- పేదోళ్ల నోటికాడ కూడుతీయడం దుర్మార్గం
- టిడిపినేతలపై దాడులుచేసిన వారిని వదలం
- అవినీతి, అరాచకాలను ప్రశ్నిస్తే కేసులా?
- ఎంతమందిని అరెస్టు చేస్తారో చూస్తాం
- జనం తిరగబడితే మీ మూకలు పరారే!
- తెనాలిలో నరేంద్రనాథ్ కుటుంబానికి పరామర్శ
తెనాలి : రాష్ట్రంలో ఆకలిగొన్న పేదలకు పట్టెడన్నం పెట్టేం దుకు మాపార్టీ నేతలు వారి ఆర్థికస్థోమతకు అనుగుణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సొంతనిధుల తో అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేస్తున్నారు. ఈ విషయం లో జగన్‌రెడ్డికి కడుపుమంట దేనికో అర్థంకావడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. ఇటీవల తెనాలిలో మృతి చెందిన టిడిపి సీనియర్ నేత నరేంద్రనాథ్ కుటుంబాన్ని లోకేష్ గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్నా క్యాంటీన్‌లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. ఈ ప్రభుత్వం అన్నం పెట్టదు, పెట్టే వాళ్లను పెట్ట నివ్వదు.. మంగళగిరి, కుప్పం, తెనాలి అన్ని చోట్లా అన్న క్యాంటిన్లను అడ్డుకున్నారు. పేదవా డి నోటికాడ కూడు తీయడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభు త్వం ఎందుకు ఇంతలా భయపడుతోందని ప్రశ్నించా రు. టిడిపి అన్న క్యాంటిన్లు నడిపితే వారికి అభ్యంతరం దేనికి? తమిళ నాడులో జయలలిత అమ్మ క్యాం టీన్లు పెడితే స్టాలిన్ ప్రభుత్వం వాటిని కొనసాగిస్తోం ది. ప్రజలకు మేలు చేసే మంచి పనులు కొనసాగించకపోతే అన్నార్తుల ఆకలితీర్చేందుకు మేం ప్రయత్నిస్తుంటే జగన్‌రెడ్డి ప్రభుత్వం అడ్డుకోవడం వారిశాడిజాన్ని చాటుతోందని లోకేష్ పేర్కొన్నారు.
టిడిపినేతలపై వరుసదాడులు
టిడిపి నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి, విజయవాడలో చెన్నుపాటి గాంధీపై దాడి చేశారు. దాడికి పాల్పడిన వైసిపి మూకలను వదిలేది లేదని లోకేష్ స్పష్టం చేశారు. రేపు మా ప్రభుత్వం వచ్చాక వారి సంగతిచూస్తాం. తప్పు చేసినవారంతా శిక్ష అనుభవించక తప్పదని లోకేష్ హెచ్చరించారు. జగన్‌రెడ్డి అరాచకాలు, అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఎంతమందిపై పెడతారో చూస్తాం. నాపైనా 15 కేసు లు పెట్టారు, 7సార్లు స్టేషన్‌కు తీసుకెళ్లారు.. ఏం చేయగలిగారు.. ప్రజలు తిరగబడితే జగన్‌రెడ్డి మూకలు, పోలీసులు ఏమీ చేయలేరని లోకేష్ పేర్కొన్నారు.
నరేంద్రనాథ్ కుటుంబానికి అండగా ఉంటాం
ఇటీవల మరణించిన పారిశ్రామికవేత్త, పార్టీనేత పాటిబండ్ల నరేంద్ర నాథ్ కుటుంబాన్ని యువనేత లోకేష్ గురువారం పరామర్శించారు. నరేంద్రనాథ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. 2019 ఎన్నికల తర్వాత నరేంద్రనాథ్ నాకు పరిచయం అయ్యారు. టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారు. మళ్ళీ టిడిపి గెలవాలని బలంగా ఆకాంక్షించారు. ఆయన మరణించిన విషయం తెలిసి చాలా బాధపడ్డాను.నరేంద్రనాథ్ కుటుంబానికి టిడిపి అండగా ఉంటామని లోకేష్ భరోసా ఇచ్చారు.