- పెన్షన్లు పెంచి నిరుపేదల కన్నీళ్లు తుడుస్తున్నారు
- ఒకటో తేదీ వస్తోందంటే పండుగ వాతావరణం
- ఆ తేదీ ఆదివారం వస్తే ఒకరోజు ముందే పంపిణీ
- ఆమెరికా కేసు నుంచి జగన్‌రెడ్డి తప్పించుకోలేరు
- త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు టూలెట్ బోర్డు ఖాయం
- రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి(చైతన్యరథం): పెన్షన్ పేరుతో వృద్ధులను జగన్‌రెడ్డి వంచిస్తే..సీఎం చంద్రబాబు మాత్రం పేదలను అక్కున చేర్చుకున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్ర సాద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతినెలా ఒకటో ప్రతి ఇంటి లోగిళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోందని..గత ప్రభుత్వానికి భిన్నంగా పేదలకు భరోసా కల్పి స్తూ చంద్రబాబు వారి కన్నీళ్లు తుడుస్తున్నారని తెలిపారు. నాడు అవ్వాతాతలకు జగన్‌రెడ్డి డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి పన్నుల భారం మోపడంతో వారి కళ్లలో బాధ తప్పించి ఆనందం లేదన్నారు. నేడు ప్రతినెలా ఒకటో తేదీ వస్తుందంటే చాలు అవ్వాతాతల కళ్లల్లో అవధులు లేని ఆనందం కనపడుతుందన్నారు. ఒకటో తేదీ ఆదివారం వస్తే పెన్షన్ అం దక పేద ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని తల్లడిల్లి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి నాంది పలికిన తొలి నాయకుడు సీఎం చంద్రబాబు అని ప్రశం సించారు.
జగన్ ప్రభుత్వం పెన్షన్లను ఆపి కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపు లు చేస్తే.. కూటమి ప్రభుత్వం పేదలకు ఒకరోజు ముందే పింఛన్లు ఇస్తుందని తెలిపారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పింఛన్ల పంపిణీ జరుగుతుందన్నారు. వర్షాలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశం దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలపై నేడు విషం చిమ్ముతున్న వారిని ప్రజలు ఏనాడో ఛీకొట్టారు.. ఇక ఎన్ని ఎత్తులు వేసినా జగన్‌రెడ్డి అమెరికా కోర్టులో ముద్దాయిగా తేలడం తథ్యం.. త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు టూలెట్ బోర్డు పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు.