- ఆవులిస్తే పేగులు లెక్కపెడతా జగన్
- నాకే రాజకీయాలు నేర్పుతావా..
- తప్పు నువ్వు చేసి.. నెపం నాపైనా?
- రాళ్లు చెప్పులు వేయిస్తే బెదిరిపోతానా?
- అలాంటి చీప్ మెంటాలిటీ కాదు నాది
- క్లెమోర్ మైన్స్‌కే భయపడనివాడిని..
- నీ చిల్లర వేషాలకు వెనక్కి తగ్గుతానా?
- నేరాలు చేయను.. చేసే వాణ్ని తొక్కేస్తా
- జె.గ్యాంగులను వదిలే ప్రసక్తే లేదు..
- గాజువాక ప్రజాగళంలో చంద్రబాబు అల్టిమేటమ్
గాజువాక (చైతన్య రథం): జగన్‌రెడ్డీ, నా దగ్గరా నీ చిల్లర వేషాలు, సానుభూతి డ్రామాలు. నువ్వు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగల రాజకీయ అనుభవం నాది. నాకే రాజకీయాలు నేర్పుతావా? నువ్వు తప్పుచేసి నాపై నెపం మోపుతావా? నీపైకి గులకరాళ్లు విసిరే చీప్ మెంటాలిటీ కాదు నాది. అలాంటి పిచ్చి వేషాలు, తిక్క వేషాలు సహించను కనుకే, నీపైకి రాయి విసిరితే స్పందించి ఖండిచాను. ప్రతిగా నాపైకి రాళ్లు వేయిస్తున్నావు. క్లెమోర్ మైన్స్‌కే భయపడలేదు. నువ్వెంత, నీ గ్యాంగులెంత? నేను నేరాలు చేసే మనిషిని కాను. అలాగని నేరాలకు పాల్పడేవాళ్లను ఉపేక్షించను. తుంగలో తొక్కేస్తా’ అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో వైసీపీకి అల్టిమేటమ్ ఇచ్చారు. విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనుకనుంచి ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు రాయి విసిరిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఆ ఘటనతో చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడయ్యారు. శనివారం విజయవాడ బస్సుయాత్రలో జగన్‌పైకి ఆకతాయి గులకరాయి విసిరిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ‘సీఎం కార్యక్రమంలో కరెంటు పోయింది. కరెంటు పోవడానికి నేను కారణమంటున్నారు. అసలు ప్రభుత్వం ఎవరిది? కరెంటు ఎవరి చేతుల్లో ఉంటుంది? సీఎంగా ఈ మాటలు మాట్లాడిరచడానికి సిగ్గుగా లేదూ? కరెంటు పోవడానికి ఎవరిది బాధ్యత?’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు. ‘గతంలో ఓసారి కోడికత్తి డ్రామా ఆడాడు. గొడ్డలి వేటుతో బాబాయ్‌ను చంపి ఆ నేరాన్ని నాపై మోపడానికి ప్రయత్నం చేశాడు.
వివేకా హత్య గురించి చెల్లెలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడు. పైగా, వివేకాను చంపిన వాడికి ఎంపీ పదవిచ్చాడు. వైసీపీకి రాష్ట్ర ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు. వైసీపీ పూర్తిగా రక్తపు మరకలతో తడిచిపోయి ఉందని చెల్లెలే వ్యాఖ్యానిస్తుంది. నేరాలన్నీ అతను చేసి ఇన్ని రోజులూ నాపై దాడులు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్‌పైనా ఇదే తరహా దాడులు చేశారు. ఇప్పుడిక్కడి గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు వచ్చి రాళ్లు రువ్వుతున్నారు. వాళ్లను ప్రజలు వదిలిపెట్టరు. చిల్లర వేషాలు వేస్తే ప్రజలు బట్టలు విప్పి తరిమి తరిమి కొడతారు. పోలీసులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ విషయంలో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. జగన్‌రెడ్డి తన జె.గ్యాంగులను అదుపు చేసుకోవాలని హెచ్చరిస్తున్నా’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
నేడు తెనాలిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే వారాహిపైకి జే.గ్యాంగ్ రాళ్లు రువ్వారని, గతంలో తాను విశాఖ వస్తే వైసీపీ గూండాలు అడ్డుకున్నారని గుర్తు చేశారు. ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు తనను విశాఖనుంచి వెనక్కి పంపేశారని గుర్తు చేశారు. అమరావతిలోనూ తనపట్ల వైసీపీ గూండాలు రాజ్యాంగేతర శక్తుల్లా ప్రవర్తిస్తే.. జె.గ్యాంగ్ చర్యలను డీజీపీ సిగ్గులేకుండా సమర్థించారన్నారు. తన ఇంటిమీదకే వైసీపీ ఎమ్మెల్యే కర్రలతో దాడిచేసిన సందర్భంలోనూ, ఆ చర్యను సమర్థించిన పోలీసులు, ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్మాది జగన్‌రెడ్డిని చూసుకుని పోలీసులు రెచ్చిపోతున్నారు, ఈ రాష్ట్రం, ఈ విశాఖ మీ తాత జాగీరా జగన్‌రెడ్డీ అని చంద్రబాబు నిలదీశారు. నిన్న సీపంపై జరిగిన సంఘటనను నేను ఖండిరచాను.
