కొత్తవలస మండలం నిమ్మలపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రాన్ని కార్యక్రమానికి మాజీ శాసనసభ్యురాలు శృంగవరపుకోట నియోజకవర్గం ఇన్చార్జి కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ళ బాలాజీ, అప్పల రాంప్రసాద్ పాల్గొన్నారు.
అనంతరం కొత్తవలస మండలం, నిమ్మలపాలెం గ్రామంలో ‘‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పట్టణంలోని ప్రజలకు వివరిస్తూ, 2024 సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఈ ఎన్నికలలో టీడీపీ గెలిపించేలా కృషి చేసి చంద్రబాబు నాయుడు కి 2024 లో రాష్ట్ర ముఖ్య మంత్రి ని చేసి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలని పిలుపునిచ్చారు.