- నల్లజర్ల మండలం అనంతపల్లి రైస్‌మిల్లులో లభ్యం
- నాదెండ్ల మనోహర్ తనిఖీతో బయటపడ్డ మాఫియా
- విదేశాలకు తరలించేందుకు నిల్వ చేసినట్టు గుర్తింపు
- అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని మంత్రి హెచ్చరిక
తూర్పుగోదావరి(చైతన్యరథం): కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అనంతరం విజయవాడ వెళుతూ మార్గమధ్యంలో నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామం లో శ్రీ వెంకటసత్యనారాయణ గణేష్ రైస్‌మిల్ అండ్ ఫ్లోర్ మిల్‌ను తనిఖీ చేశారు. మూసి ఉన్న గోడౌన్‌లో భారీఎత్తున రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్టు గుర్తించారు. బియ్యం సంచులపై విదేశీ కంపెనీల పేర్లు ఉండటాన్ని గుర్తించారు. టార్చిలైట్ వెలుగులో స్టాక్‌ను పరిశీలించా రు. కాకినాడ పోర్టు కేంద్రంగా 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు పంపేందుకు వాటిని అక్కడ నిల్వ చేసినట్టు తెలుస్తుంది. బియ్యం నిల్వలను సీజ్ చేసి నిందితులపై క్రిమి నల్ కేసులు నమోదు చేశారు. అక్రమ రవాణా కోసం విదేశాలకు సరఫరా చేసేందుకు వీటి ని ఇక్కడ నిల్వ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వాటిని ప్రస్తుతం అధికారులు పంచనామా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ కేంద్రంగా ఆఫ్రికా దేశాలకు బియ్యం అక్రమంగా తరలుతోంది.
గత ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున బియ్యం తరలించి ఆ పార్టీ నేతలు వేల కోట్లు దిగమింగారు. ఈ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి కూటమి ప్రభుత్వం కట్టుది ట్టమైన చర్యలు చేపట్టింది. అనంతరం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దేవరపల్లిలో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లును కూడా తనిఖీ చేశారు. నిల్వ ఉన్న బియ్యం బస్తాలను గుర్తించారు. మిల్లు యజమానులు రెండు సంవత్సరాల క్రితం బియ్యం సీజ్ చేసినట్లు తెలిపారు. అయితే ఎటువంటి సీజ్ చేసిన బియ్యం ఇక్కడ ఉంచడం జరగలేదని పౌరసరఫరాల అధికారి మంత్రితో చెప్పారు. దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. బియ్యం అక్రమ రవా ణాను అరికట్టేందుకు మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇంకా రెండు మూడు మిల్లులపై ఆరోపణలు ఉన్నాయని, వాటిలో కూడా తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బియ్యం అక్రమ రవాణా చేసి లబ్ధిపొందేం దుకు ఎవరు ప్రయత్నించినా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని తెలిపారు.