ప్రధానీ ఖండిరచారు. ఘటనపై అందరం స్పందించాలని చూశాము. కానీ, అది జరిగిన అరగంటలోనే నాకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆగ్రహించారు. నీకేదో జరిగితే నాపై పడి ఏడ్వడమేంటి? నీకు చేతగాకపోతే సీఎం పదవినుంచి దిగిపో. గంటలో రాష్ట్రాన్ని చక్కదిద్ది చూపిస్తా. అదీ నా ట్రాక్ రికార్డు’ అంటూ జగన్‌పై తీవ్ర స్వరంతో చంద్రబాబు ధ్వజమెత్తారు. ఓటమి భయంతో కూటమి కార్యక్రమాలను అడ్డుకుంటున్న చెత్త మెంటాలిటీ జగన్‌ది అంటూ ప్రధాని కార్యక్రమంలో మైకులు కట్ చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రధాని మాటలు ప్రజలకు చేరకుండా చేయడానికే ఆ పిచ్చిపనికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, ప్రధాని సభలోనే పోలీసుల బాధ్యతా రాహిత్యాన్ని ప్రజలు కళ్లారా చూశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
సీఎం జగన్ కార్యక్రమంలో విద్యుత్ వైఫల్యానికి కారణమైన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు.
గులకరాయి వేసిన ఆకతాయిలపై పోలీసులు ఏం చర్యలు తీసుకోగలిగారు? దీనిపై సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్‌కు బాధ్యత లేదా? మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకుని, నాపై రాళ్లు రువ్వించి రాక్షసానందం పొందుతున్నారా? అంటూ చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఏకిపారేశారు. ఒక ఎంపీని అక్రమంగా అరెస్టు చేయించి.. ఇష్టమొచ్చినట్లు కొట్టించి.. వీడియో తీయించి.. దాన్ని చూస్తూ రాక్షసానందం పొందిన సీపం ఈ రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై గులకరాయి వేయడాన్ని సమర్థించనంటూనే.. గులకరాయికే కొంపలు కూలినంత హడావుడి చేస్తారా? అని ఎద్దేవా చేశారు. ‘ముఖ్యమంత్రిపై రాష్ట్ర ప్రజలకున్న కోపాన్ని నేను అర్థం చేసుకోగలను.
ఆ కోపాన్ని ప్రదర్శించే విధానం రాళ్లు రువ్వడం కాదు. పోలింగ్ సమయంలో ఈవీఎంల దగ్గర చూపించండి. మీకు జరిగిన అన్యాయాన్ని అక్కడ గుర్తు చేసుకోండి. వైసీపీని ఓడిరచి, ఫ్యాను రెక్కల్ని ముక్కలు చేయండి. రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించండి’ అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీని ఓడిరచడానికే మూడు పార్టీలు పొత్తుగట్టలేదని, రాష్ట్రంలోని ఐదుకోట్ల మందికి రాక్షస చెరనుంచి విముక్తి కలిగించేందుకే కలిసి వస్తున్నామని చంద్రబాబు వివరించారు. ప్రజలపై, ప్రతిపక్షాలపై దాడులు జరుగుతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీస్ వ్యవస్థను, నియంత పాలనా విధానాన్ని అవలంభిస్తున్న వైసీపీని ఉపేక్షించవద్దని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.