- పేరుమార్పుతో జగన్ రెడ్డి నీచప్రవృత్తి బయటపడిరది
- చేతనైతే కడప స్టీల్ ప్లాంట్ కట్టి వైఎస్సార్ పేరు పెట్టుకో
- ఆవిర్భావం నుంచి టిడిపికి బిసిలే వెన్నెముక
- త్వరలో జయహో బిసి బేరి పేరుతో రాష్ట్రస్థాయి సదస్సు
- మేనిఫెస్టో రూపకల్పన బాధ్యత బిసి సాధికార కమిటీలకే
- అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిల రుణం తీర్చుకుంటాం
- తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
విజయవాడ : ఎంతో ఘనచరిత్ర కలిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాదిరిగా నేను ఆలోచించినట్లయితే ఈరోజు కడపకు వైఎస్‌ఆర్ పేరు ఉండేదా అనిప్రశ్నించారు. జగన్ ఎలా పుట్టారో..ఏ లగ్నంలో పుట్టారో కానీ.. నోరెత్తితే అన్ని అబద్దాలే మాట్లాడుతు న్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశంపార్టీ బిసి సాధి కార సమితికమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్ర మం విజయవాడ ఎ1 కన్వెన్షన్ ఆవరణలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి బిసిసెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర అధ్యక్షవహించగా, ముఖ్యఅతిధులుగా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుఎలా మార్చడానికి జగన్ ఎవరని నిలదీశారు. తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక ఎన్టీఆర్.. ఆయనపేరు మార్చి.. తెలుగువారందరినీ జగన్ అవమానించారని అన్నారు. మెడి కల్ యూనివర్సిటీని ఎన్టీఆర్ ఏర్పాటుచేస్తే.. మెడికల్ ఎడ్యుకేషన్‌కు తాను ప్రాధన్యతనిచ్చానని చెప్పారు. నేను తలుచుకుంటే కడపజిల్లాకు వైఎస్‌ఆర్ పేరు ఉండేదా, హర్టికల్చర్ యూనివర్శిటీకి వైఎస్‌ఆర్ పేరు కొనసాగేదా? మీకు చేతనైతే కడప స్టీల్ ప్లాంటు కట్టి మీ నాన్న పేరు పెట్టుకోండి. లేకపోతే ఏదైనా ప్రాజెక్టు నిర్మించి పేరుపెట్టుకోండి. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే అధికారం మీకు ఎవరిచ్చారు? పేరు మార్చడం వల్ల జగన్ తన నీచబుద్ది బయటపెట్టుకున్నారు.పేర్లు మార్చడం తనకు చేతకాదా.. అని ప్రశ్నిం చారు.
బీసీలే టిడిపికి వెన్నెముక!
తొలి నుంచి టీడీపీకి వెన్నెముక బీసీలే. తెలుగు దేశం ఆవిర్భావంతోనే బిసిలకు గుర్తింపు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం లభించింది. టీడీపీ వచ్చాక బీసీ ల్లో నాయకత్వం పెరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలకు టిడిపి ఎప్పుడూ రుణపడి ఉంటుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శా తం రిజర్వేషన్లు చేసింది టీడీపీనే, జగన్ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారు. జగన్ చర్యల వల్ల.. స్థానిక సంస్థల ఎన్ని కల్లో సుమారు 16,800మంది బీసీ నేతలకు అధికారం దూరమైంది. బీసీకి చెందిన ఎర్రన్నాయుడుకు గతంలో కేంద్ర కెబినెట్‌లో అవకాశం కల్పించాం. గత ఎన్నికల్లో కొద్దిమంది బీసీలు వివిధ కారణాల వల్ల పక్కపార్టీకి వెళ్లారు. అయితే ఈ మూడున్నరేళ్ల కాలం లో జగన్ అరాచక పాలన చూశాక బీసీలు తిరిగి టీడీపీకి వచ్చేస్తారనే నమ్మకం ఉంది. జగన్ బీసీల కోసం 56 కార్పొరేషన్లు పెట్టారు. కానీ ఒక్క లోన్ అయినా ఇచ్చారా? జగన్ హయాంలో 56 బీసీ కులా ల కార్పొరేషన్ల ఛైర్మన్‌లు తమకొద్దీ పదవులు అనే స్థా యికి వచ్చారు. బీసీ కులాల కార్పొరేషన్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజాధనం జగన్ జేబుల్లోకి వెళ్తోంది. ప్రతి సాయంత్రం తాడేపల్లి లో కూర్చొని జగన్ తన గల్లా పెట్టెపై లెక్కలేసుకుంటు న్నారు. ఏదోక రోజు జగన్ పాపాలపుట్ట పగలడం ఖాయం. రాష్ట్రాన్ని పాలించడం చేతకాని జగన్ త్వర లోనే జగన్ కాడి పడేస్తాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధంగా ఉన్నాం. జగన్‌లో పిరికితనం అభద్రతా భావం అలముకున్నాయి.అసెంబ్లీలో జగన్ అసహనం తో కన్పిస్తున్నారు…అచ్చెన్న పులిలా పోరాడుతున్నాడు.
