తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల కె కోటపాడు మండలం గుల్లిపల్లి గ్రామంలో శనివారం జరిగిన ఇదేమి ఖర్మ రచ్చబండ కార్యక్రమ లో మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు పైలా ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలా మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ విధానాల మూలంగా నిరుద్యోగ యువత, రైతులు, దళిత, గిరిజన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు.
ఈ కార్యక్రమం లో ఇంచార్జి పీవీజీ కుమార్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాళ్లపల్లి దేముడు, ఎంపీటీసీ కసిరెడ్డి దేముడుబాబు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లపల్లి శ్రీరామమూర్తి, తంగేటి శ్రీను, కడుపుట్ల గంగరాజు, చౌడువాడ దేముడు, చౌడువాడ ఎర్రయ్య, బండారు గోవిందా, తదితర నాయుకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.