- రెడ్‌బుక్‌లో ఎక్కినోళ్లందరికీ పనిష్మెంటే బ ఎచ్చెర్ల ఘన చరిత్ర విస్మరించొద్దు
- కియాను మించిన పరిశ్రమతెచ్చే పూచీ నాదీ బ యుద్ధప్రాతిపదికన పెండిరగులు పూర్తిచేద్దాం
- ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా బశంఖారావం సభలో నారా లోకేష్
ఎచ్చెర్ల (చైతన్యరథం): ఉత్తరాంధ్రపై హామీల వర్షం కురిపించిన జగన్‌రెడ్డి, ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంతా న్ని దెబ్బతీశారని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ వైసీపీపై నిప్పులు చెరిగారు. ‘ఉత్తరాంధ్రకు జగన్ అనేక హామీలిచ్చారు. పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామ న్నారు. వంశధార, తోటపల్లి లెఫ్ట్, రైట్ కెనాల్స్‌ను, నాగావళి కరకట్ట పనులన్నీ పూర్తిచేస్తామన్నారు. కనీ సం తట్టమట్టి వేయలేదు’ అంటూ వాగ్బాణాలు సంధిం చారు. ఉత్తరాంధ్ర అంటే టీడీపీకి చాలా ప్రేమని చెబుతూనే, రోడ్లు, బ్రిడ్జిలు, హాస్పిటల్స్, నిరుపేదలకు టిడ్కో ఇళ్లు కట్టించింది తెలుగుదేశమేనని గుర్తు చేశా రు. వంశధార- నాగావళిని అనుసంధానం చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందని సగర్వంగా చెప్పారు.
శంఖారావంలో భాగంగా గురువారం రాత్రి ఎచ్చెర్ల సభలో లోకేష్ మాట్లాడారు. ‘ఎచ్చెర్లకు ఘన చరిత్ర ఉంది. ఆనాడు ప్రతిభా భారతిని ఐదుసార్లు గెలిపించి ఏకంగా ఏపీ మొదటి దళిత స్పీకర్‌గా పంపిన నియో జకవర్గమిది. దళితులకు చంద్రబాబు ఇచ్చిన గౌరవం, స్థానం అదీ’ అంటూ ఆనాటి వెలుగును గుర్తు చేశారు. 2014లో మంచి మెజార్టీతో కళా వెంకట్రావును గెలి పించారని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. తోటపల్లి, నారాయణపురం ప్రాజెక్టులను పూర్తిచేశామని, సీసీ రోడ్లు, నిరుపేదలకు ఇళ్లు, బీటీ రోడ్లు వేశామన్నారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీగాని, పైడిభీమవరం ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేసిన వ్యక్తి కళా వెంకట్రావు అని ప్రశంసించారు. కానీ మీరేం చేశారు, పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తీసుకు వచ్చారంటూ లోకేష్ ఆచలోన రేకెత్తించే చెణుకులు విసిరారు.
వైసీపీ పాలనను ఎత్తిచూపుతూ `ఇక్కడ గొర్లె కిరణ్‌ను గెలిపించారు. ఏమైనా మార్పు వచ్చిందా? ఒక్క రోడ్డు కూడా వేయలేదు. అభివృద్ధికి కేంద్రంగా ఉన్న ఎచ్చెర్లను అవినీతి కేంద్రంగా చేశారు. కేట్ కట్ చేసినట్లుగా ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతం ఇచ్చి దోచు కోమన్నారు అంటూ దుమ్మెత్తిపోశారు. ఒక్క ఇసుకలోనే రూ.50 కోట్లు దోచుకున్నారని, 4 కొండలు మింగే శారని, గ్రావెల్ అమ్మి 75కోట్లు సంపాదించారంటూ ఎమ్మెల్యే అవినీతి చిట్టాపై లెక్కలు చెప్పారు. సొంత ఊరిలో ఉన్న భూముల్లో కూడా నకిలీ పత్రాలు సృష్టిం చి దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ గ్రామస్తులు రెండు నెలలు ఓపిక పడితే విచారించి ఆ భూములు తిరిగి ఇప్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చా రు. అంగన్ వాడీ, ఆశావర్కర్ల పోస్టులు, చివరకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అమ్ముకుంటున్న ఘనత వైసీపీకి, ఆ పార్టీ నేతలకే దక్కుతుందని దుయ్యబట్టారు.
వైకాపా నాయకులు సొంత నేతలనూ హత్యచేసే స్థితికి దిగజారారని, ఎమ్మెల్యే, ఎంపీపీ కలిసి ఏకంగా వాళ్ల వైస్ ఎంపీపీ శంకర్‌ను చంపేందుకు ప్రయత్నించారని విమర్శిం చారు. ఇవాళ ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. వారికో కరపత్రం ఉంది. దొంగ పేపర్ సాక్షి విలేకరిని ఈ ఎమ్మెల్యే వెంటాడటంతో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత వ్యక్తులను చంపేందుకూ వెనుకాడటం లేదంటూ విమర్శలు గుప్పించారు. 2024లో టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే మొదటి ఏడాదిలో తోటపల్లి పెండిరగ్ కాలువ పనులన్నీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఎచ్చెర్లలో ఐఐఐటీకి 200 ఎకరాలు కేటాయించాం. ఆ పనులు కూడా యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని వరాలు కురిపించారు. అంబేద్కర్ యూనివర్సిటీలో స్టేడియం కడతామని, ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బూరగట్లపాలెం దగ్గర ఆనాడు జెట్టీ కట్టడానికి నిధులు కూడా కేటాయించాం.
ఇప్పుడు పనులు ఆగిపోయాయి. టీడీపీ వస్తే పూర్తిచేస్తామన్నారు. మత్య్సకారులకు వలలు, బోట్లు ఇచ్చాం. ఐస్ బాక్స్‌లు అందజేశాం. వేట నిషేధం సమయంలో పెన్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు అనేక సబ్సీడీలు రద్దు చేశారు. అవన్నీ తెలుగు దేశం ప్రభుత్వం తిరిగి అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ‘నిరుద్యోగ యువతీ యువకులకు హామీ ఇస్తున్నా. అనంత కియా మాదిరిగా ఉత్తరాంధ్రకు పెద్ద పరిశ్రమ తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటా. ఇప్పుడున్న సెజ్‌కంటే పెద్దది కడతాం. స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం’ అని యువత హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
‘అన్న ఎన్టీఆర్ మనకు దేవుడు. చంద్రబాబు రాముడు. వైకాపా కార్యకర్తలకు నేను చండశాసనుడిని. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. మేంవచ్చిన తర్వాత విచారించి జైలుకు పంపిస్తాం. ఎర్రబుక్ చూస్తే వాళ్లకు ఉచ్చ పడుతోంది.
అందుకే కోర్టుకు వెళ్లి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని పిటిషన్ వేశారు. ఎచ్చెర్లలోనే ఉన్నా.. దమ్ముంటే అరెస్ట్ చేయండి. నేనెప్పుడు పరదాలు కట్టుకుని తిరగలేదు. అవినీతిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం’ అని వైసీపీని సవాల్ చేశారు. కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. బూత్‌లో బాగా పనిచేసే వారికి, టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని ప్రామిస్ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సైకోలను తిప్పికొట్టేందుకు టీడీపీ-జనసేన కార్యకర్తలు కలసికట్టుగా కృషిచేయాలని లోకేష్ పిలుపునిచ్చారు.