165వరోజు సంతనూతలపాడు శివారు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలనుంచి అపూర్వ స్పందన లభించింది. సంతనూతలపాడు పెద్దఎత్తున మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పడుతూ స్వాగతించారు. బైక్ మెకానిక్ లతో సమావేశమైన యువనేత వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. వివిధ వర్గాల ప్రజలు యువనేతకు తమ కష్టాలు చెప్పుకోగా, మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
సంతనూతలపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర. ఎండ్లూరు, పేర్నమిట్ట మీదుగా ఒంగోలు శివారు పాలకేంద్రం విడిది కేంద్రానికి చేరుకుంది. 165వరోజు యవనేత లోకేష్ 11.3 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2189.1 కి.మీ. మేర పూర్తయింది. బుధవారం ఒంగోలు మంగమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించనున్నారు. 27వతేదీన ఒంగోలు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట ప్రాంగణంలో జయహో బిసి కార్యక్రమం నిర్వహిస్తారు.