- తనకు సలహాలు ఇచ్చినవాళ్లు వైసీపీలో చేరుతున్నారని వ్యాఖ్య
- ముద్రగడ, జోగయ్యపై పరోక్ష విమర్శలు
అమరావతి: రాయలసీమ ప్రాంతం కొందరి కబంధహస్తాల్లో చిక్కుకు పోయిం దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం పవన్ సమక్షం లో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ…కాపునేతలు ముద్ర గడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మొన్నటి వరకు కొందరు తనకు సలహాలు ఇచ్చారని… ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారని ఎద్దేవాచేశారు. అవసరాల మేరకు మాట్లాడే వ్యక్తులు తన కు అవసరం లేదని అన్నారు. సీట్లు ఎన్ని తీసుకోవాలి, రాజకీయాలు ఎలా చేయాలి అనేవిషయంపై ఇలాంటి వాళ్ల సలహాలు, సూచనలు తనకు అవసరం లేదని చెప్పా రు. ఇకపై కాపురిజర్వేషన్ల గురించి కానీ, ఇతర అంశాలగురించి కానీ పద్ధతి ప్రకా రం మాట్లాడాలని పవన్ సూచించారు.
రాయలసీమ బానిస సంకెళ్లలో ఉండి పోయింది. ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో చిక్కుకుపోయింది.
వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, ఆయన తనయుడు మిథున్‌రెడ్డితో నాకు విభేదాలు లేవు. కానీ, సీమలో కొందరు నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మరోసారి వైసీపీ వస్తే ఈప్రాంతంలో ఇంకేమీమిగలదు. ఉపాధి కోసం చాలా మంది అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతున్నారు. భయం వదిలే స్తేనే పరిస్థితులుమారతాయి.జగన్ గుంపు నుంచి సీమను రక్షించుకోవాలి. వైకాపా నేతలు తిరుపతిని అడ్డగోలుగా దోచుకుం టున్నారు. నాకు వ్యక్తిగతంగా పలుకు బడి, డబ్బులుఉన్నాయి, పెద్ద కుటుంబం ఉంది. కానీ, అన్నీ వదులుకుని రాజకీ యాల్లోకి ఎందుకు వచ్చానంటే తెలుగు జాతి నా కుటుంబం అనుకున్నా. ఈసారి అణగారిన వర్గాలకు అండగా ఉందాం. చిన్న కులాల్లో ఐక్యత లేక జగనుకు ఊడి గం చేస్తున్నారు.
సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు మా ఆవరణలోకి వచ్చారు. రాజకీయాల్లో ఇదంతా సహజం అంటే కుదరదు. ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవించాలి.. లేదంటే సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక అలాంటి వారిని గుర్తు పెట్టు కుంటాం. వైసీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని పవన్ హెచ్చరించారు.