరిహారం ఇవ్వలేదు. రెండో సొరంగం వ్యాసార్ధం తగ్గించి మ్యాన్యువల్‌గా తవ్వి ఫీడర్ కాలవ రైలింగ్ పనులు పూర్తి చేయలేదు. కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టు రివిట్‌మెంట్ పనులు పూర్తి కాలేదు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు, వంతెనలు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సొరంగాల లోపల లైనింగ్ పూర్తికాకుండా, ఈ పనుల పూర్తికి మరో మూడేళ్లు పడుతుందని తెలిసినా.. ఎన్నికల స్టంట్ కోసం ప్రాజెక్టును ప్రారంభించడం జగన్ మార్క్ రాజకీయం.
టీడీపీ హయాంలో పూర్తైన పనులు
ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాల్లో వెలిగొండను చేర్చి ప్రత్యేక దృష్టి సారించడం ఆ ప్రాంతవాసులకు తెలీంది కాదు. పోలవరంతో పాటు వెలిగొండపైనా తరచూ సమీక్షలతోపాటు ప్రాజెక్టును సందర్శించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా కాంట్రాక్టర్లను మార్చి పనుల్లో వేగం పెంచారు. 2014 నాటికి 11 కిలోమీటర్లు తొలి సొరంగం పూర్తి కాగా తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లకాలంలో దాదాపు 17.78 కిలోమీటర్లు తవ్వడంతోపాటు అత్యంత క్లిష్టమైన హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తి చేశారు. టీడీపీ హయాంలో మొదటి టన్నెల్ 90.96 శాతం పనులు, రెండో టన్నెల్ 65 శాతం పూర్తయ్యాయి.
ఇదీ జగన్ నిర్వాకం!
నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా, కల్వకుర్తి, నెట్టెంపాడులను యథావిధిగా పూర్తి చేయాలని అప్రూవల్ చేసిన ప్రాజెక్టులను జూలై 15, 2021న కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేసింది. దీనిలో వెలిగొండను అన్ అప్రూవ్డ్ ప్రాజెక్టుగా పేర్కొంది. గెజిట్‌పై అభ్యంతరాలుంటే 6 నెలల లోపల తెలియజేయాలని కేంద్రం చెబితే జగన్‌రెడ్డి పట్టించుకోలేదు. వెలిగొండ అన్ని అనుమతులున్న ప్రాజెక్టుగా పునర్ముద్రించేలా చర్యలు తీసుకోమని జగన్ ప్రభుత్వానికి, కేంద్రానికి టీడీపీకి అనేకసార్లు విన్నవించుకున్నా దగా పాలకుడి సర్కారు నిర్లక్ష్యాన్నే ప్రదర్శించింది.
బడ్జెట్‌లో నీటిపారుదలశాఖ ఖర్చు
2014`19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు బడ్జెట్ ఖర్చు చేయగా.. అందులో ఇరిగేషన్‌కు రూ.68 వేల కోట్లు ఖర్చు చేశారు. 2019`24 మధ్య జగన్ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు బడ్జెట్ ఖర్చు చేయగా అందులో ఇరిగేషన్‌కు కేవలం రూ.32 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులోను సగం అవినీతి చేశారు. పోలవరం పునరావాసంలో రూ.100 కోట్లు అవినీతి చేశారని హైదరాబాద్ ఐఐటి అధ్యయన రిపోర్టులో పేర్కొంది. గండికోట పునరావాసంలో అవినీతిని ప్రశ్నించిన మాజీ సైనికుడు శ్రీనివాసరెడ్డిని వైకాపా గూండాలు హత్య చేశారు. చట్టవిరుద్ధమైన ఆవులపల్లి ప్రాజెక్టు పేరుతో పెద్దిరెడ్డికి రూ.600 కోట్లు దోచిపెట్టారు.
ఇలా జగన్‌రెడ్డి చేసిన ఖర్చులో సగభాగం అవినీతి పాలైంది. తన తండ్రి హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసిన జగనే.. కృష్ణాజలాల్లో మిగులు జలాలపై హక్కు కోరమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు లేఖ ఇచ్చి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల గొంతు కోశాడు. ఈ ద్రోహాన్ని కప్పిపుచ్చడానికి వెలిగొండపై జగన్‌రెడ్డి ఆకస్మిక అబద్ధాల ప్రేమను ఎక్స్‌పై వ్యక్తం చేయడం సిగ్గుచేటు!