బిసిల రుణం తీర్చుకుంటాం
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘన విజ యం సాధించబోతోంది. ఎన్నికల్లో గెలిచాక 142 బీసీ కులాల నుంచి నాయకత్వాన్ని పెంచుతాం. బిసిల రుణం తీర్చుకుంటాం. టీడీపీ ఏర్పాటు చేసిన బీసీ సాధికారిత సమితి బీసీ సమస్యలపై అధ్యయనం చేస్తుంది. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పెట్టాలో బీసీ సాధికారిత సమితినే సూచిస్తుంది. త్వరలోనే జయ హో బీసీ బేరీ నిర్వహిస్తాం. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తాం. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో అం శాలు అమలు చేస్తాం. జగన్ వచ్చాక విధ్వంసక పాలన సాగిస్తున్నారు. బడుగు,బలహీన వర్గాలే తనకులం.. బీసీలకు ప్రతినిధిగా భావించి పేదవాడి కోసం టీడీపీ సంపద సృష్టిస్తోంటే.. జగన్ ఆ సంపదను కొల్లగొడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో అందరికిచ్చే పథకాలే బీసీలకు ఇచ్చారు.. కానీ ప్రత్యేకంగా బీసీలకు ఏమీ ఇవ్వడంలేదు.
అడుగడుగునా బిసిలకు వేధింపులు
బిసిలను వేధించడమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బిసిలను హత్య చేయడం, బిసి నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించడం పరిపాటిగా మారింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తెలుగుదేశంపార్టీ బిసిలకు అండగా నిలుస్తుంది.ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. జగన్‌రెడ్డి బీసీ సబ్ ప్లాన్ పక్కన పెట్టేశారు.మూడేళ్లలో బీసీలకు ప్రత్యే కించి ప్రత్యేకంగా ఒక్క రూపాjైునా ఖర్చు పెట్టారా? ఆదరణ పనిముట్లు గోడౌన్‌లలో బెడుతున్నారు. లెటర్ ఇచ్చినందుకే అచ్చెన్నను 84 రోజుల పాటు జగన్ జైల్లో పెట్టించారు. నిర్మా ణ రంగంలో అందరూ బీసీలే ఉన్నా రని.. ఆ రంగాన్ని భ్రష్టు పట్టించారు. 20లక్షల మంది మత్యకారులు ఉంటే లక్ష మందికే సాయం చేశారు. చేనేత ల సబ్సిడీకి కోతలు పెట్టారు. బీసీ మాజీ మంత్రులపై అక్రమ కేసులు పెట్టారు. వైసిపి అధికారంలోకి వచ్చా క 39 మందిని రాజకీయ హత్యలు చేస్తే.. అందులో 26 మంది బీసీలు ఉన్నారు. పల్నాడులో హత్యలతో బీసీలను టార్గెట్ చేసి చంపేస్తున్నారు. బీసీలు అంటే అంత అలుసా? టిడిపి అధికారంలోకి రాగానే బిసిల ను వేధించిన అందరి భరతం పడతాం.
యువతకు జగన్ మందుషాపు ఉద్యోగాలిచ్చారు
అయిదేళ్లపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడి పించి తాను యువతకు ఐటీ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తే జగన్ వచ్చాక యువతకు వాలంటీర్లు, చేపల కొట్లు..మద్యం దుకాణాల్లో ఉద్యోగాలిస్తున్నారు. జగన్ విధ్వంసపాలన వల్ల ఏపీకి పరిశ్రమలు ఇప్పట్లో రావు. ఉపాధి,ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడాలేదు. విశా ఖ ఐటీ హబ్, రాయలసీమను హర్డ్‌వేర్ హబ్ చేయాల నుకున్నాం.జగన్ రాష్ట్రాన్ని సౌతాఫ్రికా, శ్రీలంకలా మారుస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసం టీడీపీ అధికా రంలోకి రావాల్సిన అవసర ఉంది. కమలహాసన్‌ను మించిన నటుడు జగన్. నాటకాలు బాగా వేస్తాడు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎంపీ కేశినేని నాని, గౌతు శిరీష, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ,కాల్వ శ్రీనివాసులు,నెట్టెం రఘురామ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపిలు కొన కళ్ళ నారాయణ, నిమ్మల కిష్టప్ప, టిడిపి ప్రధాన కార్య దర్శులు పంచుమర్తి అనురాధ, బుద్ధా వెంకన్న, గౌతు శిరీష, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్‌రెడ్డి సుబ్రహ్మణ్యం, టిడిపి బిసి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్య వాసంశెట్టి, నాగుల్ మీరా, వై.నాగేశ్వరరావు(యాదవ సంఘం), వీరంకి వెంకట గురుమూర్తి, బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్, శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు, తూర్పు కాపు సాధికార సమితి కన్వీనర్ కంది మురళి నాయు డు, గౌడ సాధికార కన్వీనర్ అశోక్ గౌడ్, యాదవ సాధికార కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్, ఎంబిసి కన్వీనర్ పెండ్ర రమేష్, బిసి సెల్ నాయకులు నాగ బాబు, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.