రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్న యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గం కొత్తపల్లిలో 2వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది.
కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన పైలాన్ ను యువగళం రథసారధి నారా లోకేష్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దివ్యాంగులకు యువనేత లోకేష్ వీల్ చైర్లను అందజేశారు.
చారిత్రాత్మక 2వేల కి.మీ.ల మజిలీకి చేరుకున్న సందర్భంగా మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, యువనేత లోకేష్ ను అభినందనలతో ముంచెత్తారు.
యువగళం చారిత్రాత్మక 2వేల కి.మీ.ల మజిలీని చేరకోవడంతో యువగళంలో ఆనందోత్సాహాలు పొంగిపొర్లాయి.
రెట్టించిన ఉత్సాహంతో యాత్ర పూర్తయ్యేవరకు మీ వెంట నిలుస్తామని యువగళం బృందాలు ప్రతినబూనాయి.
యువగళం 2వేల కి.మీ. చేరుకున్న సందర్భంగా పెద్దఎత్తున కొత్తపల్లికి చేరుకున్న కార్యకర్తలు బెల్లూన్లను ఎగురవేసి, భారీగా బాణసంచా కాల్చుతూ కేరింతలు కొట్టారు.
ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తన వెంట నడుస్తున్న యువగళం బృందాలకు యువనేత లోకేష్ అభినందనలు చెబుతూ… లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇదే దూకుడు కొనసాగించాలని కోరారు.
మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎన్.అమర్ నాథ్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీతల సుజాత, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, భూమిరడ్డ్డి, రాంభూపాల్ రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి ఇన్ ఛార్జి సుబ్బానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బిసి జనార్దన్ రెడ్డి, మీనాక్షినాయుడు తదితరులు యువనేతను కలిసి అభినందనలు తెలిపారు.